»   »  ‘ప్యార్ మే పడిపోయానే’ ఆడియో వేడుక (ఫోటోలు)

‘ప్యార్ మే పడిపోయానే’ ఆడియో వేడుక (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఆది, శాన్వి జంటగా శ్రీసత్యసాయి ఆర్ట్స్ బ్యానర్లో తెరకెక్కుతున్న సినిమా 'ప్యార్ మే పడిపోయానే'. కె.కె.రాధామోహన్ నిర్మాత. రవిచావలి దర్శకత్వంలో తెరకెక్కిన ఈచిత్రం ఆడియో వేడుక సోమవారం హైదరాబాద్‌లోని రాక్ హైట్స్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి హీరో మంచు మనోజ్ ముఖ్య అతిథిగా హాజరై సీడీలను ఆ విష్కరించారు. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు.

ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులతో పాటు భీమినేని శ్రీనివాసరావు, అచ్చిరెడ్డి, సందీప్ కిషన్, తుమ్మలపల్లి సత్యనారాయణ, కె.వివి.సత్యనారాయణ, రాహుల్, దశరథ్, వరుణ్ సందేశ్, ప్రిన్స్, చైతన్య కృష్ణ, నాని, సందీప్ కిషన్, మల్టీ డైమన్షన్ వాసు, నవదీప్, రాకుల్ ప్రీత్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

ఆడియో వేడుకకు సంబంధించిన విశేషాలు, ఫోటోలు స్లైడ్ షోలో.....

ఆది మాట్లాడుతూ...

ఆది మాట్లాడుతూ...

రవిచావలిగారు కథ చెప్పగానే నాకు ఎంతో బాగా నచ్చింది. నిర్మాత ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమా తెరకెక్కించారు. లవ్ లీ తర్వాత నేను చేస్తున్న ఔట్ అండ్ ఔట్ లవ్ స్టోరీ. అనూప్ రూబెన్స్ మంచి సంగీతం ఇచ్చారు. నా మొదటి సినిమా నుండి అనూప్‌తో మంచి రిలేషన్ ఉంది. నా ప్రతి సినిమా విజయంలోనూ అనూప్ పాత్ర కీలకమైనది. సినిమాకు ప్రతి ఒక్క టెక్నీషియన్ కష్టపడి పని చేసారు. ప్రేక్షకులకు తప్పకుండా నచ్చే సినిమా ఇది అన్నారు.

సాయికుమార్ మాట్లాడుతూ...

సాయికుమార్ మాట్లాడుతూ...

ఆది, అనూప్ కాంబినేషన్ ఇప్పటికే హాట్రిక్ సాధించింది. ఇది నాలుగో సినిమా. రవి చావలి దర్శకత్వంలో నాకు నంది, ఫిల్మ్ ఫేర్ అవార్డులు వచ్చాయి. అటువంటి డైరెక్టర్‌తో పని చేయడం ఆనందంగా ఉంది. లవ్ లీ చిత్రం మాదిరి ఈ చిత్రం కూడా పెద్ద సక్సెస్ అవుతుంది అన్నారు.

మనోజ్ మాట్లాడుతూ...

మనోజ్ మాట్లాడుతూ...

నా సినిమా పాట ఈ చిత్రానికి టైటిల్ అయింది. చాలా ఆనందంగా ఉంది. ఈ చిత్రం పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను అన్నారు.

అనూప్ రూబెన్స్ మాట్లాడుతూ..

అనూప్ రూబెన్స్ మాట్లాడుతూ..

ఆదితో నాకు ఇది నాలుగవ సినిమా. ఆల్రెడీ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. రాధామోహన్ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రొడ్యూసర్. సినిమా పెద్ద హిట్టవ్వాలని కోరుకుంటున్నా అన్నారు.

శాన్వి మాట్లాడుతూ..

శాన్వి మాట్లాడుతూ..

లవ్ లీ చిత్రం పెద్ద హిట్టయింది. ఆదితో కలిసి చేస్తున్న ఈ సినిమా కూడా పెద్ద హిట్టవుతుందనే నమ్మకం ఉంది అన్నారు.

దర్శకుడు మాట్లాడుతూ..

దర్శకుడు మాట్లాడుతూ..

తెరపై కనిపించే వారితో పాటు...తెర వెనక పని చేసిన టెక్నీషియన్స్ అందరూ కష్టపడి, డెడికేషన్‌తో పని చేసారు. మా కష్టానికి తగిన ప్రతిఫలం దక్కాలని, సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

English summary
Aadi, Shanvi, Rakul Preet Singh starrer Pyar Mein Padipoyane Movie Audio Launch Function held at Hyderabad. Actor Aadi, Actress Shanvi Srivastava, Rakul Preet Singh, Saikumar, Director Ravi Chavali, Producer K.K.Radha Mohan, Anoop Rubens, Nani, Varun Sandesh, Manchu Manoj Kumar, Chaitanya Krishna graced the event.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu