»   » ముదురుతోన్న జల్లికట్టు వివాదం: మెరీనా బీచ్ లో లారెన్స్, విజయ్ వీడియో (వీడియో)

ముదురుతోన్న జల్లికట్టు వివాదం: మెరీనా బీచ్ లో లారెన్స్, విజయ్ వీడియో (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

త‌మిళ‌నాడు రాష్ట్రంలో సాంప్ర‌దాయ క్రీడ‌గా జ‌రుపుకునే జ‌ల్లిక‌ట్టును సుప్రీంకోర్టు నిషేధించిన సంగతి తెలిసిందే. అయితే కోర్టు తీర్పును లెక్కచేయకుండా.. సంక్రాంతి పండుగ సంద‌ర్భంగా జ‌ల్లిక‌ట్టు లో పాల్గొన్న ప‌లువురిని పోలీసులు అరెస్టులు కూడా చేశారు. అయినా కూడా జ‌ల్లిక‌ట్టుపై నిషేధాన్ని ఎత్తివేయాలంటూ త‌మిళ‌నాడు రాష్ట్ర‌మంత‌టా నిర‌స‌న జ్వాల‌లు అంతకంతకూ ఉదృత‌మౌతున్నాయి. తమ సాంప్రదాయ క్రీడ అయిన జ‌ల్లిక‌ట్టును నిర్వ‌హించాలంటూ త‌మిళ‌నాడులోని మెరీనా బీచ్‌లో యువ‌కులు నిన్న‌టి నుంచి నినాదాలు చేస్తూ నిర‌స‌న తెలుపుతున్నారు.

దీనికి మ‌ద్ద‌తుగా కోలీవుడ్ హీరోలు సూర్య‌, విజ‌య్ త‌దిత‌ర స్టార్ హీరోలు ఎవరికి వారు ప్ర‌క‌ట‌న‌లు కూడా విడుద‌ల చేశారు. జ‌ల్లిక‌ట్టుపై నిషేధాన్ని ఎత్తివేయాలంటూ ప్ర‌ముఖ డాన్స్ మాస్ట‌ర్‌, న‌టుడు, హీరో రాఘ‌వ లారెన్స్ కూడా నిర‌స‌న‌ తెలుపుతోన్న యువ‌కుల‌తో క‌లిసి మెరీనా బీచ్‌లో బైఠాయించారు. ఈ నేప‌థ్యంలో అప్ర‌మ‌త్త‌మైన త‌మిళ‌నాడు రాష్ట్ర ప్ర‌భుత్వం ఆందోళ‌న‌లు మరింత పెరగకుండా ఉండేందుకు గానూ నిరసన ప్రదర్శ్నలు చేస్తున్న వారితో చ‌ర్చ‌లు జ‌రుపుతున్నట్లు తెలుస్తోంది. మెరీనా బీచ్ లో పోగైన ఆందోళనకారులంతా ముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వం మౌఖిక ప్రకటన చేయాలని పట్టుబట్టారు.

అయితే, మౌఖిక ప్రకటన చేయడం కుదరదని, సీఎం దానిపై ఓ లిఖితపూర్వక ప్రకటన విడుదల చేస్తారని వారు ఆందోళనకారులకు స్పష్టంచేశారు. తమ సంప్రదాయ క్రీడను నిషేధించడంపై గతకొన్ని రోజులుగా తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు చేపడుతున్న సంగతి తెలిసిందే. అయితే వారి నిరసన ప్రస్తుతం తీవ్ర రూపందాల్చింది. భారీ సంఖ్యలో విద్యార్థులు మెరీనా బీచ్‌కు చేరుకోవడంతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వాహనాల రాకపోకలు సైతం నిలిచిపోవడంతో.. పోలీసులు మరింత అప్రమత్తమయ్యా

తమిళనాడు బుల్ ఫైట్ గా పేరుగాంచిన జల్లికట్టుకు మద్దతుగా తమిళ హీరో విజయ్‌ మంగళవారం రాత్రి ఒక చిన్న వీడియోను విడుదల చేశారు. అందులో విజయ్‌ మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని చట్టాలను తీసుకు వచ్చినా ప్రజల సంస్కృతి కాపాడటం కోసమే. తమిళుడి మొదటి గుర్తింపు వేడుక ఈ జల్లికట్టు. దేనికి ఆశపడకుండా, ఎవరి ప్రోత్సాహం లేకుండా స్వచ్ఛందంగా జల్లికట్టు జరపాలని కోరుకుంటూ ఆందోళన జరపటానికి ముందుకు వచ్చిన యువకులందరికీ నేను తలవంచుతున్నాను. దీనికి సంబంధించి అరెస్టు చేసిన యువకులను విడుదల చేస్తే నేను సంతోషిస్తాను. దీనికంతటికీ కారణమైన పెటాను ఇక్కడి నుంచి తరిమికొడితే తమిళనాడు సంతోషిస్తుంది అని వ్యాఖ్యానించారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాలలో హల్‌చల్‌ చేస్తోంది.

English summary
Raghava Lawrence has displayed his large-hearted approach once again. The actor, who is known for carrying out a lot of charity works, has now donated big money to the Jallikattu supporters.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu