»   » రవితేజ హీరోగా ‘రాజా ది గ్రేట్’ (ఫస్ట్ లుక్ పోస్టర్ ఇదే)

రవితేజ హీరోగా ‘రాజా ది గ్రేట్’ (ఫస్ట్ లుక్ పోస్టర్ ఇదే)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మాస్ మహారాజ రవితేజ హీరోగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న చిత్రం 'రాజా ది గ్రేట్'. ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించబోతున్నారు. 'రాజా ది గ్రేట్' చిత్రం ప్రారంభోత్సవం ఈ రోజు హైదరాబాద్ లో జరిగింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్లో దిల్ రాజు సమర్ఫణలో శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

 Raja The Great first look Poster released

గత సంవత్సరం అసలు సినిమాలేవీ చేయకుండా గ్యాప్ తీసుకున్న రవితేజ ఇపుడు వరుస సినిమాలకు కమిట్ అవుతుండటం విశేషం. ఏది ఏమైనా రవితేజ వరుస సినిమాలకు కమిట్ అవ్వడంపై అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


ప్రస్తుతం రవితేజ బేబీ భవ్య సమర్పణలో లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) , వల్లభనేని వంశీ నిర్మిస్తున్న 'టచ్ చేసి చూడు' అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ చత్రం ద్వారా విక్రమ్ సిరికొండ దర్శకునిగా పరిచయవుతున్నారు.

English summary
Raja The Great first look Poster released. Successful director Anil Ravipudi is going to direct this film and Shirish is going to produce it on Sri Venkateswara Creations banner.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu