For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఛార్మితో రిలేషన్​షిప్​పై పూరి జగన్నాథ్​.. ఆమె యంగ్​ ఏజ్​లో ఉంది కాబట్టే అంటూ..

  |

  టాలీవుడ్​ డ్యాషింగ్​ అండ్​ డేరింగ్​ డైరెక్టర్​గా ముద్ర వేసుకున్నాడు పూరి జగన్నాథ్​. సినిమా హిట్టయినా, ప్లాప్​ అయినా అతి తక్కువ సమయంలో చిత్రాలు చేస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తుంటాడు. ఇటీవల ఇస్మార్ట్​ శంకర్ సినిమాతో మళ్లీ ఫుల్ ఫామ్​లోకి వచ్చిన పూరి జగన్నాథ్​ తాజాగా తెరకెక్కించిన చిత్రం లైగర్. రౌడీ హీరో విజయ్​ దేవరకొండ, పూరి జగన్నాథ్​ కాంబినేషన్​లో వస్తున్న ఈ మూవీకి ఛార్మి నిర్మాతగా వ్యవహరించింది. అయితే గత కొద్ది రోజులుగా పూరి జగన్నాథ్, ఛార్మి మధ్య లివింగ్​ రిలేషన్​షిప్​ ఉన్నట్లు సోషల్​ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై తాజాగా పూరి జగన్నాథ్​ క్లారిటీ ఇచ్చాడు.

   50 ఏళ్ల మహిళ అయితే

  50 ఏళ్ల మహిళ అయితే

  సినీ ఇండస్ట్రీలో ఫ్రెండ్​షిప్, లవ్ అఫైర్స్​, సహజీవనం, పర్సనల్​ లైఫ్​ విషయాలపై వార్తలు, రూమర్లు రావడం సహజం. ఎప్పుడూ ఏదో ఒక పుకారు చక్కర్లు కొడుతూనే ఉంటుంది. వాటిపై దానికి సంబంధించిన వ్యక్తులు అవేవి పట్టించుకోకుండా తమ పని చూసుకుంటారు. అయితే ఆ పుకార్ల ప్రభావం ఎక్కువ ఉంటే మాత్రం వాటిలో నిజమెంత ఉందనే విషయాలపై క్లారిటీ ఇస్తారు. ఛార్మితో తన రిలేషన్​షిప్​పై తాజాగా తనదైన స్టైల్​లో జవాబిచ్చాడు డేరింగ్​ డైరెక్టర్​ పూరి జగన్నాథ్. ''ఆమె 50 ఏళ్ల మహిళ అయితే, ప్రజలు ఆ విషయం గురించి అంత పెద్దగా పట్టించుకోరు. ఆమె ఉబకాయంతో ఉన్నా, మరో వ్యక్తిని పెళ్లాడినా, ఎవరికీ ఎలాంటి బాధ ఉండదు అని అన్నారు.

  ఛార్మీ యంగ్ ఏజ్‌లో ఉంది కాబట్టే

  ఛార్మీ యంగ్ ఏజ్‌లో ఉంది కాబట్టే

  కానీ ఆమె (ఛార్మి) యంగ్​ ఏజ్​లో ఉంది కాబట్టే ఇద్దరి మధ్య ఏదో సంబంధం ఉందని ప్రజలంతా అనుకుంటున్నారు. ప్రతి జంటకు ఒక రొమాంటిక్​ యాంగిల్, లైంగిక ఆకర్షణ ఉంటుందనేది నేను నమ్ముతా. అయితే, అది చాలా త్వరగా చచ్చిపోతుంది. మనందరికి పెళ్లిళ్లు అయ్యాయి. ఆ కోరికలనేవి కొన్ని రోజులకు పోతాయని అందరికి తెలుసు.

  ఛార్మీ నాకు 13 ఏళ్ల నుంచి

  ఛార్మీ నాకు 13 ఏళ్ల నుంచి


  కేవలం ఫ్రెండ్​షిప్​ మాత్రమే కలకాలం ఉంటుంది. ఛార్మీ నాకు 13 ఏళ్ల నుంచి నాకు తెలుసు. అంటే సుమారు రెండు దశాబ్దాలుగా ఆమె గురించి తెలుసు. ఆమె ఎలా కష్టపడి పనిచేస్తుందో నాకు తెలుసు అని సమాధానమిచ్చాడు'' పూరి జగన్నాథ్​. కాగా మిక్స్​డ్​ మార్షల్ ఆర్ట్స్​ మూవీగా తెరకెక్కిన​ లైగర్ ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

  జ్యోతిలక్ష్మీ సినిమా సమయంలో

  జ్యోతిలక్ష్మీ సినిమా సమయంలో

  ఇక ఇదిలా ఉంటే 15 ఏళ్లకే సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టింది ఛార్మి కౌర్. రెండు దశాబ్దాల సినీ కెరీర్​లో ఛార్మి ఎన్నో సక్సెస్​, ఫెయిల్యూర్స్​ చూసింది. పూరి జగన్నాథ్​ దర్శకత్వంలో వచ్చిన జ్యోతిలక్షీ చిత్రం 2015లో విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఛార్మి హీరోయిన్​గా చేయడంతోపాటు నిర్మాతగా కూడా వ్యవహరించింది. అయితే ఆ మూవీ అంతగా విజయం సాధించలేదు.

  ఫెయిల్యూర్స్‌తో ఆర్థికంగా ఇబ్బందులు

  ఫెయిల్యూర్స్‌తో ఆర్థికంగా ఇబ్బందులు

  అనంతరం పూరి కనెక్ట్స్​ బ్యానర్​లో భాగస్వామిగా చిత్రాలు నిర్మించింది ఛార్మి. రోగ్, పైసా వసూల్, మెహబూబా వంటి సినిమాలను ఆమె నిర్మాతగా నిర్మించింది. అయితే ఇందులో పైసా వసూల్​ మినహా మిగతా చిత్రాలు వరుసగా ఫెయిల్యూర్స్​ చవిచూశాయి. దీంతో ఛార్మి ఆర్థికంగా బాగా నష్టపోయింది.

  ఆస్తులు అమ్మి.. ఇస్మార్ట్ శంకర్

  ఆస్తులు అమ్మి.. ఇస్మార్ట్ శంకర్


  సినిమా పరిశ్రమలో పోయినచోటే వెతుక్కోవాలన్న లక్ష్యంతో పూరి, ఛార్మి తమ ఆస్తులు అమ్మి ఇస్మార్ట్​ శంకర్​ తెరకెక్కించినట్లు సమాచారం. 2019లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్​ వద్ద భారీ విజయం సాధించింది. రామ్​ పోతినేని హీరోగా, నిధి అగర్వాల్, నభా నటేష్​ నటించిన ఈ మూవీ రూ. 75 కోట్ల వరల్డ్ వైడ్​ గ్రాస్​ రాబట్టింది.

  English summary
  Director Puri Jagannath Gives Clarity About His Relationship With Producer Charmy Kaur And Says She Is In Young Age
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X