తేల్చి చెప్పిన పూరి: చిరంజీవి 150వ చేయడం లేదంట!

By Bojja Kumar

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా పూరి జగన్నాథ్ చేస్తున్నట్లు ఆ మధ్య అఫీషియల్ ప్రకటన వెలువడిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ఆయనే చేస్తున్నట్లు రామ్ చరణ్ కూడా స్పష్టం చేసారు. చిరంజీవి అభిమాని అయిన తనకు ఆయన సినిమా డైరెక్ట్ చేసే అవకాశం రావడం ఆనందంగా ఉందంటూ ఆ మధ్య పూరి ట్వీట్ కూడా చేసారు.

puri jagannadh

అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ ఈ ప్రాజెక్టు నుండి పూరి జగన్నాథ్ తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఓ అభిమాని పూరిని ఈ విషయమై ప్రశ్నించగా చిరంజీవి సినిమా చేయడం లేదనే విషయం ఖరారు చేసారట. ట్విట్టర్లో ప్రైవేట్ మెసేజ్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించినట్లు తెలుస్తోంది. ఈ విషయం అపీషియల్ గా ఖరారు కావాల్సి ఉంది.

అయితే ఈ విషయం తెలిసి మెగా అభిమానులు షాకవుతున్నారు. అసలు కారణమేంటో తెలియక అయోమయంలో పడ్డారు. పూరి జగన్నాథ్ ఇలా సడెన్ గా ఎందుకు తప్పుకోవాల్సి వచ్చింది అనేది తెలియాల్సి ఉంది. మరో వైపు ఈ ప్రాజెక్టు వివి వినాయక్ చేతికి వెళ్లిందని, రైటర్ చిన్ని కృష్ణ చిరంజీవి 150వ సినిమా కోసం ఫ్రెష్ స్టోరీ రాస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X