అభిమానం: పూరి జగన్నాథ్ కు విగ్రహం పెట్టేసారు!
గతంలో పవన్ కళ్యాణ్ కు అభిమానులు విగ్రహం పెట్టడం చూసాం. తాజాగా దర్శకుడు పూరి జగన్నాథ్ కు కూడా అభిమానులు విగ్రహం పెట్టేసారు.
హైదరాబాద్: సినిమా రంగానికి చెందిన స్టార్లపై అభిమానులు తమ అభిమానాన్ని పలు రకాలుగా చూపిస్తుంటారు. గతంలో పవన్ కళ్యాణ్ కు అభిమానులు విగ్రహం పెట్టడం చూసాం. తాజాగా దర్శకుడు పూరి జగన్నాథ్ కు కూడా అభిమానులు విగ్రహం పెట్టేసారు.

కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలోని కొండాపూర్ గ్రామానికి ప్రభాకర్ ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసారు. విగ్రహావిష్కరణకు పూరీ తనయుడు ఆకాష్ ను పిలించారు. అభిమానుల పిలుపుతో అక్కడికి వెళ్లి ఆకాష్ తన తండ్రి విగ్రహాన్ని ఆవిష్కరించాడు.
ఒక సినీ డైరెక్టర్ కు విగ్రహం ఏర్పాటు చేయడం అరుదైన సంఘటన అని, తన తండ్రి విగ్రహం ఏర్పాటు చేయడం తనకు చాలా సంతోషంగా ఉందని అన్నారు ఆకాష్. తన తండ్రిపై అభిమానంతో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన కొండాపూర్ ప్రజలకు రుణపడి ఉంటానని, ఈ గ్రామం అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని అన్నాడు.


Click it and Unblock the Notifications











