»   » దళితుల వూచకోత ప్రధానాంశంగా...

దళితుల వూచకోత ప్రధానాంశంగా...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : దళితులను మన వ్యవస్థ ఎలా వూచకోత కోస్తోంది అనే అంశాలను సినిమాలో చూపిస్తున్నాం. అధికారం కోసం కొంతమంది నాయకులు స్వార్థరాజకీయాలకు ఎలా పాల్పడుతున్నారు? ప్రజలకిచ్చిన వాగ్దానాలను ఎలా విస్మరిస్తున్నారు? దళితులపై ఎలాంటి వివక్ష కొనసాగుతోంది? అనే అంశాల్ని ఈ సినిమాలో చర్చిస్తున్నాం అంటున్నారు ఆర్.నారాయణ మూర్తి. ఆర్‌.నారాయణమూర్తి నటిస్తూ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం 'రాజ్యాధికారం'. ఈ సినిమా పాటల విడుదల కార్యక్రమ హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్బంగా మాట్లాడుతూ తమ సినిమాలోని కంటెంట్ గురించి వివరించారు.

''పేదల కష్టాల్ని, వ్యవస్థ పట్ల అతడి కడుపు మంటను సినిమా రూపంలో చూపించే ఏకైక దర్శకుడు ఆర్‌.నారాయణమూర్తి. నేను'ఒసేయ్‌ రాములమ్మ' సినిమా తీయడానికి నారాయణమూర్తే స్ఫూర్తి'' అన్నారు ప్రముఖ దర్శక నిర్మాత దాసరి నారాయణరావు.

R.Narayanamurthi's Rajyadhikaram audio launched

అలాగే.. ''దేశంలో ఎందరో దర్శకులు ఎన్నో ప్రయోగాత్మక చిత్రాలు చేశారు. మరికొందరు అన్ని తరహా జోనర్‌లలో సినిమాలు తీశారు. కానీ ఒకటే ధ్యేయంతో ఒకే తరహా సినిమాలు తీస్తున్న దర్శకుడు ఆర్‌.నారాయణమూర్తి మాత్రమే. ఈ సినిమా ఎన్నికల ముందు విడుదల చేయాల్సింది. కానీ కుదరలేదు. ప్రజల సమస్యలు, సమాజంలో కుళ్లును చూపించే చిత్రాలకు సమయంతో పని లేదు. ఈ సినిమా ఎప్పుడు వచ్చినా విజయం సాధిస్తుంది'' అన్నారు దాసరి నారాయణరావు.

ఆర్‌.నారాయణమూర్తి మాట్లాడుతూ ''అధికారం కోసం కొంతమంది స్వార్థ రాజకీయ నాయకలు ఎంతకైనా దిగజారుతున్నారు. తమను ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదనే నాయకులకు ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్పారు. కార్యక్రమంలో తనికెళ్ల భరణి, పద్మా నాయక్‌, ఎల్బీ శ్రీరామ్‌, వందేమాతరం శ్రీనివాస్‌, గోరేటి వెంకన్న, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

English summary
Rajyadhikaram is an upcoming Telugu film.The main casts are R. Narayana Murthy, Tanikella Bharani. This movie is directed and produced by R. Narayana Murthy.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu