»   » ఇలా ఉందేంటి? పూరి జగన్నాథ్ ‘జ్యోతి లక్ష్మి’ టీజర్

ఇలా ఉందేంటి? పూరి జగన్నాథ్ ‘జ్యోతి లక్ష్మి’ టీజర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఛార్మి కౌర్ సమర్పణలో సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై. లిమిటెడ్‌, శ్రీశుభశ్వేత ఫిలింస్‌ పతాకాలపై పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో ‘జ్యోతిలక్ష్మీ' చిత్రం షూటింగ్ ప్రారంభం అయింది. ఉమెన్స్ డే సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ విడుదల చేసారు.

ఈ చిత్రంలో టైటిల్‌ పాత్రను ఛార్మి పోషిస్తోంది. పూర్తి లేడీ ఓరియెంటెడ్ చిత్రంగా దీన్ని తెరరెక్కిస్తున్నారు. టీజర్ చూస్తుంటే.... ఇది స్త్రీ వాద సినిమాగా స్పష్టమవుతోంది. స్త్రీ జాతిపై మగజాతి ఆధిపత్యాన్ని ప్రశ్నించేలా ఈ సినిమా ఉంటుందని టీజర్లో విడుదల చేసిన లైన్స్ చూస్తే స్పష్టం వుతోంది. జ్యోతి లక్ష్మి సినిమా అనగానే ఇది నిన్నటితరం ఐటం గర్ల్ జ్యోతి లక్ష్మి జీవితం గురించి అని అంతా అనుకుంటున్నారు. కానీ పూరి ‘జ్యోతి లక్ష్మి' కాన్సెప్టు ఇది కాదని స్పష్టమవుతోంది.

‘చేతికి గాజులు తొడిగి చేతకాని వాళ్లం అయిపోయామా... వంటింటి కుందేళ్లలాగా వందేళ్లయినా బ్రతికేద్దామా...ఆడోళ్లం ఆడోళ్లం మనం తోడేళ్లతో ఉంటున్నామా...ప్రాణాలు తోడేస్తూ ఉన్న నోరు మూసుకూర్చుందామా...' అంటూ విడుదలైన టీజర్ చూస్తుంటే సినిమా కాన్సెప్టు ఏమిటో ఇట్టే అర్థమవుతోంది.

Puri Jagannadh's Jyothi Lakshmi Movie First Look

ఛార్మి కౌర్‌, సత్య, వంశీ ప్రధాన పాత్రల్లో రూపొందనున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: పి.జి.వింద, సంగీతం: సునీల్‌ కశ్యప్‌, నిర్మాతలు శ్వేతలానా, వరుణ్‌, తేజ,సి.వి.రావు, దర్శకత్వం: పూరి జగన్నాథ్‌.

English summary
Watch Puri Jagannadh's jyothi Laxmi Motion Poster.Starring Charmme Kaur, Brahmanandam, Satya,Bhadram etc. This Movie is directed by Puri Jagannadh . Jyothi Lakshmi is Presented by Charmme Kaur and produced by Swetha Lana, Varun, Teja, CV Rao under CK Entertainments and Sree Subha Swetha films Banner. Music is Composed by sunil kashyap.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu