twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'ఈగ' కథ ముందే చెప్పేశా.. RRR గురించి నేనేం చెప్పను, నా టార్గెట్ అదే.. రాజమౌళి!

    |

    Recommended Video

    Director SS Rajamouli Interview At India Conference 2019 | Filmibeat Telugu

    దర్శక ధీరుడు రాజమౌళి బాహుబలి చిత్రంతో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ స్థాయికి తీసుకుని వెళ్లారు. ప్రస్తుతం అంతకంటే భారీ స్థాయిలో ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇటీవల రాజమౌళి బోస్టర్ లో జరిగిన ఇండియా కాన్ఫెరెన్స్ 2019కు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజమౌళికి మీడియా నుంచి, అభిమానుల నుంచి అనేక ప్రశ్నలు ఎదురయ్యాయి. ఇందులో ఆర్ఆర్ఆర్ చిత్రం గురించే ఎక్కువగా అడిగారు. కానీ రాజమౌళి మాత్రం ఎలాంటి విషయాలు వెల్లడించకుండా జాగ్రత్త వహించారు. కానీ కొన్ని ఆసక్తికరమైన అంశాలని మాత్రం ప్రస్తావించారు.

    ఆ రెండు సినిమాలకు మాత్రమే

    ఆ రెండు సినిమాలకు మాత్రమే

    ఓ అభిమాని మాట్లాడుతూ.. మీ గత చిత్రాలకు సంబందించిన కథ ముందుగానే కాస్త తెలిసేది. కానీ ఆర్ఆర్ఆర్ గురించి మాత్రంఏమీ తెలియడం లేదు. ఆ చిత్రం గురించి ఏదైనా ఒక విషయం చెప్పండి అని అడిగా రాజమౌళి నవ్వుతూ సమాధానం చెప్పారు. నేను ఇప్పుడు ఆర్ఆర్ఆర్ గురించి ఏమీ చెప్పను. గతంలో కూడా నా అన్ని చిత్రాలకు కథ చెప్పేయలేదు. బాహుబలి కథని నేను ముందుగా చెప్పలేదు. ఈగ, మర్యాద రామన్న చిత్రాల కథ మాత్రమే ముందుగా చెప్పా అని రాజమౌళి తెలిపారు.

    ఇది సరైన సమయం కాదు

    ఇది సరైన సమయం కాదు

    ఆర్ఆర్ఆర్ గురించి అంతా సీక్రెట్ గా ఉంచాలని అనుకోవడం లేదు. సరైన సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలు తెలియజేస్తా అని రాజమౌళి తెలిపారు. ఆర్ఆర్ఆర్ చిత్రం రాంచరణ్, ఎన్టీఆర్ కథానాయకులుగా ఇండియాలో బిగ్గెస్ట్ మల్టీస్టారర్ చిత్రంగా తెరకెక్కుతోంది. ఈ చిత్ర కథ గురించి అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

     నా టార్గెట్ అదే

    నా టార్గెట్ అదే

    బాహుబలి జపాన్ లో కూడా అఖండ విజయం సాధించింది. కాబట్టి భవిష్యత్తులో భారీ ఇంటర్నేషనల్ సినిమా చేస్తారా అనే ప్రశ్నకు రాజమౌళి ఆసక్తికర సమాధానం ఇచ్చారు. నేను బాహుబలి చిత్రం చేసే సమయంలో జపాన్ ఆడియన్స్ కోసం చేయలేదు. మన ఇండియన్ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకునే ఈ చిత్రం చేశా. కానీ బాహుబలి జపాన్ లో కూడా క్లిక్ అయింది. నా సినిమాల్లో నేను టార్గెట్ చేసేది హ్యూమన్ ఎమోషన్స్ పైనే అని రాజమౌళి అన్నారు. అది బావుంటే అందరికి నచ్చుతుందని తెలిపారు.

    మనకు ఉన్న కథల్నే

    మనకు ఉన్న కథల్నే

    తాను అంతర్జాతీయ స్థాయిలో సినిమా చేయడానికి ప్రత్యేకంగా ఏమీ కథలు ఎంచుకోను. మనదగ్గర ఉన్న కథలనే తీసుకుంటా. అందులో ఎమోషనల్ బాగా ఉందా లేదా అనే విషయాన్ని ముందుగా పరిశీలిస్తా. ఆ తర్వాతే సినిమా ప్రారంభిస్తా అని రాజమౌళి అన్నారు. ప్రాంతీయంగా తీసిన సినిమా బావుంటే ఇంటర్నేషనల్ మార్కెట్ లో కూడా రాణిస్తుందని రాజమౌళి తెలిపారు.

    English summary
    Rajamouli about Eega movie and he dont want to reveals anything about RRR
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X