twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మీరు తీసుకున్న చొరవ గొప్పది.. చిరుపై పూరి జగన్నాద్ ప్రశంసలు

    |

    కరోనా వైరస్ కట్టడికి విధించిన లాక్‌డౌన్ కారణంగా ఎన్ని రంగాలు కుప్పకూలిపోయాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాదాపు రెండు నెలల పాటు అన్ని రంగాలు దాదాపుగా మూతపడ్డాయి. అందులో ముఖ్యంగా సినీ పరిశ్రమ అన్నింటి కంటే ముందుగా స్వచ్చందంగా లాక్‌డౌన్‌ను పాటించింది. తమంతట తాముగా క్వారంటైన్‌ విధించుకుంటున్నామని చెప్పి.. షూటింగ్స్‌ను వాయిదా వేసుకున్నాయి. మెగాస్టార్ చిరంజీవి తన ఆచార్య షూటింగ్‌ను నిలిపివేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు.

    అయితే నాల్గోదశ లాక్‌డౌన్‌లో దాదాపు అన్ని రంగాలు కొన్ని మినహాయింపులు ఇచ్చారు. అందులో భాగంగా సినీ పరిశ్రమకు కూడా కొన్ని సడలింపులు ఇవ్వాలని సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో గురువారం భేటీ అయ్యారు. నేడు సినీ పెద్దలందరూ కలిసి ముఖ్యమంత్రి అధ్యక్షతన మరోసారి భేటీ అయ్యారు. ఈ మేరకు షూటింగ్‌లు పున:ప్రారంభించుకోవడానికి కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. కొద్దిమందితో, కరోనా వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకుంటూ లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించకుండా షూటింగ్‌లు చేసుకోవచ్చని తెలిపారు.

    Puri Jagannadh Praises chiranjeevi To Meet KCR About Restart Shooting

    చిత్రసీమలో సమస్యలు, షూటింగ్స్ పున:ప్రారంభించడం, థియేటర్లు రీఓపెనింగ్ వంటి వాటిపై చొరవ తీసుకున్నందుకు మెగాస్టార్ చిరంజీవికి పూరి జగన్నాద్ థ్యాంక్స్ చెప్పాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో ట్వీట్ చేస్తూ.. 'చిరంజీవి సర్.. ఇదో గొప్ప చొరవ. ఇండస్ట్రీలోని పెద్దలందరూ కలిసి షూటింగ్స్ ప్రారంభం కావాలని, మన సినిమా భవిష్యత్తు కోసం మీరంతా తీసుకున్న చొరవ చాలా గొప్పది. కరోనాలాంటి విపత్కర పరిస్థితిలోనూ దీన్ని ముందుకు తీసుకెళ్లడం హర్షించదగ్గ విషయం. నేను కూడా త్వరలోనే ముంబై నుంచి వస్తాను.. వచ్చాక పూర్తి స్థాయిలో మీతోపాటే ఉంటాను. లవ్యూ ఆల్' అని చెప్పుకొచ్చాడు.

    English summary
    Puri Jagannadh Praises chiranjeevi To Meet KCR About Restart Shooting. He Says That Great initiative by you n all big people of TFI showing concern towards our shoot planning n future of our cinema family.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X