»   » తెలుగు హీరోలతో పడలేకే...సినిమాలకు నో

తెలుగు హీరోలతో పడలేకే...సినిమాలకు నో

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : తెలుగులోనూ లెజెండ్, లయన్ తదితర చిత్రాల్లో హీరోయిన్ గా చేసింది. ఈ భామ ఇప్పుడు తెలుగు హీరోలు, దర్శక, నిర్మాతలపై విరుచుకు పడుతోంది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఇక్కడి కొందరు దర్శక నిర్మాతలకు స్త్రీలపై గౌరవమే లేదంటూ దుమ్మెత్తి పోస్తోంది. హీరోల ఆధిక్యం అధికం అంటూ ఆరోపణలు గుప్పిస్తోంది. అందుకే టాలీవుడ్‌లో పలు అవకాశాలు వస్తున్నా నిరాకరిస్తున్నట్లు తెలిపింది.

కోలీవుడ్‌లోనూ అవకాశాలు లేని రాధిక ఆప్తే ప్రస్తుతం తన దృష్టిని బాలీవుడ్‌పై సారిస్తోంది.అన్నట్టు ఈ భామ ఇటీవల ఒక హాలీవుడ్ చిత్రంలోనూ నటిస్తోందన్నది గమనార్హం. ఈ మధ్య తన అశ్లీల దృశ్యాలు వెబ్‌సైట్స్, వాట్సాప్‌లలో హల్‌చల్ చేయడంతో కంగుతిన్న రాధిక ఆప్తే ఆ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Radhika Apte’s sensational controversial comments onTollywood

ఇప్పటి వరకూ రాధిక ఆప్టే తెలుగు సినిమాల్లో ఫుల్ లెంగ్త్ హీరోయిన్ గా కనిపించలేదు. కానీ ఇప్పుడది గతం అని చెప్పాలి. ‘లెజెండ్' సినిమా విజయం తర్వాత రాధిక ఆప్టే బాగా పాపులర్ అయ్యింది. అలాగే ప్రస్తుతం రాధిక ఆప్టేకి నిర్మాతలు, డైరెక్టర్స్ నుంచి ఫ్యాన్సీ ఆఫర్స్ వస్తున్నాయి.

‘రక్తచరిత్ర', ‘ధోని', ‘లెజెండ్‌' సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న బాలీవుడ్‌ నాయిక రాధిక ఆప్టే. గత రెండు రోజులుగా ఆమెవేనంటూ కొన్ని న్యూడ్‌ సెల్ఫీలు ఇంటర్‌నెట్‌లో హల్‌చల్‌ చేస్తున్నాయి. వీటిపై మొదట మౌనంగా ఉన్న రాధిక ఎట్టకేలకు స్పందించింది. ఆ ఫొటోలు తనవి కావని చెప్పుకొచ్చింది.

రాధిక ఆప్టే మాట్లాడుతూ ‘‘జనాలకు ఇంత ఖాళీ ఎక్కడి నుంచి వస్తుందో తెలియడం లేదు. వారు చేస్తున్న పనులు చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంటోంది. ఇంటర్‌నెట్‌లో ఎవరివో న్యూడ్‌ ఫొటోలు అప్‌లోడ్‌ చేసి అవి నావే అని చెప్పడం హాస్యాస్పదం. వాటి గురించి పట్టించుకునే తీరిక నాకులేదు. ఈ విషయంలో పెద్దగా బాధపడాల్సిన అవసరం కూడా లేదు. షూటింగ్‌ నిమిత్తం ఇతర ప్రాంతానికి వెళ్లిన నేను రెండు రోజుల క్రితమే ముంబాయి వచ్చాను. ఈ విషయమై చాలామంది నాకు కాల్‌ చేశారు.

నేనూ, నా స్నేహితులు నెట్‌లో ఆ ఫొటోలు చూసి నవ్వుకున్నాం. చాలా ఫన్నీగా అనిపించింది. కొందరు లీగల్‌ యాక్షన్‌ తీసుకుంటావా? అని అడుగుతున్నారు. ఇలాంటి వాటికి నేను ప్రాధాన్యం ఇవ్వను. దీని కోసం పోలీస్‌ స్టేషన్‌కి వెళ్ళడం, కేస్‌ పెట్టడం దండగ. దీనికోసం నా విలువైన సమయంలో ఒక్క సెకన్‌ కూడా వృథా చేయదలచుకోలేదు'' అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తెలుగులో ‘లయన్‌', హిందీలో ‘బద్లాపూర్‌', ‘హంటర్‌' కాకుండా మరో మూడు సినిమాలు అంగీకరించిందీ ముద్దుగుమ్మ.

English summary
Radhika Apte Said “Apart from Hindi, I acted in films of regional languages like Malayalam, Tamil, Telugu, Bengali and my mother language marathi. however the Industry’s during which I struggled lots is Tollywood. it’s a male dominant, male superpatriotic trade and it’s become unendurable on behalf of me to work there. Actresses aren’t in the slightest degree treated or cared regarding well there. i will be able to not work in Tollywood”.
Please Wait while comments are loading...