»   » లండన్‌లో రాశీఖన్నా హల్‌చల్.. ఎన్టీఆర్ ఫ్యాన్స్‌తో..

లండన్‌లో రాశీఖన్నా హల్‌చల్.. ఎన్టీఆర్ ఫ్యాన్స్‌తో..

Posted By:
Subscribe to Filmibeat Telugu

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తూ నటించిన చిత్రం జై లవకుశ. జూనియర్ ఎన్టీఆర్ సరసన ప్రధాన కథానాయికలుగా రాశీఖన్నా, నివేదా థామస్ నటించారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 2400 స్క్రీన్లలో రిలీజ్ అయింది. లండన్‌లో సినీ అభిమానులు, నందమూరి ఫ్యాన్స్ కోసం జై లవకుశ చిత్ర ప్రీమియర్లను ప్రదర్శించారు. ప్రస్తుతం లండన్‌లో ఉన్న రాశీఖాన్నా అభిమానులతో కలిసి చూశారు. ఈ చిత్ర విజయంలో అభిమానులతోపాటు ఆమె కూడా భాగమయ్యారు.

ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌తో

ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌తో

ఎన్టీఆర్‌తో రొమాన్స్ చేసిన రాశీఖన్నా తన నటనను లండన్ స్క్రీన్లపై ఆస్వాదించారు. చిత్ర వీక్షణ అనంతరం అభిమానులతో కలిసి ఆమె ఫోటోలు దిగారు. లండన్‌లోని ప్రదర్శించిన ప్రీమియర్‌కు నందమూరి అభిమానులు జై లవకుశ టీషర్టలను ధరించి రావడం గమనార్హం.


జై లవకుశ చిత్రంలో

జై లవకుశ చిత్రంలో

జై లవకుశ చిత్రంలో ఎన్టీఆర్, రాశీఖన్నా స్టెప్పులు వేసిన ట్రింగ్ ట్రింగ్ పాటకు లండన్‌లో మంచి రెస్పాన్స్ వచ్చినట్టు సమాచారం. ఎన్టీఆర్ డ్యాన్సులను, డైలాగ్స్, యాక్షన్ అంశాలకు అభిమానుల నుంచి మంచి ప్రతిస్పందన కనిపించిందట.


జై లవకుశ కోసం

జై లవకుశ కోసం

జై లవకుశ కోసం రాశీ ఖన్నా తన బరువును తగ్గించుకున్నారు. సినిమాలో చాలా నాజుక్కుగా కనిపించి గ్లామర్‌తో ఆకట్టుకున్నది. రాశీఖన్నాకు పెద్దగా నటించడానికి స్కోప్ లేకపోవడంతో పాత్ర పరిధి మేరకు ఓకే అనిపించింది. రాశీఖాన్నా కెరీర్‌లో జై లవకుశ భారీ చిత్రమేకాకుండా మంచి హిట్ చిత్రంగా నిలిచింది.


ఓవర్సీస్‌లో మంచి రిపోర్ట్

ఓవర్సీస్‌లో మంచి రిపోర్ట్

జై లవకుశ చిత్రానికి ఓవర్సీస్‌లో కూడా మంచి రిపోర్ట్ వస్తున్నది. విదేశాల్లో కూడా భారీ కలెక్షన్లను సొంతం చేసుకొనే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రానికి ఏపీ, తెలంగాణలో మొదటి రోజు 21 కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు తెలుస్తున్నది.


English summary
Jai Lava Kusa Heroine Raashi Khanna watched her move in London. She watched this movie with NTR fans. Raashi posed for NTR fans. Reports suggest That She enjoyed a lot while watching Jai Lava Kusa.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X