»   » 'నా దృష్టిలో ఆకలెలాగో సెక్సూ అంతే'

'నా దృష్టిలో ఆకలెలాగో సెక్సూ అంతే'

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్:సెక్స్ గురించి ఓపెన్‌గా మాట్లాడటం మన దగ్గర పెద్ద ఇష్యూ. అందుకే సినిమాల్లో దాన్ని వ్యాపారం చేసి అమ్ముకుంటున్నారు. ఆకలేస్తే అన్నమెలా తింటామో... శరీరానికి సెక్స్ కూడా కనీస అవసరం. ఇది ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తుంది' అంటూ చెప్పుకొచ్చింది రాధికా ఆప్టే. బాలకృష్ణ సరసన లెజండ్, ఇప్పుడు లయిన్ చిత్రాల్లో చేసిన ఈ రక్త చరిత్ర చిన్నది చాలా విషయాల్లో బోల్డ్ గ మాట్లాడి అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

వరుణ్‌ధావన్ లేటెస్ట్ హిట్ 'బాదల్‌పూర్'లో అందాలు ఆరబోసి ఆకట్టుకున్న రాధికా ఆప్టే... రీసెంట్‌గా రిలీజైన 'హంటర్' సినిమాలో సెక్స్ ఎడిక్ట్‌గా నటించింది. ఆ ఎఫెక్టో లేక సినిమా ప్రమోషన్ కోసమో కానీ... ఆఫ్ స్క్రీన్ కూడా అంతే ఓపెన్‌మైండెడ్‌గా మాట్లాడేస్తోంది.

ఇక హిందీలో ఆమెకు అన్నీ బూతు పాత్రలే వస్తున్నాయి. అక్కడ ఆమె రీసెంట్ చిత్రం బదలాపూర్ విడుదల అయ్యాక ఆమెకు అన్నీ ఆ తరహా పాత్రలు రావటంతో ఆమె జీర్ణించుకోలేకపోతోంది. ముఖ్యంగా హంటర్ చిత్రం ప్రోమో వచ్చాక మరీ పరిస్ధితి దారణమైపోయింది. ఆమెను ఎప్రోచ్ అయ్యే నిర్మాతలు, దర్శకులు సాఫ్ట్ పోర్న్ రోల్స్ ఆఫర్ చేస్తున్నారట. ఈ విషయాన్ని ఆమె స్వయంగా మీడియాకు తెలియచేసింది.

Radhika Apte: Appetite for Sex as Normal as For Food

రాధికా ఆప్టే మాట్లాడుతూ... "బదలాపూర్ చిత్రంలో చేసాక..అందరూ నాకు సాఫ్ట్ ఫోర్న్ రోల్స్ ఆఫర్ చేస్తున్నారు..నాకు షాకింగ్ గా ఉంది.", అంటూ చెప్పుకొచ్చారామె.

రక్త చరిత్రతో తెలుగు వారికి పరిచయమైన ఆమె తర్వాత బాలకృష్ణ లెజండ్ లో చేసింది. బిజీ కాలేదు కానీ.. తెలుగులో మళ్లీ బాలయ్యే లయిన్ లో ఆఫర్ ఇవ్వాల్సి వచ్చింది. అయితే ఇక్కడ గౌరవప్రదమైన ఆఫర్స్ ఆమెకు వస్తున్నాయి. అయితే హిందీకి మాత్రం ఆమె సీన్ రివర్స్ అయ్యింది.

మరో పక్క ఆమె తాజాగా ఓ చిత్రంలో నగ్నంగా నటిస్తున్నట్లు స్వయంగా తెలియచేసారు. అయితే ఆ సన్నివేశాలు చూసే అవకాసం ఇండియావారికి ఉండకపోవచ్చు అంటోంది. పూర్తి వివరాల్లోకి వెళితే... తాను ఒక ఆంగ్ల చిత్రంలో నగ్నంగా నటిస్తున్నట్టు రక్త చరిత్రతో పరిచయమైన రాధికా ఆప్టే తెలపడం విశేషం. ధోని చిత్రం ద్వారా ప్రకాష్‌రాజ్‌కు జంటగా తమిళ పరిశ్రమకు పరిచమైన ఈ భామ ఆ తర్వాత ఆలిన్ ఆల్ అళగు రాజ, వెట్రి సెల్వన్ తదితర చిత్రాల్లో నటించింది.

మలయాళం, హిందీ, మరాఠీ, బెంగాళి పలు భాషల్లో నటిస్తున్న రాధికా ఆప్టే తాజాగా ఒక హాలీవుడ్ చిత్రంలో కూడా నటిస్తున్నారట. దీని గురించి ఆమె తెలుపుతూ, తాను నటిస్తున్న హాలీవుడ్ చిత్రం గురించి ప్రస్తుతానికి వివరాలు సస్పెన్స్ అన్నారు. అయితే, ఈ చిత్రంలో కథ డిమాండ్ మేరకు నగ్నంగా నటించానని చెప్పారు.

అయితే, ఈ చిత్రం ఇండియాలో విడుదల అయితే, ఆ సన్నివేశాలు తొలగించేలా జాగ్రత్తలు తీసుకుంటానన్నారు. ఇక ఈ హీరోయిన్ కి చెందిన ఇటీవల బాత్రూం సన్నివేశాలు ఇంటర్నెట్‌లో హల్ చల్ చేశాయి. అయితే, ఆ సన్నివేశాల్లో ఉన్నది తాను కాదని, అవన్నీ మార్ఫింగ్ అని చెప్పుకొచ్చింది.

English summary
"I think in our country in general, to have an appetite for sex is considered a big thing. But having an appetite for sex and food is equally normal and healthy," Radhika Apte. Radhika said that society looked at a "bigger sex appetite" as a "bad thing".
Please Wait while comments are loading...