»   » ఘాజి దర్శకుడిపై న్యాయపోరాటం చేయనున్న నిర్మాత.. వివాదానికి కారణం!

ఘాజి దర్శకుడిపై న్యాయపోరాటం చేయనున్న నిర్మాత.. వివాదానికి కారణం!

Subscribe to Filmibeat Telugu

ఘాజి చిత్రంతో ప్రతిభ గల దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు సంకల్ప్ రెడ్డి. తొలి చిత్రంతోనే విజయాన్ని అందుకున్న ఈ దర్శకుడు ప్రస్తుతం వరుణ్ తేజ్ తో ఆసక్తికరమైన చిత్రాన్ని తెరకెక్కించడానికి సిద్ధం అవుతున్నాడు. సంకల్ప్ రెడ్డి తెరకెక్కించబోతున్న ఈ చిత్రం అంతరిక్ష పరిశోధన నేపథ్యంలో రూపుదిద్దుకోబోతోంది. వరుణ్ తేజ్ సరసన ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ అతిధి రావు హైదరి హీరోయిన్ గా నటిస్తోంది.

ఈ చిత్రానికి ఆరంభంలోనే చిక్కులు మొదలయ్యాయి. దర్శకుడు సంకల్ప్ రెడ్డి వివాదంలో చిక్కుకున్నాడు. ఘాజి చిత్రం ప్రముఖ నిర్మాత పొట్లూరి వరప్రసాద్ నిర్మణంలో పివివి బ్యానర్ లో తెరకెక్కింది. రెండవ చిత్రాన్ని కూడా తమ నిర్మాణంలోనే రూపొందించాలని నిర్మాత దర్శకుడితో కాంట్రాక్టు కుదుర్చుకున్నాడని వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు పివిపి నిర్మాణంలో కాకుండా రాజీవ్ రెడ్డి నిర్మణంలో ఈ దర్శకుడు సినిమా చేస్తుండడంతో వివాదం మొదలైంది.

 PVP to move legal action against director Sankalp Reddy

సంకల్ప్ రెడ్డిపై చట్టపరమైన పోరాటం చేయడానికి నిర్మాత సిద్ధం అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది కనుక జరిగిది వరుణ్ తేజ్ చిత్రానికి చిక్కులు మొదలైనట్లే అని చెప్పుకోవచ్చు. ఘాజి చిత్రం ఇండియా పాక్ మధ్య సబ్ మెరైన్ యుద్ధం నేపథ్యంలో రూపొందిన సంగతి తెలిసిందే.

English summary
PVP to move legal action against director Sankalp Reddy. Sankalp Reddy now readying for Varun Tej film
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X