బతుకమ్మ వేడుకల్లో విప్లవ దర్శకుడు
విప్లవ చిత్రాల దర్శకుడు ఆర్ నారాయణ మూర్తి బతుకమ్మ వేడుకల్లో ఆడి పాడారు. హైదరాబాద్ మూసాపేటలో జరిగిన సంబరాల్లో బతుకమ్మ పట్టుకుని వచ్చిన నారాయణమూర్తి మహిళలతో బతుకమ్మ ఆడటంతో పాటు, సినిమా పాటలు పాడారు. ఓ సినిమా దర్శకుడు తమతో స్వయంగా స్టెప్పులేయడంతో ఆశ్యర్యపోవడం అక్కడున్న మహిళల వంతైంది. ఈ సందర్భంగా నారాయణ మూర్తి మాట్లాడుతూ తెలంగాణ సాంప్రదాయాలు, సంసృతికి అద్దంపట్టే బతుకమ్మ వేడుకలపై త్వరలో ఓ సినిమా తెరకెక్కించనున్నట్లు అక్కడున్న మహిళలతో ఆయన అన్నట్లు తెలిసింది.
కాగా..తెలంగాణ ఉద్యమాల నేపథ్యంలో వచ్చిన నారాయణ మూర్తి తాజా చిత్రం 'పోరు తెలంగాణ" గత కొన్ని రోజుల క్రితమే విడుదలైంది. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసి పడుతున్నా పోరు తెలంగాణ సినిమాకు సరైన స్పందన లేక పోవడం గమనార్హం. ఇక పోతే ఈ సినిమా సీమాంధ్ర ప్రాంతంలో విడుదల కాలేదు. ధియేటర్లు దొరకక పోవడం సినిమా అక్కడ విడుదల చేయలేక పోయామని, తన సినిమాకు కావాలని థియేటర్లు బ్లాక్ చేశారని నారాయణమూర్తి ఇటీవల ఓ టీవీ ఛానల్ తో అన్నారు.


Click it and Unblock the Notifications











