Just In
Don't Miss!
- News
Tractor rally: ట్రాక్టర్ల నెంబర్లు రాసుకున్న పోలీసులు, అమ్రేష్ పురి టైపులో ఓం భ్రీమ్ బ్రుష్!
- Sports
సైనీ గాయం గురించి మర్చిపోయా.. మూడో పరుగు కోసం రమ్మన్నాను! అంతలోనే: పంత్
- Finance
ఒక్కరోజు రూ.5.2 బిలియన్ డాలర్లు నష్టపోయిన ముఖేష్ అంబానీ
- Automobiles
బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం 50,000 మంది క్యూలో ఉన్నారు..
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
అతను ఏ విధంగానైనా ప్రవర్తించగలడు.. ‘కబీర్ సింగ్’పై దర్శకేంద్రుడి కోడలు కీలక వ్యాఖ్యలు
కనిక థిల్లాన్.. ఈ పేరు తెలుగు రాష్ట్రాల్లో చాలా మందికి తెలియకపోవచ్చు.. కానీ, బాలీవుడ్‌లో మాత్రం పేరున్న స్క్రీన్‌ప్లే రైటర్ అని చెబుతారు. తెలుగులో మాత్రం దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కోడలు, ప్రకాష్ కోవెలమూడి భార్య అంటే గుర్తు పడతారు. ఈమె తెలుగు వాళ్లకు అంతగా పరిచయం లేకపోయినా బాలీవుడ్‌లో మాత్రం మంచి పేరును సంపాదించుకుంది.
చాలా సినిమాలకు కథను అందించడంతో పాటు స్క్రీన్‌ప్లే బాధ్యతలు కూడా నిర్వర్తించింది. అంతెందుకు.. తెలుగులో ఆమె భర్త ప్రకాష్ కోవెలమూడి డైరెక్ట్ చేసిన 'సైజ్ జీరో' సినిమాకు కూడా కథ అందించింది కనికనే. అలాగే కంగనా వివాదాస్పద చిత్రం 'జడ్జిమెంటల్ హై క్యా'కు కూడా కథ, స్క్రీన్‌ప్లే ఈమెనే అందించింది.

తాజాగా ఈమె సంచలన చిత్రం 'కబీర్ సింగ్' చూసింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది. అంతేకాదు, సినిమా కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేసింది. ''నేను నెగెటివ్ ఆలోచనలతో 'కబీర్ సింగ్' సినిమాకు వెళ్లాను. కానీ, సినిమా చూస్తుండగా ఒక్కసారిగా అందులో లీనమైపోయాను. ఈ క్రమంలోనే అతడు తన ప్రేమ కోసం పిచ్చోడిలా అయిపోవడం నుంచి బయటకు రావాలని కోరుకున్నాను'' అని చెప్పుకొచ్చారు.
అలాగే, సినిమాపై రివ్యూలు ఇచ్చిన వారిపైనా ఆమె వ్యాఖ్యలు చేశారు. ''విమర్శకులు చెప్పినదానిని నేను పట్టించుకోను. ఎందుకంటే ఫిల్మ్ మేకర్స్‌కు కొంత భావం ఉండాలి. కానీ, అదే సమయంలో, ఒక నిర్దిష్ట మార్గంలో ప్రవర్తించే పాత్రలను సృష్టించడానికి వారికి కొంత స్వేచ్ఛ ఉందని విమర్శకులు అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. చిత్రంలోని పాత్ర నిస్సహాయ పరిస్థితిలో అన్నప్పుడు అతను ఏ విధంగానైనా ప్రవర్తించగలడు అని గుర్తించాలి'' అంటూ కనిక తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.