»   » డ్రగ్స్ కేసు: పూరి దంపతుల్లో ఆ సంతోషం మాయం, ఇరికించారని ఫ్యాన్స్!

డ్రగ్స్ కేసు: పూరి దంపతుల్లో ఆ సంతోషం మాయం, ఇరికించారని ఫ్యాన్స్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ డ్రగ్స్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణ నేపథ్యంలో పూరి మీద మీడియాలో లేని పోని ప్రచారం జరుగుతుండటంతో ఆయన ఫ్యామిలీ తీవ్ర మనోవేదనకు గురవుతోంది.

మీడియా మిత్రులు తనపై అబాంఢాలు వేస్తున్నారని.... తాను ఏ తప్పూ చేయకున్నా చేసినట్లు సీన్ క్రియేట్ చేస్తున్నారని.... ఇలాంటి వార్తలు తమ జీవితాలపై పెనుప్రభావం చూపుతుందని పూరి ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. టీవీలో వార్తలు చూసి తన భార్య ఏడుస్తుందని, తప్పుడు ప్రచారం ఆపాలని పూరి మీడియాకు విన్నవించారు.

పూరి-లావణ్య ఇంటర్వ్యూను గుర్తు చేసుకుంటున్న అభిమానులు

పూరి-లావణ్య ఇంటర్వ్యూను గుర్తు చేసుకుంటున్న అభిమానులు

డ్రగ్స్ కేసు కంటే కొన్ని రోజుల ముందే పూరి దంపతులు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఎంతో సంతోషంగా కనిపించారు. తమ జీవితానికి సంబంధించి విషయాలను పంచుకున్నారు. కొన్ని రోజుల క్రితం పూరి-లవణ్య జంట మొహంలో ఆనందం చూశాం, అంతలోనే డ్రగ్స్ కేసు మూలంగా వారి మొహాల్లో ఆనందం మాయమైందని అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. పూరిని ఈ కేసులో అనవసరంగా ఇరికించారని అభిమానులు అభిప్రాయ పడుతున్నారు.

Puri Jagannath daughter reacted over Drugs Rumor on Her Father
ప్రేమ వివాహం

ప్రేమ వివాహం

సదరు ఇంటర్వ్యూలో పూరి దంపతులు పెళ్లికి ముందు తమ ప్రేమ వ్యవహారాన్ని పంచుకున్నారు. హైదరాబాద్‌ రామాంతపూర్‌లోని ఓ ఇంట్లో షూటింగ్ చేస్తున్న పూరీ ఆ ఇంటి ఓనర్ కూతురితోనే తొలి చూపులో ప్రేమలో పడ్డారు. ఆ అమ్మాయే తర్వాత పూరి భార్య అయింది. ఆవిడే లావణ్య పూరి.

మొహమాట పడకుండా ట్రై చేసిన పూరి

మొహమాట పడకుండా ట్రై చేసిన పూరి

షూటింగ్ సమయంలో తనను చూసి పూరీ తన చేతిలోని సిగరెట్‌ను కింద పడేశారని, తర్వాత ఒక ఆర్టిస్ట్‌తో విజిటింగ్ కార్డు పంపించారని, దాన్ని తాను తిప్పి పంపితే, మళ్లీ మళ్లీ పంపించారని లావణ్య గుర్తు చేసుకున్నారు. రెండు సార్లు తిప్పి పంపించి, మళ్లీ వారం తరువాత తనే కాల్ చేసిందని పూరీ తెలిపారు.

లావణ్యలో నచ్చిన అంశం

లావణ్యలో నచ్చిన అంశం

లావణ్య కళ్లు బాగా నచ్చడంతో ఇంప్రెస్ అయ్యానని, ప్రేమలో పడ్డానని పూరీ ఈ ఇంటర్వ్యూలో చెప్పారు. పెళ్లి తర్వాత ‘నీకు ఏమేం వంటలు వచ్చు?' అని అడిగితే అన్నం, ఆమ్లెట్ అని చెప్పడంతో తన గుండె జారిపోయిందని, పెళ్లయ్యాక వంటలు రాక పోతే తానే నేర్పాను అని పూరీ అన్నారు.

ఇక్కడ ఎవ్వడూ పతివ్రత కాదు: ఆకాష్ పూరి షేర్ చేసిన వీడియో సంచలనం!

ఇక్కడ ఎవ్వడూ పతివ్రత కాదు: ఆకాష్ పూరి షేర్ చేసిన వీడియో సంచలనం!

డ్రగ్స్ కేసులో పూరి జగన్నాథ్‌ను విచారించడం, ఆయనపై మీడియాలో రకరకాలుగా ప్రచారం జరుగుతుండటం లాంటి పరిణామాల నేపథ్యంలో ఆయన తనయుడు ఆకాష్ పూరి షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

English summary
Director Puri Jagannadh Was Probed by SIT Officials. The Director's Fans Support Him in The Matter.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu