»   » గ్రేట్ కదా: ప్రపంచంలోనే తొలిసారిగా ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ సినిమాకి ఈ ఏర్పాటు

గ్రేట్ కదా: ప్రపంచంలోనే తొలిసారిగా ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ సినిమాకి ఈ ఏర్పాటు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నందమూరి బాలకృష్ణ వందో చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి భిన్నమైన ఆవిష్కరణలకు కేంద్రబిందువుగా మారుతోంది. ప్రపంచంలోనే తొలిసారిగా చిత్రానికి QR(క్విక్‌ రెస్పాన్స్‌) Logoను విడుదల చేశారు. చిత్ర నిర్మాత బెబో శ్రీనివాస్‌ నేతృత్వంలో లోగో రూపకల్పన జరిగింది.

అభిమానులు తమ స్మార్ట్‌ ఫోన్‌లోని QR కోడ్‌ను స్కానర్‌ యాప్‌ను ఉపయోగించి QRలోగోను స్కాన్‌ చేయడం ద్వారా వెబ్‌సైట్‌లో నడుస్తున్న పోటీలో పాల్గొనేందుకు అవకాశం లభిస్తుంది.


వెబ్‌సైట్‌


మరో ప్రక్క 'గౌతమీపుత్ర శాతకర్ణి' చిత్రంలోని పలు పాటల మేకింగ్‌ వీడియోలు విడుదలయ్యాయి. ఈ వీడియోలను చిత్ర యూనిట్ సోషల్‌మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. ఇప్పటికే ఈ చిత్రం ఆడియోను తిరుపతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఘనంగా విడుదల చేశారు. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది.


శాసనాలు ద్వారా

నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ ‘‘మనకంటూ ఓ దేశాన్నీ, భవిష్యత్తునీ, గుర్తింపునీ ఇచ్చిన చక్రవర్తి... గౌతమిపుత్ర శాతకర్ణి. ఆయన గురించి మనకు తెలిసింది చాలా తక్కువ. కాశీలో వేయించిన శాసనాల ద్వారా కొన్ని విషయాలు బయటపడ్డాయి. వాటికి కాస్త వూహాజనితమైన కథని జోడించి క్రిష్‌ ఈ సినిమా తీశారు అని చెప్పారు.


గుర్తు చేస్తున్నాం

ఇలాంటి చిత్రాల ద్వారా మన సంస్కృతి, సంప్రదాయాలు, భాష గొప్పతనాన్ని గుర్తు చేస్తున్నాం. హేమామాలిని లేకపోతే ఈ సినిమా ఉండేది కాదు. ఈ సినిమా సంక్రాంతికి వస్తోంది అన్నారు బాలయ్య.


క్రిష్‌ మాట్లాడుతూ

క్రిష్‌ మాట్లాడుతూ ‘‘శాతకర్ణి కథని సినిమాగా తీయాలనుకొన్నప్పుడు ఓ అద్భుతమైన రూపం బాలకృష్ణ రూపంలో ఆవిష్కృతమైంది. మన దగ్గర శాతకర్ణి చరిత్ర లేదు. అమరావతి శిథిలాలు లండన్‌ మ్యూజియంలో ఉన్నాయి. మన చరిత్రను లండన్‌లో పూజిస్తున్నారు. మనం మాత్రం ‘గౌతమిపుత్ర ఎవరు' అని ప్రశ్నించే స్థితిలో ఉన్నాం అన్నారు.


కోపంతో చెప్తున్నా

వీఎన్‌ శాస్త్రి, విశ్వనాథ సత్యనారాయణ, మెగస్తనీస్‌ రచనల నుంచి సమాచారం సేకరించా. శాతకర్ణి కథ చదువుతుంటే రక్తం మరిగింది. తెలుగు జాతి మొత్తం గర్వపడే సినిమా ఇది. ఇది టికెట్ల కోసం చెబుతున్న మాట కాదు. కోపంతో చెబుతున్న మాట''అన్నారు క్రిష్.


సుదీర్ఘ విరామం తర్వాత...

‘‘నా సినీ ప్రయాణం ఎన్టీఆర్‌ నటించిన ‘పాండవ వనవాసం'తో ప్రారంభమైంది. సుదీర్ఘ విరామం తరవాత ఎన్టీఆర్‌ తనయుడితో ఓ సినిమా చేయడం ఆనందంగా ఉంది. ఇందులో బాలయ్యకు తల్లిగా నటించా'' అన్నారు హేమామాలిని.


సాహసమే...

‘‘తల్లి పేరుని తన పేరు ముందు పెట్టుకొని ఈ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన చక్రవర్తి శాతకర్ణి. శాలివాహన శకానికి నాంది పలికాడు. ఇలాంటి సినిమా తీయడం ఓ సాహసం. తెలుగువారి ఆత్మాభిమానం ఈ సినిమాతో మరోసారి ప్రతిధ్వనిస్తుంది. ఆర్థికంగానూ ఇలాంటి చిత్రాలు విజయవంతం అవ్వాలి. అప్పుడే ఇలాంటి చిత్రాలు మరిన్ని తయారవుతాయి అన్నారు సిరివెన్నెల సీతారామశాస్త్రి.


త్రివేణి సంగమం

‘గమ్యం', ‘వేదం', ‘కృష్ణం వందే జగద్గురుమ్‌', ‘కంచె' ఇలా ఒకదాన్ని మించి మరో సినిమా తీశాడు క్రిష్‌. ఈ చిత్రాన్ని మహాకావ్యంలా మలిచాడు. మాటలు, పాటలు, సంగీతం కలిసిన త్రివేణీ సంగమం ఈ చిత్రము''అన్నారు గీత రచయిత సిరివెన్నెల.


ఓ సింహం పుస్తకం చదువుతూంటే...

‘‘బాలకృష్ణగారి చిత్రానికి మాటలు రాయడం నా కల. ఆయన ముందు కూర్చుని డైలాగులు రాయాలంటే కంగారొచ్చింది. నా సంభాషణలు విన్న తరవాత బాగున్నాయన్నారు. దాంతో నా కల నెరవేరిందనిపించింది. ఓ సింహం గౌతమి పుత్ర శాతకర్ణి పుస్తకాన్ని చదువుతున్నప్పుడు ఫొటో తీస్తే ఎలా ఉంటుందో ఈ సినిమా అలా ఉంటుంది'' అన్నారు మాటల రచయిత బుర్రా సాయిమాధవ్‌.


English summary
Gautamiputra Satakarni is said to be the first Telugu film to use the QR code technology to give access to the teasers, official Facebook page, gallery and songs page.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu