For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  11 నిముషాల ... బ్రహ్మానందం,సప్తగిరి సీన్స్ కలుపుతున్నారు

  By Srikanya
  |

  సినిమా రిలీజయ్యాక రిపీట్ ఆడియన్స్ కోసం లెంగ్త్ కోసం ఎడిట్ చేసిన సన్నివేశాలు మళ్లీ కలపటం జరుగుతూంటుంది. కథనానికి ఆడ్డు వచ్చాయని కొందరు భావించి తొలిగించిన సీన్స్ ఆ తర్వాత కొద్ది రోజులుకు ధియోటర్ లో అలాగే ప్రత్యక్ష్యమవుతూంటాయి. తాజాగా మొన్న శుక్రవారం విడుదలైన సినిమా చూపిస్త మామ చిత్రానికి ఇప్పుడు 11 నిముషాల సన్నివేశాలు కలుపుతున్నట్లు సమాచారం. బ్రహ్మానందం, సప్తగిరి నటించిన ఈ సన్నివేశాలు ప్రేక్షకులకు గిలిగింతలు పెడతాయని భావిస్తున్నారు. అయితే ఇండియాలో ప్రదర్శిస్తున్న ధియోటర్స్ లో మాత్రమే కలుపుతారు.

  ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

  చిత్రం కథేమిటంటే.....

  కత్తి (రాజ్ తరుణ్) ఇంటర్ కూడా పాస్ కాని ఓ లోఫర్. ఖాళీగా ఉండటం ఎందుకునుకున్నాడో ఏమో...ప్రణీత (అవికా గోర్) తో ప్రేమలో పడతాడు. ఆమె కూడా సర్లే కుర్రాడు కష్టపడుతున్నాడు అని కొద్ది కాలానికి అతని ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. అయితే ఆమె ఇతకి రివర్స్ ...ఇంటర్ స్టేట్ రాంకర్. సర్లే ఇంతవరకూ బాగానే ఉంది మామ అంటే...ఆమె తండ్రి ఎవరూ అంటే.... తండ్రి సోమనాధ్ ఛటర్జీ(రావు రమేష్) చాలా స్ట్రిక్ట్...ఆయన మెడికల్ కౌన్సిల్ లో డిఫ్యూటీ సెక్రటరీ గా చేస్తూంటారు. జీవితంలో ప్రతీది హై క్వాలిటీ కోరుకునే వ్యక్తి.

  Raj Tarun's 'Cinema Chupista Mava' : adds more scenes

  అలాంటి వాడు తన కూతురుని ఇలాంటి లోఫర్ కి ఇవ్వటానికి ఒప్పుకుంటాడా...,ససిమేరా కాదంటారు..అలాగని కూతురు మనస్సుని నొప్పించలేదు..అప్పుడు తెలివిగా ...ఓ కండీషన్ పెడతాడు. తన కూతురు చెయ్యి పట్టుకోవాలంటే...తన కుటుంబాన్ని ఓ నెల పాటు సర్వ ఖర్చులూ భరించాలని, అదీ కత్తి సొంత ఆదాయంతో అని షరతు పెడతాడు. అప్పుడు కత్తి ఏం చేసి ఆ డబ్బు సంపాదించాడు...ఈ క్రమంలో అతనికి ఏం ట్విస్ట్ లు పడ్డాయి. చివరకు ఆమె ను ఎలా పొందాడు అనేది మిగతా కథ.

  రాజ్‌తరుణ్‌ మాట్లాడుతూ ''ఒక మంచి ప్రేమకథ ఇది. సన్నివేశాలు హాయిగా సాగుతూ వినోదాల్ని పంచుతాయి. కుటుంబంతో పాటు, యువత, మాస్‌ ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంది''అన్నారు.

  బెక్కెం వేణుగోపాల్‌ మాట్లాడుతూ ''ఉయ్యాల జంపాల' తర్వాత... రాజ్‌, అవికా కలిసి చేస్తున్న సినిమా ఇది. అంచనాలు ఎక్కువగా ఉంటాయి. వాటిని అందుకొనేలా చిత్రాన్ని తెరకెక్కించాం''అన్నారు.

  దర్శకుడు చెబుతూ ''మావ, అల్లుడు, మరదలు మధ్య నడిచే ప్రేమకథ. తన ప్రేమని సినిమాగా చూపిస్తానని అల్లుడు మావకి సవాల్‌ విసురుతాడు. ఆ సవాల్‌ కోసం ఏం చేశాడన్నది తెరపైనే చూడాలి'' అన్నారు.

  రాజ్‌ తరుణ్‌ హీరోగా అంజిరెడ్డి ప్రొడక్షన్స్‌, ఆర్‌.డి.జి ప్రొడక్షన్స్‌ ప్రై. లిమిటెడ్‌ సంయుక్త సమర్పణలో, ఆర్యత్‌ సినీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, లక్కీ మీడియా పతాకాలపై బోగాది అంజిరెడ్డి, బెక్కెం వేణుగోపాల్‌, రూపేష్‌ డి.గోవిల్‌, జి.సునీత సంయుక్తంగా నిర్మించిన సినిమా ‘సినిమా చూపిస్త మావ'. త్రినాథరావు నక్కిన దర్శకుడు.

  English summary
  According to the latest,Raj Tarun, Avika Gor's ‘Cinema Chupista Mava’ makers buoyed by the response from the movie lovers decided to include additional 11 minute scenes featuring Brahmanandam and Sapthagiri.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X