»   » ‘బ్రోకర్’ గా మారిన ఆర్.పి.పట్నాయక్

‘బ్రోకర్’ గా మారిన ఆర్.పి.పట్నాయక్

Posted By:
Subscribe to Filmibeat Telugu

సంగీత దర్శకుడు ఆర్.పి.పట్నాయక్ త్వరలో 'బ్రోకర్" గా వెండి తెరపై కనిపించనున్నాడు. ఆర్.పి. పట్నాయక్, మయూరి, అర్చన, శ్రీహరి, కీర్తిచావ్లా ప్రధాన పాత్రధారులుగా డైరెక్టర్స్ సినిమా పతాకంపై ఆర్.పి దర్శకత్వంలో మద్దినేని రమేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ప్రస్తుతం 'బ్రోకర్" చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం డబ్బింగ్ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. దర్శకుడు ఆర్.పి.పట్నాయిక్ మాట్లాడుతూ..మన దేశ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం బ్రోకర్ల మీద ఆధారపడివుంది. బ్రోకర్ ప్రస్తుత సమాజాన్ని పట్టి పీడిస్తున్నాడు. గ్రాఫిక్స్, పాటలు, ఫైటింగ్స్‌లేని కమర్షియల్ సినిమా ఇది.ఈ చిత్రంలో నెగిటివ్ షేడ్స్ ఉన్న అవినీతిపరుడి క్యారెక్టర్ పోషిస్తున్నాను. చాలా తెలివైనవాడు, అవకాశం కోసం ఎంతకైనా తెగిస్తాడు. ఇది నాకు ఛాలెంజింగ్ క్యారెక్టర్. సమాజంపట్ల ఒక బాధ్యతతో ఈ కథ అల్లుకున్నాను అని చెప్పారు.

అలాగే ఆరున్నర సంవత్సరాల తర్వాత నటుడుగా మళ్లీ కెమెరాముందుకు వస్తున్నాను, ఇంతకు ముందు నటించిన 'శీను వాసంతి లక్ష్మి" చిత్రంలో అంధుడి పాత్ర నాకు మంచి పేరు తెచ్చింది అన్నారు. ఇక సురేష్, కోట శ్రీనివాసరావు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, గొల్లపూడి మారుతీరావు, భరత్‌రెడ్డి, సందేశ్, గిరిధర్ తదితరులు నటించిన ఈ చిత్రానికి మాటలు: ఎం.వి.ఎస్. హరనాథరావు, పాటలు: చైతన్య ప్రసాద్, ఆర్ట్: రాము, కాస్ట్యూమ్స్: మున్ని, కెమెరా: శ్రీనివాసరెడ్డి, నిర్మాణం: జి. భరత్‌కుమార్, సమర్పణ: వెంకట్ వర్ధినేని, నిర్మాత: మద్దినేని రమేష్, కథ, స్క్రీన్‌ప్లే, సంగీతం, దర్శకత్వం: ఆర్.పి.పట్నాయక్.ఇక ఈ చిత్రం వచ్చేవారంలో పాటలను, నెలాఖరున చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu