»   »  మీడియాపై భగ్గుమన్న బాలయ్య 'లెజెండ్' హీరోయిన్: ఎందుకు?

మీడియాపై భగ్గుమన్న బాలయ్య 'లెజెండ్' హీరోయిన్: ఎందుకు?

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: నందమూరి హీరో బాలకృష్ణ హీరోగా చేసిన 'లెజెండ్' సినిమాలో హీరోయిన్‌గా నటించిన రాధికా ఆప్టే మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ముంబైలోని ఒక మాల్‌లో బాలీవుడ్ సినిమా 'బజార్' షూటింగ్ జరుగుతోంది. కొంత షూటింగ్ ముగిసిన తరువాత రాధిక లంచ్ కోసం తన వ్యానిటీ వ్యాన్‌లోకి వెళ్లింది.

ఆ తర్వాత కాసేటికి ఆమె వ్యాన్ నుంచి బయటకు వచ్చింది. ఇంతలో అక్కడ చేరిన ఫొటోగ్రాఫర్లు ఆమె పర్సనల్ మూమెంట్లపై కెమెరాలు క్లిక్ మనిపించారు. దీంతో రాధిక ఒక్కసారిగా వారిపై ఆగ్రహం వ్యక్తంచేస్తూ తన పర్మిషన్ లేకుండా ఫొటోలు ఎందుకు తీస్తున్నారని మండిపడింది.

 Radhika Apte expresses anguish at media

వాటిని వెంటనే డిలీట్ చేయాలని ఆమె డిమాండ్ చేసింది. రాధికా ఆప్టే లుక్‌ను అప్పుడే విడుదలచేయాలని ఈ సినిమా నిర్మాతలు అనుకోవడంలేదు. అందుకే ఆమె ఆగ్రహం వ్యక్తంచేసిందని ఫొటోగ్రాఫర్లు అంటున్నారు.

ఈ ఏడాది డిసెంబర్‌లో విడుదల కానున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటులు సైఫ్ అలీఖాన్, చిత్రాంగదా సింగ్ తదితరులు నటిస్తున్నారు.

Balakrishna Paisa Vasool Movie Release Date Changed
English summary
Balakrishna's Legend film heroine Radhika Apte axpressed anguish at media in Mumabai.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu