»   » జన గణ మన పై మహేష్ మౌనం ఎందుకు...?

జన గణ మన పై మహేష్ మౌనం ఎందుకు...?

Posted By:
Subscribe to Filmibeat Telugu

టాలీవుడ్ బ్లాక్ బస్టర్ పోకిరీ వచ్చి పదేళ్ళైన సంధర్భంగా ఆన్ లైన్ లో మహేష్,పూరీ ల ఫ్యాన్స్ హంగామా ఎక్కువగానే కనిపించింది. మహేష్ అంత ఎక్సైటింగ్ గా ఫీల్ అయ్యాడో లేదో కానీ. సోషల్ మీడియా లో అభిమానుల హడావిడి మాత్రం ఎక్కువాగానే కనిఒపించింది.

ఆ రెస్పాన్స్ కి రియాక్ట్ అయ్యాడో లేదంటే నిజంగానే అనుకున్నాడో గానీ మహేష్ తో "జణ గణ మన" అనే సినిమా తీస్తున్నట్టు అనౌన్స్ చేసేసాడు పూరీ...

కానీ..! అసలీ ప్రాజెక్టు నిజంగా పట్టాలెక్కుతుందా అన్నదే కాస్త అనుమానంగా ఉంది. ఎందుకంటే ప్రస్తుతం బ్రహ్మోత్సవం ను రిలీజ్ కి రెడీ చేసిన మహేష్. ఆ తర్వాత మురుగదాస్ తో సినిమాను స్టార్ట్ చేయనున్నాడు.

Puri's 'Jana Gana Mana' With Mahesh Babu is the project is possible..?

తెలుగు - తమిళ్ ల లో ద్విభాషా చిత్రంగా గా ఈ ప్రాజెక్ట్ ని తెరకెక్కించనున్నాడు. ఇప్పటికే ఓవర్సీస్ లో పాగా వేసిన మహేష్.. తన మార్కెట్ ఇంకా పెంచుకునేలా ప్రాజెక్టులు టేకప్ చేస్తున్నాడు. పూరీతో ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడమంటే. మళ్లీ వెనక్కి వచ్చి తెలుగు సినిమాని మాత్రమే చేయడమే.

పైగా మహేష్ తో మూవీ చేస్తున్నానని గతంలో కూడా పూరీ చెప్పాడు కానీ. ఏదీ స్టార్ట్ అవలేదు. ప్రస్తుతం మహేష్ కు ఉన్న కమిట్మెంట్స్ ప్రకారం.. ఇప్పటికిప్పుడు పూరీతో సినిమాని ఒప్పుకున్నా అది పట్టాలెక్కటానికి కనీసం రెండేళ్ళు పడుతుంది. ఈలోగా ఈ ప్రాజెక్టు మళ్లీ వెనకబడిపోవచ్చని అంటున్నారు.

ఏదైనా కానీ. ఈ మూవీపై మహేష్ నుంచి ప్రకటన కానీ లేదంటే పక్కా సమాచారం ఉబంటే తప్ప నమ్మలేం...

English summary
Doubts about puri,mahesh new projet "Jana gana mana", why mahesh is silent on this movie
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu