For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  డబ్బులు లేక కారు అమ్ముకొన్నా.. తరుణ్ భాస్కర్ కళ్ల నీళ్లు పెట్టుకొన్నాడు.. రాజ్ కందుకూరి

  By Rajababu
  |
  నేను కంటతడి పెట్టిన సంఘటన అదే !

  పెళ్లి చూపులు నిర్మాతగా రాజ్ కందుకూరి ఒక్కసారిగా దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించాడు. తాజాగా మెంటల్ మదిలో చిత్రంతో మరోసారి ఓ ఫీల్‌గుడ్ చిత్రంతో ముందుకొచ్చాడు. సక్సెస్‌ఫుల్ నిర్మాతగా మారడం వెనుక ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొన్నాడు రాజ్ కందుకూరి. ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైన గానీ తన లక్ష్యాన్ని మాత్రం వదులేదు. మార్కెటింగ్ మేనేజర్‌గా, గ్రానైట్ వ్యాపారిగా, కాలేజీ యజమానిగా, టెలివిజన్ షో రూం ఓనర్‌గా, యూఎస్‌లో కన్సల్టెంట్‌గా అనేక అవతారాలు ఎత్తినప్పటికీ సినిమాను వదులుకోలేదు. చివరికి నంది, జాతీయ అవార్డులతో ఉత్తమ నిర్మాతగా నిలిచారు. ఇలాంటి నేపథ్యంలో రాజ్ కందుకూరి తన వ్యక్తిగత, ఫ్రొఫెషనల్ విషయాలను ఓ యూట్యూబ్ ఛానెల్‌తో పంచుకొన్నారు. ఆయన చెప్పిన విషయాలు మీకోసం..

   నాన్న కోరిక మేరకే సినీరంగంలోకి

  నాన్న కోరిక మేరకే సినీరంగంలోకి

  మా నాన్న సద్గురు శ్రీ శివానంద మూర్తి. ఆయనకు ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రముఖులు ఫాలోవర్స్‌గా ఉన్నారు. వారిలో ప్రధాని మోదీ, మాజీ ప్రధాని అటల్ బీహారి వాజ్‌పేయ్; తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు నాయుడు, కేసీఆర్ తదితరులు ఉన్నారు. ఆయన కోరిక మేరకే నేను సినిమా రంగంలోకి ప్రవేశించారు. నిర్మాతగా, దర్శకుడిగా అవతారం ఎత్తాను.

   గౌతమ్ బుద్ధ అలా తీశాను

  గౌతమ్ బుద్ధ అలా తీశాను

  ఒకసారి నేను థాయ్‌లాండ్ పర్యటనలో ఉండగా మా నాన్న ఫోన్ చేశారు. గౌతమ్ బుద్ధ గురించి ఓ స్కిప్టు రాశాను. పూర్తిస్థాయిలో స్క్రిప్ట్ ఉంది. సినిమాగా తీస్తావా అని అడిగారు. మా నాన్న ఫోన్ చేసే సమయానికి నేను థాయ్‌లాండ్‌లోని బుద్ధ ఆలయంలో ఉండటం యాదృచ్చికమే అయినప్పటికీ.. అది నన్ను కదిలించింది. ఆయన కోరిక కాదనలేక నేను గౌతమ బుద్ద అనే సినిమాను రూపొందించాను. ఆ చిత్రానికి నంది అవార్డు లభించింది.

   నా కూతురు కంటతడి పెట్టించింది.

  నా కూతురు కంటతడి పెట్టించింది.

  ఆ తర్వాత చాలా సినిమాలు తీసాను. అన్ని దారుణంగా బోల్తాపడ్డాయి. ఆర్థికంగా నష్టపోయాను. పరిస్థితి బాగాలేకపోవడం అమెరికాకు వెళ్లాను. తిరిగి ఇండియాకు వచ్చాక 4.5 లక్షలు పెట్టి సాంత్రో కారు కొన్నాను. కారు కొన్నాక నెలరోజుల్లోనే నెల నిండకుండా నా కూతురు పుట్టింది. అప్పుడు పాపను రెయిన్‌బో ఆస్పత్రిలో చేర్చాం. చేతిలో చిల్లిగవ్వ కూడా లేదు. దాంతో కారును 3.5 లక్షలకు అమ్మేశాను. నా జీవితంలో నేను కంటతడి పెట్టిన సంఘటన అదే.

   పెళ్లిచూపులు సినిమా అలా

  పెళ్లిచూపులు సినిమా అలా

  తరుణ్ భాస్కర్ పెళ్లిచూపులు కథ చెప్పడానికి వచ్చాడు. ఇంటర్వెల్ వరకు కథ చెప్పాడు. ఆ తర్వాత మీతో ఒక విషయం చెప్పాలి అని అంటూ.. ఈ కథ ఇప్పటికే చాలా మందికి చెప్పాను. ఒకరిద్దరి వద్ద స్క్రిప్టులు కూడా ఉన్నాయి. నేను మీ వద్దకే మొదటిసారి వచ్చానని కథను ఒప్పుకోకండి అన్నారు. అందుకు సమాధానంగా నాకు కథ నచ్చితే నేను సినిమా చేస్తాను. ఎవరు రిజెక్ట్ చేస్తే నాకేంటి అని అన్నాను. కథ మొత్తం విన్నాక నేను అతడిని కౌగిలించుకొని ఓకే చెప్పాను.

  పెళ్లిచూపులు గురించి

  పెళ్లిచూపులు గురించి

  పెళ్లి చూపులు సినిమా అంతా పూర్తయిన తర్వాత నేను, తరుణ్ ఓ డిస్టిబ్యూటర్ వద్దకు వెళ్లాం. ఆయనకు సినిమా గురించి చెప్పి పెళ్లిచూపులు అని టైటిల్ పేరు చెప్పినప్పుడు.. ఇదేం టైటిల్. 30 ఏళ్ల క్రితం నాటి సినిమాలా అనిపిస్తున్నది. టైటిల్ వింటేనే సినిమా నడవదు అనిపిస్తున్నది. లాభం లేదు అని ఆయన అన్నాడు. ఆ వ్యక్తి అలా అనేటప్పుడు తరుణ్ భాస్కర్ కళ్లలో నీళ్లు తిరిగాయి.

   నిర్మాత సురేష్‌బాబుకు నచ్చడంతో

  నిర్మాత సురేష్‌బాబుకు నచ్చడంతో

  ఇలాంటి పరిస్థితుల్లో నా మిత్రుడు మధుర శ్రీధర్‌ను కలిశాను. పెళ్లిచూపులు సినిమాను ఆయనకు చూపించాను. సినిమా చూసిన తర్వాత షాకైన శ్రీధర్ అద్భుతమైన చిత్రాన్ని రూపొందించావు అని మెచ్చుకొన్నారు. ఆ తర్వాత నిర్మాత సురేష్‌బాబుకు చెప్పడంతో ఆయన నన్ను సంపద్రించారు. సురేష్‌బాబుకు సినిమాను చూపించిన తర్వాత ఆయన బాగా నచ్చింది. దాంతో సినిమాను ఆయన రిలీజ్ చేయడానికి ముందుకొచ్చారు. ఆ తర్వాత పెళ్లిచూపుల విజయం సాధించడం చాలా సంతోషం కలిగింది.

   మెంటల్ మదిలో సినిమా

  మెంటల్ మదిలో సినిమా

  పెళ్లిచూపులు రిలీజైన తర్వాత వివేక్ ఆత్రేయ వచ్చి ఓ కథ చెప్పాడు. వివేక్ చెప్పిన కథ పేరు కావ్యం. అది చాలా కవితాధోరణిలో ఉండటంతో నాకు నచ్చలేదని చెప్పాను. ఆ తర్వాత మరో కథ చెప్తాను అని ఫోన్ చేశాడు. ఎందుకో వివేక్ మైండ్‌సైట్ నచ్చక చూద్దాంలే అన్నాడు. అలా నన్ను రెండుమూడు సార్లు ఫోన్ చేయగా కథ వినడానికి సరే అన్నాను. ఆయన చెప్పిన కథ చెప్పిన తీరు, స్క్రిప్టు బాగా నచ్చింది. కథ మొత్తం విన్నాక అతడిని కౌగిలించుకొని వెంటనే సెల్ఫీ దిగి ఫేస్‌బుక్‌లో పెట్టాను. ఇతనే నా తదుపరి దర్శకుడు అని ప్రకటించాను అని అన్నాడు.

   అర్జున్‌రెడ్డి గురించి అప్పుడే చెప్పా

  అర్జున్‌రెడ్డి గురించి అప్పుడే చెప్పా

  అర్జున్‌రెడ్డి సినిమా కథను సందీప్‌రెడ్డి వంగ నాకు చెప్పాడు. ఆయన కథను చెప్పిన తీరు చూసి నేను ఆశ్చర్యపోయాను. ఈ సినిమా టాలీవుడ్‌లో మైలురాయిగా మారుతుంది అని అప్పుడే సందీప్‌కు చెప్పాను. సందీప్ రాసుకొన్న తీరు నన్ను బాగా ఆకట్టుకొన్నది. అయితే నేను నిర్మాతగా ఉంటాను అని చెప్పగా.. మా అన్నయ్యతో కలిసి సినిమా చేస్తున్నాను అని చెప్పడంతో వీలుకాలేదు.

   పవన్ కల్యాణ్‌ చిత్రంలో నటించా

  పవన్ కల్యాణ్‌ చిత్రంలో నటించా

  సినిమాల్లో చిన్న చిన్నపాత్రలు కూడా వేశాను. తమ్ముడు చిత్రంలో పవన్ కల్యాణ్ సరసన నటించాను. బాక్సింగ్ రింగులో పవన్‌కు కప్ అందించే జిల్లా కలెక్టర్ పాత్రను పోషించాను. ప్రభాస్ తొలిచిత్రం ఈశ్వర్ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాను. న్యూజిలాండ్‌లో ఆయనతో కలిసి షూటింగ్ చేశాం.

  పెళ్లికి ముందు భార్యతో

  పెళ్లికి ముందు భార్యతో

  నేను బాగా భయపడిన, ఆందోళన పడిన సందర్భం పెళ్లి చేసుకొనేటప్పుడు. ఎందుకంటే అప్పుడు నా ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అందుకే పెళ్లికి ముందు నా భార్యకు నా పరిస్థితి అంతా వివరించాను. ముందే క్లారిటీగా ఉంటే భవిష్యత్‌లో ఎలాంటి ఇబ్బందులు ఉండవని నేను భావిస్తా.

   బోల్డ్ సినిమాలు తీయను..

  బోల్డ్ సినిమాలు తీయను..

  నేను బోల్డ్ కంటెంట్, అశ్లీల సినిమాలు తీయను. మహిళలను కించపరిచే విధంగా నా చిత్రంలో కథ ఉండదు. అమ్మాయిలు ధైర్యంగా బయట ప్రపంచంలోకి రావాలి. అందుకే అసిస్టెంట్ డైరెక్టర్‌గా, కెమెరా డిపార్ట్‌మెంట్‌‌లో నా యూనిట్‌లో అమ్మాయిలను పెట్టుకొన్నాను. నా సినిమాలో అమ్మాయిల పాత్రలు బలంగా ఉంటాయి. పెళ్లి చూపులు, మెంటల్ మదిలో చిత్రాలు అమ్మాయిల కథతో రూపొందించాం.

  English summary
  Producer Raj Kandukuri's latest movie is Mental Madhilo. This movie going good at Overseas and local market. This movie is getting huge applause from all sectors. In this event, Raj Kandukuri speaks about his personal and Professional life to media.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X