ఎన్టీఆర్ 'రామయ్యా వస్తావయ్యా' షూటింగ్ ఆగింది
హైదారాబాద్ : మరోసారి ఎన్టీఆర్ వినోదం, యాక్షన్ కలగలిపిన చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. అదే 'రామయ్యా వస్తావయ్యా'. ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న చిత్రమిది. హరీష్ శంకర్ దర్శకుడు. దిల్ రాజు నిర్మాత. ఈ చిత్రం షూటింగ్ కోసం యూనిట్ మొత్తం పొల్లాచ్చి వెళ్లింది. అయితే అక్కడ వర్షాలు దెబ్బకొట్టాయి. దాంతో అక్కడ షెడ్యూల్ కాన్సిల్ చేసుకుని వెనక్కి హైదరాబాద్ వచ్చేసారు.
ఎన్టీఆర్ స్టూడెంట్ గా కనిపించనున్న ఈ చిత్రంలో సమంత హీరోయిన్. శ్రుతిహాసన్ ప్రత్యేక పాత్రలో కనిపించనుంది. 'బుడ్డోడు బుడ్డోడు అంటే గుడ్డలూడదీసి కొడతా..నన్ను అలా పిలవాలంటే ఓ అర్హత వుండాలి. లేదా నా అభిమాని అయివుండాలి...అంటూ టీజర్‌లో ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్‌తో ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా సినిమా వుంటుందని నిర్మాత హామీ ఇస్తున్నారు.
నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ ''బృందావనంలో ఎన్టీఆర్‌ని సరికొత్తగా చూపించాం. ఇప్పుడు మరోసారి ఎన్టీఆర్‌ని వైవిధ్యభరితమైన పాత్రలో ఆవిష్కరించబోతున్నాం. ఆయన అభిమానులు ఏం కోరుకొంటున్నారో అవన్నీ ఈ కథలో మేళవించాం. ఎన్టీఆర్, సమంతలపై తెరకెక్కించిన సన్నివేశాలు వినోదాన్ని పంచుతాయి''అన్నారు.
ఎన్టీఆర్ సెంటిమెంట్‌గా భావించే సెప్టెంబర్ 17న ఈ సినిమాను విడుదల చేయాలని నిర్మాత దిల్‌రాజు ప్లాన్ చేస్తున్నారు. ఇందులో ఎన్టీఆర్ విద్యార్థి నాయకుడిగా కనిపించనున్నారని సమాచారం. ఈ చిత్రానికి సంగీతం: ఎస్.ఎస్. తమన్, ఛాయాక్షిగహణం: చోటా కె. నాయుడు, ఎడిటింగ్: అవినాష్ సైలా, స్క్రీన్‌ప్లే: రమేష్‌డ్డి, వేగేశ్న సతీష్.


Click it and Unblock the Notifications











