»   »  షాక్: టీమ్ మొత్తాన్ని తొలగించిన దర్శకుడు పూరి

షాక్: టీమ్ మొత్తాన్ని తొలగించిన దర్శకుడు పూరి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: దర్శకుడు పూరి జగన్నాధ్ తీసుకున్న నిర్ణయం ఇపుడు తెలుగు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. ఆయన ఆఫీసులో దాదాపు 25 మంది పని చేస్తారు. వారంతా తన సినిమాలకు సంబంధించిన వ్యవహారాలు చూసుకుంటూ ఉంటారు. ఉన్నట్టుండి ఆయన అందరినీ పనిలో నుండి తొలగించారు. ఆయన ప్రారంభించిన ‘రోగ్' మూవీ ఉన్నట్టుండి ఆగి పోవడం, ఇపుడు పూరి స్టాఫ్ మెంబర్స్ అందరినీ తీసేయడం చర్చనీయాంశం అయింది.

ఈ విషయమై పూరి జగన్నాథ్ స్పందిస్తూ...‘అవును, నా టీమ్ మొత్తాన్ని తొలగించాను. ఆఫీసు బాయ్ నుండి ప్రతి ఒక్కరినీ తీసేసాను. వారిలో ఎక్కువ మంది నాతో చాలా సంవత్సరాలుగా నాతో ఉన్నవారే. అదే నాకు పెద్ద పెద్ద సమస్యగా మారింది' అని పూరి చెప్పుకొచ్చారు.

 Puri Jagannadh sacks his entire team!

నా టీం కొంత కాలంగా బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదని పూరి చెప్పుకొచ్చారు. వారు నేను చెప్పే సూచనలు పాటించడం లేదు. వారిలో వారు కూడా ఒకరి మాట ఒకరు వినడం లేదు. వారిలో వారికి విబేధాలు ఉన్నాయి. ఈ నిర్ణయం ఒక రాత్రిలో తీసుకున్నది కాదు అని పూరి చెప్పుకొచ్చారు.

రెండు సంవత్సరాల క్రితమే నేను వారిని ఈ విషయమై హెచ్చరించాను. చాలా కాలం క్రితమే చెప్పాను. వారంతా ఒక టీంలా పని చేయడం లేదు. దీంతో నా వర్క్ సఫర్ అవుతోంది. వారని అలాగే కొనసాగిస్తే నా పని ముందుకు సాగదని అర్థమైంది. ఇప్పటికీ వారు నా మాట వినడం లేదు. ఎవరికి నచ్చినట్లు వారు చేస్తున్నారు. ఇంతకాలం ఓపిక పట్టాను.... చివరకు మొన్న గురువారం ఈవినింగ్ అందరినీ పిలిచి వెళ్లిపోమని చెప్పాను అని పూరి చెప్పుకొచ్చారు.స

English summary
Puri Jagannadh says “Yes, I have sacked my entire team... from the office boy to everyone else who has been working here in my establishment. Most of them have been with me for years. That was the root of the problem.”
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu