»   » రాజ్‌తరుణ్‌ ఇలా చేస్తాడని అసలు ఊహించం,అంతటా ఇదే టాపిక్

రాజ్‌తరుణ్‌ ఇలా చేస్తాడని అసలు ఊహించం,అంతటా ఇదే టాపిక్

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్ కంగారుపడకండి అంత కాని పని ఏమీ చేయలేదు రాజ్ తరణ్ . కాకపోతే తనలోని నిద్రాణమై ఉన్న టాలెంట్ ని తట్టిలేపాడు. సాధారణంగా హీరోలు, హీరోయిన్స్ అప్పుడప్పుడూ గొంతు సవరించుకొని పాటలు పాడడం మామూలే. అయితే రాజ్‌ తరుణ్‌ ఇంకో అడుగు ముందుకేశాడు. పెన్ను పట్టి, ఓ పాట రాసేసి దుమ్మురేపేసాడు. దాంతో ఈ విషయం మీడియాలోనే కాక సిని సర్కిల్స్ లోనూ హాట్ టాపిక్ గా మారింది.

'జానీ జానీ యస్ పాపా... మామా మామా మామా అమ్మాయిలెందుకు మామా' అనే పాటతో లిరిక్ రైటర్ అవతారం ఎత్తాడు. ఏ సినిమా కోసం ఆయన్ని ఎంకరేజ్ చేసారూ అంటే....రాజ్‌ తరుణ్‌ హీరోగా నటిస్తున్న చిత్రం 'కిట్టు ఉన్నాడు జాగ్రత్త'. వంశీ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అనూఇమ్మానియేల్‌ హీరోయిన్. ఈ చిత్రం కోసమే రాజ్‌ తరుణ్‌ ఈ పాట రాశాడు.

Raj Tarun impresses as lyricist


మరో ప్రక్క ...'కిట్టు ఉన్నాడు.. జాగ్రత్త' విడుదల మార్చి 3కు వాయిదా పడింది. ఈ చిత్రం ఫిబ్రవరి 17న విడుదల కావాల్సి ఉంది. ఈ చిత్రం ప్రచారంలో భాగంగా సినిమాలోని పాటల వీడియోలను ఒక్కొక్కటీ విడుదల చేస్తున్నారు.

ఫిబ్రవరి 14న ''అర్థమైందా'' సాంగ్‌ను విడుదల చేసిన చిత్ర యూనిట్.. గురువారం తాజాగా మరో పాటను విడుదల చేసింది. రాజ్ తరుణ్ అండ్ గ్రూప్‌పై చిత్రించిన ''జానీ జానీ ఎస్ పాప... డ్రింకింగ్ వొడ్కా నో పాప'' లెరెక్స్ వీడియోను యూట్యూబ్‌లో పెట్టారు. అనిల్ సుంకర నిర్మాతగా, వంశీ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చారు.

''ఇటీవల విడుదల చేసిన టీజర్ కు మంచి స్పందన వస్తోంది. ప్రేమికుల రోజు సందర్భంగా ఓ పాటని విడుదల చేశాం. అది యువతరానికి నచ్చింది. రాజ్‌తరుణ్‌ పాట అబ్బాయిలందరూ పాడుకొనేలా ఉంది''అని దర్శక,నిర్మాతలు చెప్తున్నారు.

'ఉయ్యాల జంపాల'తో అనుకోకుండా హీరో అయిపోయిన రాజ్‌తరుణ్‌, 'కుమారి 21 ఎఫ్‌', సినిమా చూపిస్తా మావా తదితర చిత్రాలతో యంగ్‌ హీరోల రేసులోకి వచ్చేసి, వరస హిట్స్ తన ఉనికిని బాగానే చాటుకుంటున్నాడు. ఈ యంగ్ జనరేషన్ హీరోల లో మినిమమ్ గ్యారెంటీ హీరోగా గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా.. హీరోగా మంచి విజయాలు సాధిస్తున్న రాజ్ తరుణ్ ప్రస్తుతం ఏకె ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ లో వరుస సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే.

English summary
Apart from acting in Kittu Unnadu Jagratha, actor Raj Tharun is also penning the lyrics. He has written the song "Johnny Johnny". The makers are planning to release the film on 3rd March.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more