For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  కొడుకులను కాదని ఆ యువ హీరోతో నాగార్జున న్యూ ప్రాజెక్ట్.. డిజాస్టర్ కాంబోపై భారీ రిస్క్?

  |

  ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఒక్క హిట్టు పడితే చాలు భగవంతుడా అనే హీరోలు చాలా మంది ఉన్నారు. కొందరు ఎంత కష్టపడిన సక్సెస్ అందుకోవడం లేదు. లేని పోనీ ప్రయోగాలు చేస్తే మళ్ళీ కెరీర్ మొదటికి వస్తుందేమో అనే హీరోలు కూడా చాలా మంది ఉన్నారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితుల్లో యువ హీరో రాజ్ తరుణ్ కూడా ఉన్నాడు. నిర్మాతలు దర్శకులు అతనికి బాగానే సపోర్ట్ చేస్తున్నారు గాని వర్కౌట్ కావడం లేదు. ఇక ఫైనల్ గా అతని కెరీర్ మళ్ళీ నాగార్జున చేతుల్లోకి వచ్చినట్లు తెలుస్తోంది.

   ఆ సినిమాతోనే కెరీర్ యూ టర్న్ తీసుకుంది

  ఆ సినిమాతోనే కెరీర్ యూ టర్న్ తీసుకుంది

  నాగార్జున నిర్మించిన ఉయ్యాల జంపాల సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. రాజ్ తరుణ్ కెరీర్ ఒక్కసారిగా మలుపు తిరిగింది. వెంటనే సినిమా చూపిస్త మావ, కుమారి 21F వంటి సినిమాలు మంచి విజయాన్ని అందుకోవడంతో యువ హీరోకి ఒక స్పెషల్ మార్కెట్ కూడా ఏర్పడింది. అయితే ఆ తరువాత చేసిన సినిమాలు పెద్దగా వర్కౌట్ కాలేవు.

  ఓటీటీలో ఒరేయ్ బుజ్జిగా..

  ఓటీటీలో ఒరేయ్ బుజ్జిగా..

  దిల్ రాజు వంటి స్టార్ ప్రొడ్యూసర్ తో లవర్, ఇద్దరి లోకం ఒక్కటే వంటి సినిమాలు కూడా చేశాడు. ఆ సినిమాలు కూడా ఊహించని విధంగా దెబ్బ కొట్టాయి. ఇక ఇప్పుడు ఒరేయ్ బుజ్జిగా అనే సినిమాను డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ చేయనున్నాడు. ఆ సినిమాతో ఎంతవరకు ఆకట్టుకుంటాడో చూడాలి.

   మరోసారి నాగార్జున కాంపౌండ్ లోకి..

  మరోసారి నాగార్జున కాంపౌండ్ లోకి..

  ఇక రాజ్ తరుణ్ మళ్ళీ కెరీర్ ని సెట్ చేసుకోవడానికి మరోసారి నాగార్జున కాంపౌండ్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. అన్నపూర్ణ ప్రొడక్షన్ లో రాజ్ తరుణ్ ఒక క్యూట్ లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడట. కథ నచ్చడంతో నాగార్జున పెద్దగా చర్చలు పెట్టకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కొడుకులతో కూడా ఈ మధ్య కాలంలో సినిమాలు చేయని నాగార్జున ఈ యువ హీరోపై మాత్రం బాగానే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

  అంతా బాగానే ఉంది.. కానీ?

  అంతా బాగానే ఉంది.. కానీ?

  బిజినెస్ మైండ్ అయినప్పటికీ ఒక మనిషి క్యారెక్టర్ నచ్చితే నాగార్జున ఏ విధంగానైనా సహాయం చేస్తారనేది ఇండస్ట్రీలో అందరికి తెలిసిన విషయమే. అదే తరహాలో రాజ్ తరుణ్ టాలెంట్ ని గమనించి మరో మంచి సినిమా చేయడానికి అవకాశం ఇచ్చారు. అంతా బాగానే ఉంది కాని సినిమా కాంబినేషన్ పైనే కొంత అనుమానం కలుగుతోందనే కామెంట్స్ వస్తున్నాయి.

  Chitram X Movie Trailer | Latest Movie Trailers
  ఆ దర్శకుడితో మరోసారి..

  ఆ దర్శకుడితో మరోసారి..

  రాజ్ తరుణ్ తో నాగార్జున నిర్మియించబోయే సినిమాకు శ్రీనివాస్ గవిరెడ్డి దర్శకత్వం వహించబోతున్నాడు. ఇదివరకే రాజ్ తరుణ్ ఇతనితో సీతమ్మ అందాలు.. రామయ్య సిత్రాలు అనే సినిమా చేశాడు. ఆ సినిమా అనుకున్నంతగా అయితే సక్సెస్ కాలేదు. రొటీన్ ఫార్ములా అని అప్పట్లో విమర్శలు అందుకుంది. ఇక ఇప్పుడు కాస్త కొత్తదనంతో కూడిన ప్రేమ కథను సెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. వీలైనంత త్వరగా షూటింగ్ మొదలు పెట్టాలని నాగ్ చిత్ర యూనిట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. మరి ఈ సినిమాతోనైనా ఈ హీరో మళ్ళీ పుంజుకుంటాడో లేదో చూడాలి.

  English summary
  If a film succeeds early in life, it is natural that the heroes have huge offers. If they hit three or four hits in a row, they would be a market place in the industry. But the misfortunes of Raj Tarun are constantly falling apart. Even the movies that do that are having a lot of trouble getting up to the theaters.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X