»   » రాజమౌళి, కంగనా, అమితాబ్,ఐష్, కల్కి ఇంకా...నేషనల్ అవార్డ్ పంక్షన్ లో (ఫొటోలు)

రాజమౌళి, కంగనా, అమితాబ్,ఐష్, కల్కి ఇంకా...నేషనల్ అవార్డ్ పంక్షన్ లో (ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్: 'బాహుబలి' చిత్రానికి 63వ నేషనల్ అవార్డుల్లో బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ గా అవార్డు దక్కిన సంగతి తెలిసిందే. బెస్ట్ స్పెషల్ ఎపెక్ట్స్ విభాగంలోనూ ఈ చిత్రానికి అవార్డు దక్కింది. ఈ అవార్డు ని ఢిల్లీ వచ్చి అందుకున్నారు రాజమౌళి. ఆయన తో పాటు ఆయన నిర్మాత లు ఇద్దరినీ మీరు ఈ క్రింద ఫొటోలలో గమనించవచ్చు.

  ఈ అవార్డ్ ల పంక్షన్ కి అవార్డ్ లు అందుకునేందుకు బాలీవుడ్ మెగా స్టార్ అమితాబ్, కంగనా రనౌత్ వంటివారు వచ్చారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా విజ్ఞాన్ భవన్ లో ఈ వేడక జరగింది. అక్కడకి వచ్చిన ప్రముఖులంతా రాజమౌళిని పలకరించి విషెష్ తెలియచేసారు.

  అమితాబ్, కంగనా మాత్రమే కాక మీరు ఈ ఫొటోల్లో అమితాబ్ కుటుంబం మొత్తం చూడవచ్చు. అలాగే బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ, కల్కి కొచ్చిన్, కబీర్ ఖాన్, రెమో డిసౌజా వంటివారు హాజరయ్యారు.

  ప్రొడెక్షన్, సినిమా విలువలతో బాక్సాఫీస్ దగ్గర రికార్డులు బద్దలు కొట్టిన బహూబలిని ఫిల్మ్ జ్యూరీ ఉత్తమ చిత్రంగా ఎంపిక చేసింది. ఫాంటసీ విలువలను కూడా బాహుబలి అత్యద్భుతంగా తెరకెక్కించిందని జ్యూరీ సభ్యులు అభిప్రాయపడ్డారు.

  మరో ప్రక్క... రాజమౌళి భన్సాలీలలో ఉత్తమ దర్శకుడు అవార్డుకు ఎవరిని ఎంపిక చేయాలనే అంశంపై జ్యూరీ మెంబర్లలో భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవ్వడంతో రాజమౌళి భాన్సాలీల మధ్య నెక్ టు నెట్ పోటీ ఏర్పడిన విషయాన్ని బయట పెట్టాడు.

  అదే విధంగా 'బాహుబలి' సినిమా విషయంలో జాతీయ అవార్డుల ప్యానల్ అన్యాయం చేసింది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. దాదాపు 150 కోట్ల బడ్జెట్ తో 600 కోట్ల కలక్షన్స్ ను వసూలు చేసిన 'బాహుబలి' సినిమాకు ఉత్తమ చిత్రంగా అవార్డును ఇచ్చి సరిపెట్టడమే కాకుండా ఈ సినిమాలో కేవలం స్పెషల్ ఎఫెక్ట్స్ మాత్రమే బాగున్నాయి అన్న సంకేతాలు వచ్చే విధంగా ఈసినిమాకు జాతీయ స్థాయి స్పెషల్ ఎఫెక్ట్స్ విభాగంలో అవార్డు ఇచ్చారు.

  ముగ్గురు జ్యూరీ సభ్యులు ఈ అవార్డులను ఎంపిక చేశారు. ఈసారి డిజిటల్ రూపంలో ఎంట్రీలు వచ్చాయి. ఫీచర్ కేటగిరీలో 29 భాషల్లో 308 సినిమాలు ఎంట్రీ వచ్చాయి. మొత్తం రెండు నెలల పాటు సెలక్షన్ ప్రక్రియ కొనసాగినట్లు సభ్యులు తెలిపారు. అవార్డులు ప్రకటించిన వాళ్లలో ఫిల్మ్ బోర్డుకు చెందిన గంగమరియన్, సంజీవ్‌దత్తా, జాన్, ధరమ్ గులాటీ, జాన్ సహాయ్, ఎస్‌ఆర్ లీలా, శ్రీకే వాసు, సతీశ్ కౌశిక్ ఉన్నారు.

  స్లైడ్ షోలో అవార్డ్ సెర్మనీ ఫొటోలు మీరు చూడవచ్చు....

  రాజమౌళి

  రాజమౌళి

  బాహుబలి చిత్రానికి గానూ అవార్డుని రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకుంటూ...

  పలకరింపు

  పలకరింపు

  అమితాబ్ ..రాజమౌళిని పలకరిస్తున్నప్పుడు...

  నిర్మాతలతో

  నిర్మాతలతో

  బాహుబలి నిర్మాతలతో రాజమౌళి ..అవార్డ్ ని చూపుతూ...

  సుబ్బిరామిరెడ్డిని

  సుబ్బిరామిరెడ్డిని

  ఈ ఫొటోలో మీరు ప్రముఖ నిర్మాత, పారిశ్రామిక వేత్త సుబ్బిరామిరెడ్డిని గమనించవచ్చు.

  కంగనాతో

  కంగనాతో

  అమితాబ్...అవార్డ్ అందుకోవటానికి వచ్చిన కంగనా తో ఇలా..

  కంగనా అవార్డ్ అందుకుంటున్నప్పుడు

  కంగనా అవార్డ్ అందుకుంటున్నప్పుడు

  జాతీయ ఉత్తమనటిగా కంగనా అవార్డ్ అందుకుంటున్న క్షణాలు

  భార్యాభర్తలిద్దరూ

  భార్యాభర్తలిద్దరూ

  ఐషు, అభిషేక్ ఇద్దరూ ఈ పంక్షన్ లో ముచ్చట్లు చెప్పుకుంటూ..

  టప్పట్లుతో

  టప్పట్లుతో

  వేరేవారు అవార్డు అందుకునేటప్పుడు కూడా ఇలా తమ ఆనందాన్ని...

  క్వీన్..

  క్వీన్..

  కంగనా అవార్డ్ అందుకోవటానికి వెళ్తున్నప్పుడు అచ్చం క్వీన్ లా కనిపించింది.

  వస్తూ..

  వస్తూ..

  అమితాబ్ తో పాటు సెర్మనికి లోపలకి వస్తూ..

  సరదాగా

  సరదాగా

  అమితాబ్ ఏం చెప్పారో మరి కంగనా ఎంజాయ్ చేస్తోంది

  శుభాకాంక్షలు చెప్తూ

  శుభాకాంక్షలు చెప్తూ

  జావేద్ అక్తర్ కు విషెష్ చెప్తూ అభిషేక్..

  కల్కి కొచ్చాయాన్

  కల్కి కొచ్చాయాన్

  అవార్డ్ సెర్మనీ లో ఈమే ఓ స్పెషల్ ఎట్రాక్షన్

  ఉత్సాహం

  ఉత్సాహం

  అవార్డ్ తీసుకుని చూపెడుతున్నప్పుడు ఆ ఉత్సాహమే వేరు కదా

  ఆసక్తిగా

  ఆసక్తిగా

  ఎవరెవరు స్టేజీపై అవర్డులు అందుకుంటున్నారో ఆసక్తిగా పరిశీలిస్తూ...

  వదలడుగా

  వదలడుగా

  తన భార్య ఐషు తో బయిటకు వెళ్లినప్పుడు ఆమె చేయి తన చేతిలో ఉండాల్సిందే మరి...

  మెరుస్తున్నాయి

  మెరుస్తున్నాయి

  క్వీన్ కళ్లు చూడండి..ఆనందంతో ఎలా మెరుస్తున్నాయో...

  హడావిడి

  హడావిడి

  సెర్మినీకు కాస్త లేటైనట్లున్నారు..హడావిడిగా...

  మామా,కోడళ్లు

  మామా,కోడళ్లు

  పబ్లిక్ ఫంక్షన్ లో ఎప్పుడూ ఈ మామా, కోడళ్లే స్పెషల్ ఎట్రాక్షన్

  ఎందుకు నవ్వుతున్నారో

  ఎందుకు నవ్వుతున్నారో

  అమితాబ్ చూడండి..ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో...

  తీసుకుంటున్నాం

  తీసుకుంటున్నాం

  అవార్డ్ తీసుకుంటున్నప్పుడు గ్రహీతలు చూడండి ఎలా మెరిసిపోతారో

  విలువైనవి

  విలువైనవి

  అవార్డ్ లు అనేవి జీవీతాతం గుర్తు పెట్టుకోదగ్గవి, విలువైనవి

  ఆయన వస్తేనే

  ఆయన వస్తేనే

  అమితాబ్ వస్తూంటే చూస్తున్న రాష్ట్రపతిని చూడండి..ఎంత గ్రేస్ గా వెలుగుతున్నారో

  గెస్ట్ లు కూడా

  గెస్ట్ లు కూడా

  అవార్డ్ లు గ్రహీతులు, గెస్ట్ లతో మొత్తం ప్రాగణం మెరిసిపోయింది.

  మీడియా

  మీడియా

  అవార్డ్ తీసుకోగానే సరా.. మీడియా వారుకు నాలుగు మాటలు చెప్పాలి

  వన్ మినిట్

  వన్ మినిట్

  మాట్లాడతాను..వన్ మినిట్..ఆగండి...అంటున్నట్లుంది కల్కి

  వస్తున్నా

  వస్తున్నా

  స్టార్ డైరక్టర్ వస్తున్నారంటే ఆ కళే వేరబ్బా

  English summary
  63rd National Film Awards ceremony got a dash of glitz and glamour of Bollywood with Tollywood Director Rajamouil, Megastar Amitabh Bachchan and Kangana Ranaut getting Best Actor and Best Actress honours. President Pranab Mukherjee presented the awards at the ceremony at Vigyan Bhavan.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more