twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘పోకిరి’లో ఆ డైలాగు ఎలా పుట్టిందంటే... :పూరి

    By Srikanya
    |

    హైదరాబాద్ : 'పోకిరి' చిత్రంలో మహేష్ బాబు చెప్పే...'నేనెంత ఎదవనో నాకే తెలియదు'అనే డైలాగు ఎంత పాపులర్ అయ్యిందంటే చిన్న పిల్లలు కూడా దాన్ని వాడేస్తున్నారు. ముఖ్యంగా యువత ఈ డైలాగ్ కి కనెక్టు అయ్యింది. ఇంతకీ ఈ డైలాగు ఎలా పుట్టింది..దాని కథా కమామీషు ఏమిటి అన్నది పూరి జగన్నాధ్ మీడియాకు తెలియచేసారు.

    పూరి జగన్నాథ్ నేటివ్ ప్లేస్ ... నర్సీపట్నం దగ్గర్లోని ఓ పల్లెటూరు. సినిమాలు చూడాలంటే వైజాగ్ వెళ్లాల్సిందే. పూరీకి చిన్నప్పటినుంచీ సినిమాలంటే తెగ పిచ్చి. కానీ వాళ్ల నాన్నకు ఈ సినిమాలంటే పడేది కాదు. అందులోనూ ...అస్తమానూ వైజాగంటే నాన్న ఒప్పుకోరు. అందుకే పూరి జగన్నాథ్ ఆర్‌ఆర్‌బి, బీఎస్సార్‌బీ ఎగ్జామ్స్ ఉన్నాయని అబద్దాలు చెప్పేసి వైజాగ్ వెళ్లిపోతూండేవారు.

    అలా సినిమాలకు వెళ్లినప్పుడల్లా వాళ్ల నాన్న ఖర్చులకు సరిపడా డబ్బులిచ్చేవారు. అదనంగా ఇంకో వంద ఇచ్చి, ''మిగతా ఖర్చుల గురించి నాకనవసరం. ఈ వంద మాత్రం ఎలా ఖర్చుపెట్టావో చెప్పు'' అనేవారట. ప్రతిసారీ ఇలాగే జరిగేది. అయితే ఎలా ఖర్చుపెట్టాడో తెలియకుండానే పూరి ఖర్చుపెట్టేసేవాడు.

    అప్పుడు వాళ్లనాన్నగారు...''నువ్వు ఆ వంద ఎలా ఖర్చుపెట్టావో తెలుసుకుంటే, నువ్వు ఎదవ్వో కాదో అని నాకర్థమవుతుంది. తర్వాత నీకర్థమవుతుంది'' అనేవారు. అప్పుడు పూరీకి ..''నేనెంత ఎదవనో నాకు ముందు తెలియాలి కదా'' అని అనిపించింది. అప్పుడే పూరి మనసులో ఈ డైలాగ్ పుట్టింది. దాన్నే ఈ సినిమాలో పెట్టారు.

    ఈ విషయమై పూరీ చెప్తూ.. ''ఎప్పుడో కాలేజ్ ఏజ్‌లో అనుకున్న డైలాగు 'పోకిరి'లో కరెక్ట్‌గా సూటయ్యింది. మహేశ్ చెప్పడానికి ఏమైనా ఇబ్బంది పడతాడేమో అనుకున్నా. కానీ తానేమీ పట్టించుకోకుండా చాలా ఎంజాయ్ చేస్తూ చెప్పాడు. ఈ సినిమా మొత్తం డైలాగుల పుట్ట. ఒకదాన్ని మించి ఒకటి ఉంటాయి'' అన్నారు.

    English summary
    Puri Jagannath revels behind Inspiration of Pokiri Dialogue.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X