»   » పూరి బ్రిలియంట్ డైరెక్టర్..అతనికి థాంక్స్ చెప్పుకోకుండా ఉండలేకపోతున్నా

పూరి బ్రిలియంట్ డైరెక్టర్..అతనికి థాంక్స్ చెప్పుకోకుండా ఉండలేకపోతున్నా

Posted By:
Subscribe to Filmibeat Telugu

పూరి జగన్నాథ్ బ్రిలియంట్ డైరెక్టర్. నేను దాదాపు మర్చిపోయిన వాటిని ఈ సినిమాతో చేయించి, చాలా కాలం తర్వాత నాకు ఇంత మంచి సినిమానిచ్చిన అతనికి థాంక్స్ చెప్పుకోకుండా ఉండలేకపోతున్నా'' అంటున్నారు బిగ్ బి అమితాబ్ బచ్చన్‌. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఆయన చేసిన 'బుడ్డా - హోగా తేరా బాప్'తో చాలా కాలం తర్వాత హిట్‌ని చవిచూడబోతున్నాననే నమ్మకం, ఆనందాన్ని ప్రకటిస్తూ ట్విట్టర్‌లో అలా రాసారు. అలాగే "మా సినిమా 'బుడ్డా - హోగా తేరా బాప్' టీజర్ ట్రైలర్‌కి వచ్చిన చక్కని స్పందనకి సంతోషంగా ఉంది.ఈ సినిమా ఫస్ట్ లుక్‌ని ఈ నెల 20న జరిగే ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా 60 సెకన్ల ట్రైలర్‌తో పాటు విడుదల చేయబోతున్నాం. భారతీయ సినీ సంగీత చరిత్రలోనే తొలిసారిగా సంగీత దర్శకులు విశాల్-శేఖర్ 'బుడ్డా' థీమ్ సాంగ్ కోసం 'డబ్ బీట్'ని ఉపయోగించారు. అదెంత బాగుందో! ఈ థీమ్ సాంగ్‌ని నేనే పాడా. ఇందులో ఆర్కెస్ట్రా సహా ప్రతి శబ్దంలోనూ నా గొంతు వినిపిస్తుంది. అలాగే విశాల్-శేఖర్ నా చేత 'హాలే దిల్' అనే మరో పాట పాడించారు. దాని బాణీలు అద్భుతం. అది మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది అన్నారు. పూరీ జగన్నాధ్ మొత్తానికి బాలీవుడ్ లో మంచి ఎంట్రీని ఇస్తున్నట్లు ఉంది కదూ.

English summary
Puri Jagannath you are brilliant! Thank you for giving me this film to go wild, nd for making me do stuff I had almost forgotten!...Amitabh
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu