»   »  అతన్ని పెట్టుకోవద్దన్నారు (రే.గు సక్సెస్ మీట్లో బన్నీ)

అతన్ని పెట్టుకోవద్దన్నారు (రే.గు సక్సెస్ మీట్లో బన్నీ)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అల్లు అర్జున్, శృతి హాసన్ జంటగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన 'రేసుగుర్రం' చిత్రం భారీ విజయం సాధించడంతో చిత్ర యూనిట్ సభ్యులు హైదరాబాద్‌లో సక్సెస్ మీట్ ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమంలో హీరో అల్లు అర్జున్, హీరోయిన్ శృతి హాసన్, నిర్మాతలు నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి), డా.కె.వెంకటేశ్వరరావు, దర్శకుడు సురేందర్ రెడ్డి, కథా రచయిత వక్కతం వంశీ, తమన్, బ్రహ్మానందం, పోసాని, రామ్ లక్ష్మణ్, తాగుబోతు రమేష్, నటుడు రవికిషన్, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ...ఈ చిత్రం తన కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ కావడం ఆనందంగా ఉందని తెలిపారు. సినిమాకు ప్రతి ఒక్కరూ ఎంతో కష్టపడి పని చేసారని, అందు వల్లే సినిమా ఇంత పెద్ద హిట్టయిందన్నారు. రామ్ లక్ష్మణ్ నన్ను ఈ చిత్రం ద్వారా మరో మెట్టు ఎక్కించారు. కెమెరామెన్‌గా మనోజ్‌ని పెట్టుకోవద్దని కొందరు నాకు ఫోన్లు చేసి చెప్పారు. కానీ నేను వినలేదు. అతనిపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టాడు. తమన్ మంచి ట్యూన్స్ ఇచ్చారని, డాన్స్ మాస్టర్లు నాతో మంచి స్టెప్స్ వేయించారని తెలిపారు.

నేనెప్పుడు సినిమా మొత్తం వన్ మెన్ షో చేయాలనుకోను....సినిమాలో చివరి 15 నిమిషాలు బ్రహ్మానందం గారి మీదనే నడిచింది, పోసాని మంచి పాత్ర పోషించారు, శ్యామ్‌ను చూసి చాలా నేర్చుకున్నాను. అతను సెల్ఫ్ మేడ్ పర్సన్. సురేందర్ రెడ్డి చాలా ఓర్పుతో పని చేసారు. ఆయనే లేకుంటే ఈ సినిమా లేదు. గొప్పగా తీసాడు. నిర్మాతలు ఏ విషయంలోనూ రాజీ పడకుండా ఖర్చు పెట్టారు అని అల్లు అర్జున్ చెప్పుకొచ్చారు.


స్లైడ్ షోలో సక్సెస్ మీట్ ఫోటోలు, వివరాలు....

సురేందర్ రెడ్డి మాట్లాడుతూ...

సురేందర్ రెడ్డి మాట్లాడుతూ...

వక్కతం వంశీ అద్భుతమైన స్క్రిప్టు ఇవ్వడం వల్లనే ఈ సినిమా అద్భుతంగా తీర్చి దిద్ద గలిగాం. నా కెరీర్లో బ్లాక్ బస్టర్, ఫుల్ సక్సెస్ సినిమాలు లేవనే కొరతను ‘రేసు గుర్రం' తీర్చింది. తమన్ సంగీతం, మనోజ్ కెమెరా పనితనం సినిమాకు బాగా ప్లస్సయ్యాయి. నిర్మాతలు చాలా సపోర్టు ఇచ్చారు అని తెలిపారు.

నిర్మాతలు మాట్లాడుతూ..

నిర్మాతలు మాట్లాడుతూ..


టీం మొత్తం ఎంతో కష్ట పడి పని చేసారు. మెగా అభిమానులు ఈ సినిమాను పెద్ద సక్సెస్ చేసినందుకు ధన్యవాదాలు. బన్నీ చాలా బాగా చేసాడు. చిరంజీవికి దగ్గరవుతున్నాడని చాలా మంది అంటున్నారు. ఆయనంతటి వారు కావాలని కోరుకుంటున్నాను అన్నారు.

విలన్, బెజ్ పురి నటుడు రవి కిషన్ మాట్లాడుతూ...

విలన్, బెజ్ పురి నటుడు రవి కిషన్ మాట్లాడుతూ...


తెలుగు పరిశ్రమ చాలా బాగుంది. బన్నీ చాలా మంచి మనిషి. నా తదుపరి సినిమాలో నేను తెలుగు నేర్చుకుని మాట్లాడతాను అన్నారు.

శ్యామ్ మాట్లాడుతూ...

శ్యామ్ మాట్లాడుతూ...


నాకు తమ్ముడు లేడనే కొరతను బన్నీ తీర్చాడు. యక్టింగ్, డాన్స్, స్టైల్, పెర్ఫార్మెన్స్ విషయంలో ఆయనకు ఆయనే సాటి, గొప్ప స్టార్ అవుతాడు అన్నారు.

శృతి హాసన్ మాట్లాడుతూ...

శృతి హాసన్ మాట్లాడుతూ...


సినిమాను ఇంత పెద్ద హిట్ చేసినందుకు థాంక్స్. సురేందర్ రెడ్డి, బన్నీకి, థమన్‌కు, టీం మొత్తానికి థాంక్స్ అన్నారు.

English summary
Race Gurram Movie Success Meet held at Hyderabad. Actor Allu Arjun, Actress Shruti Hassan, Shaam, Director Surender Reddy, Producer Nallamalapu Srinivas, Ravi Kishan, S.Thaman, Ali, Bramhanandam, Allu Aravind, Tanikella Bharani, Ram Laxman, Posani Krishna Murali, Kota Srinivasa Rao graced the event.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu