twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బన్నీ సినిమాతో... పూరి జగన్నాథ్ సంచలన నిర్ణయాలు

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: దర్శకుడు పూరి జగన్నాథ్ తాజాగా బన్నీతో చేస్తున్న 'ఇద్దరమ్మాయిలతో' చిత్రంతో..... పలు సంచలన మార్పులు, నిర్ణయాలు తీసుకోవడం సర్వత్రా చర్చనీయాంశం అయింది. పూరి దర్శకత్వంలో వచ్చిన గత కొన్ని సినిమాలను పరిశీలిస్తే సంకేతిక నిపుణులతో పాటు కొన్ని విషయాలు చాలా మార్పులకు పూనుకున్నాడు పూరి.

    గతంలో పూరి తన సినిమాలకు ఎక్కువగా శ్యామ్ కె. నాయుడుని కెమెరామెన్‌గా, ప్రసాద్‌ను కో-డైరెక్టర్‌గా తీసుకునే వాడు. అయితే ఈ సినిమాతో ఈ ఇద్దరినీ మార్చేసి శ్యామ్ కె.నాయుడు స్థానంలో తరణీరావుని కో-డైరెక్టర్ గా తీసుకున్నారు. ఆర్డ్ డైరెక్ట్ చిన్నా స్థానంలో బ్రహ్మ కడలిని తీసుకున్నారు. అలాగే సంగీత దర్శకత్వ బాధ్యతలను ఈ సారి దేవిశ్రీ ప్రసాద్ కి అప్పజెప్పారు. ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమా రావడం ఇదే తొలిసారి.

    మరో వైపు ఈ చిత్రంతో పూరి జగన్నాథ్ ఫిల్మ్ రీల్ విధానానికి స్వస్తి చెప్పాడు. తన తాజా సినిమా 'ఇద్దరమ్మాయిలతో' నుండే ఈ ట్రెండ్ మొదలు పెట్టారు. ఇందుకోసం అత్యాధునికమైన 'ఆర్రి అలెక్నా కెమెరా సిస్టమ్స్' కొనుగోలు చేసారు. ఈ కెమెరాల ద్వారా హై క్వాలిటీ ఔట్ పుట్ వస్తుంది. ఇప్పటి వరకు ఈ టెక్నాలజీని 'లైఫ్ ఆఫ్ పై', స్కైఫాల్, అవెంజర్స్ లాంటి చిత్రాల్లో వాడారు. తెలుగులో తొలిసారిగా 'ఇద్దరమ్మాయిలతో' చిత్రానికి వాడుతున్నారు.

    ఇక ఇద్దరమ్మాయిలతో సినిమా విషయానికొస్తే...
    పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈచిత్రంలో అల్లు అర్జున్ సరసన అమలపాల్, కేథరిన్ హీరోయిన్లుగా చేస్తున్నారు. పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై బండ్ల గణేష్ ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రేమకథా నేపథ్యంలో పూరి స్టయిల్ లో ఈచిత్రం సాగుతుంది.

    ఇద్దరు అమ్మాయిలతో ఫారిన్ లో ప్రేమలో పడి వారితో హీరో పడే పాట్లు... అనే పాయింట్ చుట్టూ సినిమా తిరుగుతుంది. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: శ్యామ్‌.కె.నాయుడు, నృత్యాలు: దినేష్‌, కళ: చిన్నా, కూర్పు: ఎస్‌.ఆర్‌.శేఖర్‌, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌, కో-రైటర్స్: బి.వి.ఎస్. రవి, కళ్యాణ్‌ వర్మ.

    English summary
    Puri Team has been Changed. Director's favourite Cameraman Shyam K Naidu is replaced by Amol Rathod, while his favourite art-director Chinna is substituted by Brahma Kadali.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X