twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చిరు ముసలోడైతే చెప్పుకోవడానికి ఏముంది? అల్లు అరవింద్ విలన్‌లా...: ఆర్ నారాయణ మూర్తి

    By Bojja Kumar
    |

    Recommended Video

    మెగాస్టార్ కావొచ్చు...కానీ చెప్పుకోవడానికి ఏముంది?

    దర్శకరత్న దాసరి నారాయణ రావు జీవిత చరిత్రను ప్రముఖ పాత్రికేయుడు పసుపులేటి రామారావు 'తెర వెనక దాసరి' పేరుతో పుస్తకరూపంలోకి తీసుకొచ్చారు. చిరంజవి, మురళీ మోహన్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు రాసిన వ్యాసాల సంకలనంతో ఈ పుస్తకం రూపొందించారు. మంగళవారం పార్క్ హయత్ లో జరిగిన ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి చిరంజీవి, రాఘవేంద్రరావు, టి సుబ్బిరామిరెడ్డితో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నటుడు, దర్శకుడు ఆర్ నారాయణ మూర్తి తనదైన రీతిలో మాస్ మసాలా స్పీచ్ ఇచ్చారు.

    మాస్ మసాలా జోడీస్తూ స్పీచ్ మొదలు పెట్టిన ఆర్ నారాయణ మూర్తి

    మాస్ మసాలా జోడీస్తూ స్పీచ్ మొదలు పెట్టిన ఆర్ నారాయణ మూర్తి

    అయ్యా అందరికీ నమస్కారం. మా గురువుగారు ఇక్కడే ఉన్నట్లు, మా గురువుగారి సభ జరుగుతున్నట్లు ఉంది. ఈ పుస్తకం రాసిన పసుపులేటి రామారావుగారికి ధన్యవాదాలు. మా గురువుగారికి సమవుజ్జీ రాఘవేంద్రరావుగారికి నమస్కారం. టి సుబ్బిరామిరెడ్డి గారు మహానుభావుడు, శివ శంభో అన్నా, వ్యాపారం అన్నా, రాజకీయం అన్నా ఏ మన్నా ఆయనకు నమస్కారం కానీ... ఇలాంటి ఫంక్షన్ పెట్టి రండయ్యా... సరదాగా జరుపుకోండయ్యా... పార్క్ హయ్యత్తా దానమ్మ బాబా బ్రహ్మాండంగా తినండయ్యా అని ఈ ఫంక్షన్ చేస్తున్న మీకు నా దండాలయ్యా.... అంటూ తనదైన రీతిలో ఆర్ నారాయణ మూర్తి ప్రసంగం మొదలు పెట్టారు.

    చిరంజీవికి చెప్పుకోవడానికి ఏముంది?

    చిరంజీవికి చెప్పుకోవడానికి ఏముంది?

    చిరంజీవిగారు... మెగాస్టార్.... ఉయ్యాలవాడ నరసింహా రెడ్డితో ఆయన జన్మ ధన్యం కావాలని నా మనస్తూర్తిగా కోరుకుంటున్నాను. రామారావుగారికి ఎన్నో సినిమాలు ఉన్నాయి చెప్పుకోవడానికి, నాగేశ్వర రావుగారికి ఎన్నో ఉన్నాయి... కృష్ణ గారికి అల్లూరి సీతారామరాజు, శోభన్ బావుగారికి సంపూర్ణ రామాయణం. చిరంజీవి గారు ఇంత మెగాస్టార్... కానీ చెప్పుకోవడానికి సినిమా ఏది లేదు. ఆయన గ్రేట్ మెగాస్టార్ కావొచ్చు... కానీ ముసలోడైపోతే చెప్పుకోవడానికి గొప్ప సినిమా ఏమీ లేదు. కానీ ఇపుడు ఉంది... ‘సై రా నరసింహారెడ్డి'...... అని ఆర్ నారాయణ మూర్తి వ్యాఖ్యానించారు.

    ఈ ప్రపంచానికి అల్లు అరవింద్ విలన్

    ఈ ప్రపంచానికి అల్లు అరవింద్ విలన్

    ప్రపంచానికి అరవింద్ విలన్ లాగా కనిపిస్తారు. అది ఆయన కర్మ. ఆయన ఏ నక్షత్రంలో పుట్టారో కానీ అది ఆయన బ్యాడ్ లక్. ఆయన గొప్ప స్నేహ పాత్రుడు, గొప్ప హెల్పింగ్ నేచర్. గొప్ప ఆర్గనైజర్. చిరంజీవి, అరవింద్ కృష్ణార్జునుల లాంటి వారు.... అని ఆర్ నారాయణ మూర్తి వ్యాఖ్యానించారు.

    అలాంటి విల్ పవర్ ఎన్టీఆర్ తర్వాత గురువుగారు దాసరికే ఉంది

    అలాంటి విల్ పవర్ ఎన్టీఆర్ తర్వాత గురువుగారు దాసరికే ఉంది

    నేను డిగ్రీ పూర్తి చేసి సినిమా పిచ్చితో మద్రాసు వస్తే మా గురువుగారు దాసరి నారాయణ రావు గారు నన్ను ఆదరించారు. అక్కడ నాకు ఎవరూ తెలియదు. ఆయన నాకు ఆశ్రయం ఇచ్చారు. తెలుగు సినిమా పరిశ్రమలో విల్ పవర్ ఉన్న వ్యక్తులు ఎన్టీ రామారావుగారి తర్వాత దాసరి నారాయణ రావుగారిని మాత్రమే చూశాను అని నారాయణ మూర్తి చెప్పుకొచ్చారు.

    సారి చెప్పనంటే...గురువుగారు పొమ్మన్నారు

    సారి చెప్పనంటే...గురువుగారు పొమ్మన్నారు

    ఓ సినిమా షూటింగులో నాకు దాసరిగారు మంచి కార్మిక నాయకుడి వేషం ఇచ్చారు. నిర్మాతకు, నాకు చిన్న ఘర్షణ వచ్చింది. తోసుకుని కొట్టుకునే పరిస్థితి వచ్చింది. నారాయణ మూర్తి సారీ చెబితేనే షూటింగ్ లేకుంటే నో షూటింగ్ అన్నారు. నువ్వు చేసింది తప్పు, సినిమా షూటింగ్ ఆగిపోయింది. సారీ చెప్ప‌ు అని గురువుగారు అన్నారు. నేను చెప్ప‌నని అన్నాను. అప్పుడు కోపంతో వెళ్లిపోమ్మ‌ని అన్న ఆయ‌న‌, కొన్ని రోజుల త‌ర్వాత న‌న్ను పిలిచి నాకు ఆశ్ర‌య‌మిచ్చారు అని ఆర్ నారాయణ మూర్తి గుర్తుచేసుకున్నారు.

    English summary
    R Narayana Murthy Speech at Tera Venuka Dasari Book Launch. Tera Venuka Dasari book launch event held at Park Hyath hotel. Chiranjeevi, Allu Aravind, K Raghavendra Rao, C Kalyan, Tammareddy Bharadwaj, T Subbarami Reddy, Murali Mohan, Kodi Ramakrishna at the event.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X