»   » బూతు బంగ్లాలో జూ ఎన్టీఆర్ రభస

బూతు బంగ్లాలో జూ ఎన్టీఆర్ రభస

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: జూ ఎన్టీఆర్ హీరోగా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రభస చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. 'ఊకొడతారా ఉలిక్కి పడతారా' చిత్రం కోసం వేసి గాంధర్వ మహల్ సెట్‌ను ఈ సినిమా కోసం మార్పులు చేసి అక్కడ సీన్లు చిత్రీకరిస్తున్నారు.

ఈ చిత్రంలో జూ ఎన్టీఆర్ సరసన సమంత, ప్రణీత నటిస్తున్నారు. మాస్ ఎంటర్టనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటి వరకు వరుస ప్లాపులతో వెనకబడిపోయిన ఎన్టీఆర్ ఈచిత్రంతో హిట్టు కొడతానని బలమైన నమ్మకంతో ఉన్నాడు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఈచిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

సంతోష్ శ్రీనివాస్ మాట్లాడుతూ... మాస్‌ సినిమాలు చూస్తూ పెరిగినవాణ్ని నేను. నాకు ఎలాంటి చిత్రాలు నచ్చుతాయో అలాంటివే తీస్తాను. ఎన్టీఆర్‌ అనగానే శక్తివంతమైన సంభాషణలే గుర్తుకొస్తాయి. అందుకు ఏ మాత్రం తగ్గకుండా ఇందులో మాటలుంటాయి. ఎన్టీఆర్‌ కథ వినగానే నన్ను ప్రోత్సహించారు. నా తొలి చిత్రంలో హీరో ఎలాంటి బాధ్యత లేకుండా కనిపిస్తారు. కానీ ఇందులో హీరో పాత్రకి ఓ పెద్ద బాధ్యత ఉంటుంది. అది ఏమిటన్నది మాత్రం ఆసక్తికరం. ఇందులో సమంత పాత్ర కూడా కీలకమే'' అని చెప్పుకొచ్చారు. ఈ చిత్రంలో ప్లేబోయ్ గా కనపడతాడు అని చెప్తున్నారు దర్శకుడు సంతోష్ శ్రీనివాస్.

ఈచిత్రంలో షాయాజీ షిండే, జయసుధ, బ్రహ్మానందం, రఘుబాబు, జయప్రకాష్ రెడ్డి, నాజర్, అజయ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఎన్టీఆర్ కెరీర్లో ఒక మంచి వినోదాత్మక చిత్రంగా తీర్చదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం : అనూప్ రూబెన్స్, ఫోటోగ్రఫీ : శ్యామ్ కె నాయుడు, ఫైట్స్ : రామ్ లక్ష్మణ్, ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్ : ఎ.ఎస్.ప్రకాష్, సమర్పణ : బెల్లంకొండ సురేష్, నిర్మాత : బెల్లంకొండ గణేష్ బాబు, కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం : సంతోష్ శ్రీనివాస్.

English summary
Young Tiger NTR's new powerful entertainer Rabhasa is progressing at brisk pace. Director Santosh Srinivas is canning film's crucial scenes in Gandharva Mahal, the famous Bhoot bungalow in Manoj's Ukodatara Ulikkipadatara.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu