»   » టీజ‌ర్ చూసి ఏంట‌య్యా నా కొడుకు ఇట్టా ఉన్నాడు అన్నాడు

టీజ‌ర్ చూసి ఏంట‌య్యా నా కొడుకు ఇట్టా ఉన్నాడు అన్నాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : నందమూరి కళ్యాణ్‌రామ్‌ కథానాయకుడిగా నందమూరి తారక రామారావు ఆర్ట్స్‌ పతాకంపై పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో నందమూరి కళ్యాణ్‌రామ్‌ నిర్మిస్తున్న పవర్‌ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'ఇజం'.

ఈ చిత్రాన్ని అక్టోబర్‌ 20న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో విడుదల కార్యక్రమం బుధవారం జరిగింది. ఈ సినిమా బిగ్ సీడీని నంద‌మూరి హ‌రికృష్ణ విడుద‌ల చేశారు. ఎన్టీఆర్ ఆడియో సీడీల‌ను అందుకున్నారు.

త‌న యాక్టింగ్ చూసి చాలా గ‌ర్వంగా అనిపించింది

త‌న యాక్టింగ్ చూసి చాలా గ‌ర్వంగా అనిపించింది

పూరి జ‌గ‌న్నాథ్ మాట్లాడుతూ ``ఇజ‌మ్ టీజ‌ర్ హ‌రికృష్ణ‌గారికి న‌చ్చి నాకు రెండు పావురాల‌ను ఇచ్చారు. అవి గుడ్లు కూడా పెట్టాయి. టీజ‌ర్ చూసి ఏంట‌య్యా నా కొడుకు ఇట్టా ఉన్నాడు అని అన్నారు. మూడు నెల‌ల్లో క‌ల్యాణ్‌రామ్ 30 కిలోలు త‌గ్గారు. అది మామూలు విష‌యం కాదు. త‌న యాక్టింగ్ చూసి చాలా గ‌ర్వంగా అనిపించింది. త‌ప్ప‌కుండా చూసిన వాళ్లంద‌రూ కూడా అది ఫీల‌వుతారు. కోర్టు సీనుల‌న్నీ నంద‌మూరి వారి అకౌంట్‌లోనే ఉన్నాయి. ఈ సినిమాలోనూ ఓ కోర్టు సీను ఉంది. చాలా బాగా చేశాడు. ఆ సీను చూసి తార‌క్ యాహూ అని అరిచాడు. అనూప్ నాకు ఈ సినిమాలో ఓ పాట‌ను రాసే , పాడే అవ‌కాశాన్నిచ్చాడు. పాట రాయ‌డం ఎంత క‌ష్ట‌మో అర్థ‌మైంది. దానికి బ‌దులు ఓ క‌థ రాసుకోవ‌చ్చ‌నిపించింది. `` అని చెప్పారు.

హరి కృష్ణ మాట్లాడుతూ...

హరి కృష్ణ మాట్లాడుతూ...

హ‌రికృష్ణ మాట్లాడుతూ ``ఇపుడు నా వ‌య‌సు 60. ఈ జీవితంలో ఎవ‌రూ పొంద‌లేని, అనుభ‌వించ‌లేని ఆనంద స‌మ‌యాల‌ను చూశాను. నంద‌మూరి రామారావు గారి ద‌గ్గ‌ర 30 ఏళ్లు ప‌నిచేశా. ఆయ‌న‌తో నాకున్న అనుభ‌వాలు హిమాల‌య శిఖ‌రాల‌ను మించాయి. సినిమా రంగంలో ఆయ‌న‌తో ఎన్నో విజ‌యాలు చూశాను. రాజ‌కీయాల్లో పార్టీ పెట్టి పోరాటం చేసి గెలిచాం. వెల‌క‌ట్ట‌లేని వీరాభిమానులు ఇవాళ మా సొంతం. ఎవ‌రూ త‌స్క‌రించ‌లేనిది అభిమానం. ఆంధ్ర‌రాష్ట్ర ప్ర‌జ‌లు నా బిడ్డ‌ల‌కు ఆ అభిమానాన్ని పంచుతున్నారు. నా 59వ ఏట జూనియ‌ర్ టెంప‌ర్ హిట్ ఇచ్చాడు. క‌ల్యాణ్‌రామ్ ప‌టాస్ ఇచ్చాడు. నా 60వ ఏట జూనియ‌ర్ జ‌న‌తాగ్యారేజ్ హిట్ ఇచ్చాడు. క‌ల్యాణ్ ఇప్పుడు ఇజంతో ముందుకు రాబోతున్నాడు. హిట్ కొడ‌తాడ‌నే న‌మ్మ‌కం ఉంది. మా నాన్న క‌డుపున పుట్ట‌డ‌మే నేను చేసుకున్న మ‌హ‌ద్భాగ్యం. ఆయ‌న ఆశీస్సులు పిల్ల‌ల‌కున్నాయి. కృషితో నాస్తి దుర్భిక్షం అనే మాట‌ను నా ఇద్ద‌రు పిల్ల‌లూ గుర్తుంచుకున్నారు. అన్నారు.

పూరి బూతులు కూడా అందంగా చెబుతారు

పూరి బూతులు కూడా అందంగా చెబుతారు

ప్ర‌కాష్‌రాజ్ మాట్లాడుతూ ``అనూప్ సంగీతం అంటే నాకు చాలా ఇష్టం. రీరికార్డింగ్‌లోనూ నాకు రాజాగారిని గుర్తుచేస్తాడు. `ఇజం` చూస్తుంటే కళ్యాణ్ రామ్ లో ఉన్న ఆక‌లి తెలుస్తోంది. నాలాంటి న‌టుల‌కు ఆ ఆక‌లి అర్థ‌మ‌వుతుంది. వండ‌ర్‌ఫుల్‌గా చేశాడు. గొప్ప కుటుంబం నుంచి వ‌చ్చిన వ్య‌క్తి అత‌ను. అయినా క‌ష్ట‌ప‌డుతున్నాడు. ఆయ‌న ప‌డే త‌ప‌న నాకు తెలుసు. ఎన్టీఆర్ నా దృష్టిలో జెన్యూన్ ఆర్టిస్ట్. నాకు పూరి ఆక‌లి తెలుసు. విజ‌న్ తెలుసు. క‌ల్యాణ్ సినిమా ఏమాత్రం బావున్నా సూప‌ర్‌డూప‌ర్ హిట్ అవుతుంది. జ‌గ్గు ఈజ్ ఎ స్ట్రీక్‌. పూరి బూతులను కూడా అందంగా చెబుతారు. అది కూడా తమలోని భావాలను ఎక్స్ ప్రెష్ చేసే భాష అని ఆయన ఎంతో బాగా చెబుతారు. అన్నిట్లోనూ పూరి ఎప్పుడూ అప్‌డేట్‌గా ఉంటారు. మాస్‌కి క్లాస్ ట‌చ్ ఇవ్వ‌గ‌ల ద‌ర్శ‌కుడు ఆయ‌న‌. ఎడిటింగ్ ప్యాట‌ర్న్స్ నుంచి ఆయ‌న‌కు అన్నీ తెలుసు అన్నారు.

పూరి చేతిలో పడ్డాను, పెద్ద హీరోయిన్ అవుతాను

పూరి చేతిలో పడ్డాను, పెద్ద హీరోయిన్ అవుతాను

హీరోయిన్ అదితి ఆర్య మాట్లాడుతూ ``ముందు క‌ల్యాణ్‌రామ్ గారిని చూసి పెద్ద కుటుంబం నుంచి వ‌చ్చారు ఆరోగెంట్‌గా ఉంటారేమోనని అనుకున్నా. అయితే చాలా సాఫ్ట్ గా అనిపించారు. పూరి గారితో చేసిన హీరోయిన్లు పెద్ద స్థాయికి వెళ్లారు. ఆ స్థాయికి నేను వెళ్లాలని కోరుకుంటున్నాను అన్నారు.

English summary
Puri Jagannadh about Kalyan Ram. ISM Movie Audio Launch event held at Hyderabad. Nandamuri Harikrishna, Jr NTR, Nandamuri Kalyan Ram, Aditi Arya, Puri Jagannadh, Ali, Anup Rubens, Prakash Raj, BVSN Prasad, Dil Raju, Tanikella Bharani, Ravi Kumar Bhaskarabhatla, Ajay Ghosh, Nandamuri Mohana Krishna, Anasuya graced the event.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X