For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సినిమావాళ్లు, ఫ్యాన్స్ మాత్రమే కాకుండా వీళ్లు కూడా ఎన్టీఆర్ గురించే...

  By Srikanya
  |

  హైదరాబాద్‌: ఎన్టీఆర్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'జనతాగ్యారేజ్‌'. సమంత, నిత్యామేనన్‌ హీరోయిన్స్ గా చేసిన ఈ చిత్రంలో ప్రముఖ నటుడు మోహన్‌లాల్‌ కీలక పాత్ర పోషించారు. మైత్రీమూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ యెర్నేని, వై.రవిశంకర్‌, సీవీ మోహన్‌ నిర్మించారు. సెప్టెంబర్‌ 1న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం మంచి వసూళ్లు రాబడుతోంది.

  ఈ చిత్రాన్ని రియో ఒలింపిక్స్‌ రజత పతక విజేత పీవీ సింధు, బ్యాడ్మింటన్‌ కోచ్‌ గోపీచంద్‌, చాముండేశ్వరినాథ్‌ తదితరులు ఆదివారం రాత్రి చూడటం జరిగింది. వీరికోసం ప్రసాద్‌ ల్యాబ్స్‌లో ప్రత్యేకంగా షో ఏర్పాటు చేశారు. అనంతరం సింధు, గోపీచంద్‌ సినిమా గురించి మీడియాతో మాట్లాడుతూ చిత్ర యూనిట్ ని ప్రశంసించారు. ఆ ఫొటోలు మీరు ఈ క్రింద చూడవచ్చు.

  సింధు మాట్లాడుతూ...., " నేను జనతా గ్యారేజ్ సినిమా ని బాగా ఎంజాయ్ చేశాను. ఎన్టీఆర్ పెర్ఫార్మన్స్ చాలా బాగుంది. కంగ్రాట్స్ టు ది టీం", అని అన్నారు.

  డిస్ట్రిబ్యూటర్లకు బోలెడన్ని లాభాలు పంచుతున్న ఎన్టీఆర్.. ఇప్పటికే తన ఆల్ టైమ్ రికార్డ్ మూవీ నాన్నకు ప్రేమతోను దాటేసి.. ఇండస్ట్రీ ఆల్ టైమ్ హిట్స్ లోకి దూసుకుపోతున్నాడు.

  స్లైడ్ షోలో ఫొటోలు చూడండి...

  సినిమా చూసాక గోపీచంద్ మాట్లాడుతూ..

  సినిమా చూసాక గోపీచంద్ మాట్లాడుతూ..

  " సినిమా చాలా బాగుంది. మంచి కథా బలం ఉన్న సినిమా. ఎన్టీఆర్, మోహన్ లాల్ ల నటన ఎంతగానో ఆకట్టుకుంది. ఇంత మంచి చిత్రాన్ని అందించిన చిత్ర బృందానికి, దర్శకులు కొరటాల శివ గారికి కంగ్రాట్యులేషన్స్" అని అన్నారు.

  కలెక్షన్స్ కుంభవృష్ణి

  కలెక్షన్స్ కుంభవృష్ణి

  ఎన్టీఆర్ తాజా చిత్రం జనతా గ్యారేజ్ విడుదలయిన రోజునుంచీ తన ప్రభంజనాన్ని కొనసాగిస్తూనే ఉంది. అనుకోకుండా వచ్చిన వర్షాలు - దేశ వ్యాప్తంగా బందులు - మరోపక్క నెగిటివ్ రివ్యూలు ఇవేమీ అడ్డుకోలేకపోయాయి ఎన్టీఆర్ ప్రభంజనాన్ని. ఓ రకంగా ఎన్టీఆర్ కు ఈ సినిమా అన్ని విధాలుగా కలిసి వచ్చిందనే చెప్పాలి, అన్ని పాజిటివ్ ఏంగిల్సే ఒక్కసారిగా ఈ సినిమాకు కలిసాయి.

  నాన్ బాహుబలి చరిత్రలో

  నాన్ బాహుబలి చరిత్రలో

  నాన్ బాహుబలి సినిమాల చరిత్రలో కేవలం ఐదురోజుల్లోనే మొదటిస్థానాన్ని ఆక్రమించింది జనతా గ్యారేజి. ఈ సినిమాతో ఎన్టీఆర్ స్టామినా మరోసారి నిరూపితమైందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఈ సినిమాతో ఆయన కలెక్షన్స్ కొత్తి రికార్డ్ క్రియేట్ చేసాయి. ఇండస్ట్రీకు ఆశ్చర్యపోయే కలెక్షన్స్ ఈ సారి ఆయన ఇచ్చారు.

  ఈ స్ట్రాటజీ కూడా ఉపయోగపడింది

  ఈ స్ట్రాటజీ కూడా ఉపయోగపడింది

  యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ లో తొలి 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకున్న సినిమాగా రికార్డులు అందుకున్న "జనతా గ్యారేజ్" ఊపు ఈ వీక్ డేస్ కాస్త తగ్గిన మాట తెలిసిందే. అయితే అభిమానుల్లో కొత్త ఉత్సాహం నింపేందుకు చిత్ర యూనిట్ కొత్త స్కెచ్ వేసింది. కొరటాల శివ తన గత చిత్రాల ప్రమోషన్ల మాదిరే 'జనతా గ్యారేజ్'లో కూడా కొన్ని కొత్త సన్నివేశాలు జోడించి వదిలారు. అవే ఇప్పుడు జనాలను ధియోటర్స్ కు లాక్కువస్తున్నాయి.

  శ్రీమంతుడుని దాటినా మహేష్

  శ్రీమంతుడుని దాటినా మహేష్

  ప్రిన్స్ మహేష్ బాబు, తాజాగా 'జనతా గ్యారేజ్' సినిమా చూసి అభినందనలు తెలిపినట్లు సమాచారం. ఈ సినిమా దర్శకుడు కొరటాల శివతో ఇప్పటికే ప్రిన్స్ 'శ్రీమంతుడు' సినిమా చేయగా, మరో సినిమా జనవరి నుండి పట్టాలెక్కనుంది. ఈ నేపధ్యంలో ప్రస్తుతం ధియేటర్లలో సందడి చేస్తోన్న కొరటాల 'జనతా గ్యారేజ్' సినిమా చూసిన ప్రిన్స్, ఫోన్ చేసి అభినందనలు తెలిపారని ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. "జనతా గ్యారేజ్ కధను డీల్ చేసిన విధానం బాగుందని, స్క్రీన్ ప్లే అద్భుతంగా ఉంది" అంటూ కొరటాలను ప్రశంసలతో ముంచెత్తారట.

  శ్రీమంతుడుని దాటింది

  శ్రీమంతుడుని దాటింది

  తెలుగు సినిమా ఇండస్ట్రీలో 'బాహుబలి' తర్వాత స్థానంలో నిలిచిన 'శ్రీమంతుడు' రికార్డులను బద్దలు కొట్టే రేంజ్ లో ఓపెనింగ్స్ దుమ్ము దులుపుతోంది.అయితే ఇవేవో కాకి లెక్కలు కాదు అంటూ స్వయంగా నిర్మాతలే ఒక అధికారిక పోస్టర్ ను విడుదల చేసారు. అతి తక్కువ సమయంలో 50 కోట్ల క్లబ్ లో చేరిన సినిమాల జాబితాలో 'జనతా గ్యారేజ్' రెండవ స్థానంలో నిలిచిందని ఒక పోస్టర్ ను విడుదల చేసింది మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ.'శ్రీమంతుడు' సినిమా నిర్మాతలు కూడా వీరే కావడంతో, కలెక్షన్స్ పై మరింత స్పష్టతతో ప్రకటన వచ్చి ఉండవచ్చు అన్నది సినీ పరిశీలకుల మాట.

  ఎన్టీఆర్ ఈ మాటతో ఫుల్ ఖుషీ

  ఎన్టీఆర్ ఈ మాటతో ఫుల్ ఖుషీ

  ఇప్పుడీ చిత్రానికి 'గురు' హీరో విక్టరీ వెంకటేష్ ఆశీర్వాదాలు కూడా వచ్చేశాయి. 'జనతా గ్యారేజ్ చూసా. పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా. ఎన్టీఆర్.. మోహన్ లాల్ లు అద్భుతంగా నటించారు. టీం మొత్తానికి కంగ్రాట్స్' అంటూ తన ఆనందాన్ని షేర్ చేసుకున్నాడు వెంకటేష్. ఇది ఎన్టీఆర్ ను మరింతగా ఆనందపరిచే అంశం.

  అదిరే పార్టీ

  అదిరే పార్టీ

  ఇక జనతా గ్యారేజ్ సక్సెస్ ను పూర్తిగా ఎంజాయ్ చేస్తున్న ఎన్టీఆర్.. మూవీ యూనిట్ కి, డిస్ట్రిబ్యూటర్స్ కు గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఇండస్ట్రీ పెద్దలతో పాటు గ్యారేజ్ తో సంబంధం ఉన్న ప్రతీ ఒక్కరికీ ఈ వేడుక స్పెషళ్ మిగిలిపోనుంది. ఆ రేంజిలో ఎన్టీఆర్ ఏర్పాట్లు చేయిస్తున్నట్లు తెలుస్తోంది.

  యుఎస్ లోనూ అదే స్పీడుతో

  యుఎస్ లోనూ అదే స్పీడుతో

  ఇప్పటివరకూ యూఎస్‌ బాక్సాఫీస వద్ద ఈ సినిమా 1.7 మిలియన్ డాలర్లు (సుమారు 11.42కోట్ల రూపాయలు) వసూలు చేసింది. సెకండ్ వీకెండ్ కూడా యూఎస్‌లో సినిమా మంచి కలెక్షన్స్‌నే సాధిస్తూ వచ్చింది. అయితే లాంగ్‌రన్‌లో సినిమా 2 మిలియన్ దాటుతుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.

  బంద్ రోజుల్లోనూ దుమ్ము దులిపింది

  బంద్ రోజుల్లోనూ దుమ్ము దులిపింది

  యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్ మూవీ బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టిస్తోంది. రిలీజ్ రోజున రివ్యూలు ప్రోత్సాహకరంగా లేకపోయినా.. డివైడ్ మౌత్ టాక్ వచ్చినా.. అవేవీ గ్యారేజ్ సెన్సేషన్స్ కి బ్రేక్ వేయలేకపోయాయి. ఆఖరికి భారత్ బంద్ కూడా ఎన్టీఆర్ సినిమాను కొంచెం కూడా కదల్చలేకపోయింది. రీసెంట్ గా వైయస్ జగన్ పార్టీ పిలుపు ఇచ్చిన బంద్ రోజు కూడా కలెక్షన్స్ అదిరిపోయాయి.

  ఈ రికార్డ్ కూడా జనతాదే

  ఈ రికార్డ్ కూడా జనతాదే

  కలెక్షన్స్ విషయంలో ఇప్పటికే పలు రికార్డులు సృష్టించిన జనతా గ్యారేజ్... తాజాగా ఆల్ టైం తెలుగు - తమిళం - హిందీ - మలయాళం బాషల్లో విడుదలయిన సినిమాల్లో వలర్డ్ వైడ్ బాక్సాఫీస్ కలెక్షన్స్ లో కొత్త రికార్డులు సృష్టింంచడంతోపాటు.. మొదటి పదిరోజుల షేర్స్ విషయంలోనూ ముందుకు దూసుకుపోతుంది.

  అదే ఎన్టీఆర్ కు కలిసొచ్చింది

  అదే ఎన్టీఆర్ కు కలిసొచ్చింది

  రొటీన్ కి భిన్నంగా ఉన్న పాత్రలను ఎంచుకోవడంలో ఎన్టీఆర్ ఈ మధ్య బాగానే జాగ్రత్త పడటమే కలిసొచ్చింది. అదే కోవలో జనతా గ్యారేజ్ చేశాడు. అత్యంత భారీ అంచనాల మధ్య ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం గత గురువారం విడుదలైంది. ఓవర్ సీస్ లో కూడా జనతా రికార్డుల మోత మోగిస్తోంది. కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.

  ఎన్టీఆర్ ప్రూవ్ చేసాడు

  ఎన్టీఆర్ ప్రూవ్ చేసాడు

  గతంలో ఎన్టీఆర్ కు 50 కోట్ల క్లబ్ అంటే గగనం అనిపించేది. నాన్నకు ప్రేమతో ఫుల్ రన్ లో ఈ ఫీట్ సాధించగా.. ఇప్పుడు 4 రోజుల్లో ఆ క్లబ్ లోకి ఎంటర్ అయిపోయాడు. గ్యారేజ్ షుమారు 70 కోట్లు పైగా షేర్ (గ్రాస్ కాదు) ప్రపంచవ్యాప్తంగా వసూలు చేసిందని తెలుస్తోంది. జనతా గ్యారేజ్ తో తన రియల్ స్టామినా ఏంటో ఎన్టీఆర్ ప్రూవ్ చేశాడని చెప్పచ్చు.

  అన్ని కలిసి వస్తేనే కదా..

  అన్ని కలిసి వస్తేనే కదా..

  గురువారం రిలీజ్... సోమవారం నాడు వినాయక చవితి హాలిడే ఉండడం.. ఈ వీకెండ్ లో భారీ చిత్రాలేమీ రిలీజ్ కి లేకపోవడంతో.. ఎన్టీఆర్ కుమ్మేస్తున్నాడు. అవన్నీ ప్లాన్ చేసినట్లుగా కలిసొచ్చాయి. ఈ సినిమా కలెక్షన్స్ స్దాయి పెరగటానికి కారణం నిర్మాతల ఫెరఫెక్ట్ ప్లానింగ్ అంటున్నారు. నిర్మాతలు మైత్రీ మూవీస్ వారు గతంలో డిస్ట్రిబ్యూటర్స్ కావటం కలిసొచ్చిన అంశం.

  కేరళలలోనే వర్కవుట్ కాలేదు

  కేరళలలోనే వర్కవుట్ కాలేదు

  ఎన్టీఆర్ - కొరటాల కాంబినేషన్ లో వచ్చిన జనతా గ్యారేజ్ విడుదలైన అన్ని ఏరియాల్లో దుమ్ములేపే కలెక్షన్స్ తో రన్ అవుతుంటే , మలయాళం మాత్రం పెద్దగా వసూళ్లు రాబట్టలేకపోయింది. మోహన్ లాల్ ప్రధాన పాత్ర పోషించడం తో కేరళ హక్కులను 4.20 కోట్లకు స్వయంగా తీసుకున్నాడు. మోహన్ లాల్ , ఉన్నిముకుందన్ , నిత్యా మీనన్ , దేవయాని ఉన్నప్పటికీ కలెక్షన్స్ మాత్రం వారు ఊహించిన విధంగా రాలేకపోయాయి.

  English summary
  On Sunday, Gopichand and Sindhu watched NTR and Koratala Siva's 'Janatha Garage' in Hyderabad along with their families. They were accompanied by Hyderabad Badminton Association President Mr. Chamundeswarnath.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X