మహేశ్ బాబు సినిమాపై పూరీ జగన్నాథ్ క్లారిటీ.. అసలు కారణం చెబుతూ ట్వీట్
తెలుగు సినీ ఇండస్ట్రీలోని స్టార్ డైరెక్టర్లలో పూరీ జగన్నాథ్ ఒకడు. పవన్ కల్యాణ్ నటించిన 'బద్రీ'తో దర్శకుడిగా పరిచయం అయిన ఆయన.. ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్లను ప్రేక్షకులకు అందించాడు. అంతేకాదు, హీరో క్యారెక్టరైజేషన్‌ను ప్రత్యేకంగా డిజైన్ చేయగల నైపుణ్యం ఆయన సొంతం. అందుకే పూరీతో సినిమా చేయాలని ఎంతో మంది హీరోలు ప్రయత్నాలు చేసేవాళ్లు. అలాంటి క్రేజ్ ఉన్న ఈ డైరెక్టర్ చాలా కాలం పాటు గడ్డు పరిస్థితిని ఎదుర్కొన్నాడు.
రామ్ పోతినేనితో తీసిన 'ఇస్మార్ట్ శంకర్'తో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కాడు పూరీ జగన్నాథ్. పక్కా మాస్ మసాలా జోనర్‌లో వచ్చిన ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ అవడంతో పాటు ఎన్నో రికార్డులను తిరగరాసింది. ఇక, దీని తర్వాత విజయ్ దేవరకొండతో ఆయన 'ఫైటర్' అనే సినిమాను చేస్తున్నాడు. పాన్ ఇండియా రేంజ్‌లో రాబోతున్న ఈ చిత్రం కోసం ఎక్కువ సమయం ముంబైలోనే గడుపుతున్నాడు. ఈ నేపథ్యంలో పూరీ జగన్నాథ్.. మహేశ్ బాబు మూవీ గురించి ఓ ట్వీట్ చేశాడు.

మహేశ్ బాబు ప్రస్తుత పరశురాం దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' అనే సినిమా చేస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్ ఎంటర్‌టైనర్స్‌తో కలిసి మహేశ్ ఈ చిత్రాన్ని స్వయంగా నిర్మిస్తున్నాడు. ఇందులో కీర్తీ సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఆ వివరాలను దర్శకుడు పరశురాం రీట్వీట్ చేశారు.
దీనిపై డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ స్పందించాడు. 'పరశురాం సర్కారు వారి పాట స్టార్ట్ చేసిన సందర్భంగా నీకు శుభాకాంక్షలు. నేను ముంబైలో ఉండడం వల్ల పూజా కార్యక్రమానికి హాజరు కాలేకపోయాను. అయినప్పటికీ నీ మీద నా ప్రేమ ఎల్లప్పుడూ ఉంటుంది. చిత్ర యూనిట్‌కు ఆల్ ది బెస్ట్. ఈ సినిమా మహేశ్ బాబు ఫ్యాన్స్‌కు మంచి ట్రీట్ అవుతుందని ఆశిస్తున్నా' అంటూ ట్వీట్ చేశాడు. దీనిపై సూపర్ స్టార్ అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.


Click it and Unblock the Notifications











