twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చిరంజీవిని చూసి ఎవడ్రా అనుకొన్నా.. 40 ఏళ్ల కంచుకోటను బద్దలుకొట్టి.. ఇండస్ట్రిని రూల్ చేస్తున్నాడు

    |

    పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణమూర్తి మరోసారి భావోద్వేగంతో ఊగిపోయారు. తాను రూపొందించిన తాజా చిత్రం మార్కెట్లో ప్రజాస్వామ్యం సినిమా ఆడియో ఫంక్షన్‌లో మెగాస్టార్ చిరంజీవిని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో మార్కెట్లో ప్రజాస్వామ్యం మూవీ ఆడియో ఫంక్షన్ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు కొరటాల శివ, పాటల రచయిత సుద్దాల అశోక్ తేజ, గోరేటి వెంకన్న తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్ నారాయణమూర్తి మాట్లాడుతూ..

     చిరంజీవి, నేను ఒకేసారి

    చిరంజీవి, నేను ఒకేసారి

    కాలేజీలో చిరంజీవి పెద్ద లీడర్. ఆయన ప్రసిడెంట్‌గా పనిచేశారు. నేను ఫైనాన్స్ సెకట్రరీగా పనిచేశాను. అలా ఎదిగిన వాళ్లం ఇండస్ట్రీకి వెళ్లాం. జూనియర్ ఆర్టిస్టుగా కెరీర్‌ను ప్రారంభించాం. అందిన అవకాశాలను చేజిక్కించుకొని కెరీర్ పరంగా ఎదిగాం అని నారాయణమూర్తి తన తొలినాళ్లను గుర్తు చేసుకొన్నారు.

    చిరంజీవికి లాడ్జీలో నాకు పాకలో వసతి

    చిరంజీవికి లాడ్జీలో నాకు పాకలో వసతి

    కెరీర్ ఆరంభంలో జూనియర్ ఆర్టిస్టుగా ఉన్నప్పుడు.. చంద్రమోహన్, నూతన్ ప్రసాద్, చిరంజీవికి అప్సర లాడ్జిలో వసతి కల్పించారు. నాకు కూడా వారితోపాటు అందులో వసతి కల్పిస్తారని అనుకొన్నాను. కానీ వంటగదిలోని పాకలో నాకు వసతి కల్పించారు. అప్పుడు నాకు సహచరుడు మాటల రచయిత సత్యానంద్ అని గుర్తు చేసుకొన్నారు.

    చిరంజీవిని చూసి ఎవడ్రా అని

    చిరంజీవిని చూసి ఎవడ్రా అని

    ఒక రోజు చెన్నైలో ఓ వ్యక్తి చెవిలో వాక్‌మాన్ పెట్టుకొని లయబద్దంగా ఊగుతూ నడుచుకొంటూ వస్తున్నాడు. కళ్లు చూస్తే బీభత్సంగా కనిపించాయి. అప్పుడు ఆయనను చూసి ఎవడ్రా వీడు అనుకొన్నాను. తీరా చూస్తే కొన్ని ఏళ్ల తర్వాత మెగాస్టార్ చిరంజీవి అయ్యారు. సినిమా ఇండస్ట్రీలో ఎంతో ఎత్తుకు ఎదిగాడు అని నారాయణమూర్తి తెలిపారు.

    ఇండస్ట్రినీ రూల్ చేస్తావని అప్పుడే చెప్పా

    ఇండస్ట్రినీ రూల్ చేస్తావని అప్పుడే చెప్పా

    ఉమర్ షరీఫ్, రజనీకాంత్, శతృఘ్న సిన్హా మాదిరిగా ఇండస్ట్రీని రూల్ చేస్తాడని అప్పుడే అనుకొన్నాను. అదే మాటను బాస్ నీవు పరిశ్రమను రూల్ చేస్తావు అని చిరంజీవికి చెబితే థ్యాంక్యూ అన్నారు. అప్పడు నేను చెప్పిన మాట నిజమైంది. ఇప్పుడు ఇండస్ట్రీని ఏలుతున్నాడు. అది ఆయనకే సాధ్యమైంది అని నారాయణమూర్తి భావోద్వేగంగా ప్రసంగించారు.

     పృథ్వీరాజ్ మాదిరిగా ఎదిగాడని

    పృథ్వీరాజ్ మాదిరిగా ఎదిగాడని

    తన ప్రతిభతో 40 ఇండస్ట్రీ కంచుకోటను బద్దలు కొట్టాడు. ఖైదీ నుంచి ఇప్పటి వరకు తానే మెగాస్టార్ అయ్యాడు. తనకు ధీటుగా ఎవరు లేరనే విషయాన్ని చిరంజీవి నిరూపించాడు. దేశ సినీ పరిశ్రమలో పుథ్వీరాజ్ కపూర్ ఓ ఆక్టోపస్. ఆయన కుటుంబం నుంచి 40 మందికి పైగా నటీనటులు వచ్చారు. అప్పటి పృథ్వీరాజ్ కపూర్ మాదిరిగా చిరంజీవి మారిపోయారు అని నారాయణమూర్తి అన్నారు.

    చిరంజీవి ఓ ఆక్టోపస్‌లా విస్తరించి

    చిరంజీవి ఓ ఆక్టోపస్‌లా విస్తరించి

    ఇప్పడు చిరంజీవి ఫ్యామిలీ నుంచి ఎంతో మంది హీరోలు వస్తున్నారు. ప్రాంతీయ సినిమాలో చిరంజీవి ఫ్యామిలీ ఆక్టోపస్‌లా విస్తరించింది. అందుకు కారణం అలాంటి వారికి విత్తనాలు వేసిన మహా వటవృక్షం చిరంజీవి. అలాంటి వ్యక్తి నా సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్‌కు రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను అని నారాయణమూర్తి అన్నారు.

    English summary
    People Star R Naranayan Murthy's Latest movie is Marketlo Prajaswamyam. This movies audio function held in hyderaad. Chiranjeevi is the Chief guest for this event. Koratala Siva and Suddala Ashok Teja are the guest. Chiranjeevi praises R Narayana Murthy's commitment in his career.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X