»   » నందమూరి హీరోల విజయాల వెనక అతనే అంటూ.....

నందమూరి హీరోల విజయాల వెనక అతనే అంటూ.....

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సినిమా హిట్టయితే.....ఆ సినిమాతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరూ తమ కృషి కూడా ఉందని చెప్పుకోవడం మామూలే. అదే సినిమా ఫట్టియితే ఆ సినిమాకు తాము పని చేసామని చెప్పుకోవడానికి కూడా ఇష్టపడరు. ఇదీ సినిమా లోకం తీరు. తాజాగా నందమూరి ఫ్యామిలీ నుండి మూడు వరుస విజయాలు వచ్చిన నేపథ్యంలో ఈ చిత్రానికి పైనాన్స్ చేసిన వ్యక్తి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.

నంద‌మూరి కుటుంబం నుంచి గ‌త ఏడాది కాలంలో వ‌చ్చిన బ్లాక్ బ‌స్ట‌ర్స్ లో ఒక కామ‌న్ పాయింట్ ఉంది. అదేంట‌న్న‌ది ఇప్ప‌టికే చాలా మంది ఊహ‌కు అందే ఉంటుంది. అవును, ప‌లువురు ఊహించిన ఆ కామ‌న్ అంశం పేరు పీవీపీ. ఏడాది కాలంలో విడుద‌లైన నంద‌మూరి మూడు చిత్రాల వెనుకా పీవీపీ ఉన్నారు.

PVP behind nandamuri blockbusters

బాల‌కృష్ణ లెజండ్‌, క‌ల్యాణ్ రామ్ ప‌టాస్‌, ఎన్టీఆర్ టెంప‌ర్‌. ఈ మూడు సినిమాల‌కు పీవీపీ మ‌ద్ద‌తిచ్చారు. ఈ మూడు సినిమాల‌కూ పీవీపీ ఫైనాన్షియ‌ల్ స‌పోర్ట్ చేశారు. పీవీపీ హ‌స్తం ఉంటే నంద‌మూరి సినిమాలు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బ్ర‌హ్మాండ‌మైన కాసుల వ‌ర్షం కురిపిస్తున్నాయ‌న్న విష‌యం ఇప్ప‌టికే అభిమానుల్లోకి, ప్రేక్షకులకీ చేరింది.

ఆ మ‌ధ్య టెంప‌ర్ ఆడియోలో పీవీపీ మాట్లాడిన తీరును బ‌ట్టే నంద‌మూరి అభిమానులు విజ‌యాన్ని గొప్ప‌గా ఊహించుకున్నారు. ఇప్పుడు వారి ఊహ‌ల‌న్నీ నిజ‌మ‌య్యాయి. టెంప‌ర్ నిర్మాణ ద‌శ నుంచే పీవీపీ అందులో ఉన్నారు. ప్ర‌తి చిన్న విష‌యంలోనూ త‌న‌వైన స‌ల‌హాలు, సూచ‌న‌లూ ఇచ్చారు. భ‌విష్య‌త్తుల్లోనూ ఎన్టీఆర్ ప్రాజెక్టుల వెనుక తానుంటాన‌ని పీవీపీ అన్న మాట‌లు అభిమానుల్లో నూత‌నోత్సాహాన్ని నింపాయి.

English summary
PVP behind nandamuri blockbusters. Prasad V. Potluri popularly known as "PVP" is a serial entrepreneur, philanthropist and educationalist.
Please Wait while comments are loading...