twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘గరుడ’ ప్రాజెక్ట్ గురించి రాజమౌళి స్పందించారు

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: బాహుబలి తర్వాత రాజమౌళి అంతకు మించిన బడ్జెట్ తో ‘గరుడ' మూవీ తెరకెక్కిస్తున్నట్లు ఆ మధ్య మీడియాలో హాట్ టాపిక్ అయింది. అయితే ఈ వార్తలపై రాజమౌళి ఎప్పుడూ స్పందించడానికి ఆసక్తి చూపలేదు. అయితే ఎట్టకేలకు ఆయన ఈ విషయమై నోరు విప్పారు.

    భవిష్యత్తులో ‘గరుడ' ప్రాజుక్టును తెరకెక్కించేందుక ప్లాన్ చేస్తున్నట్లు రాజమౌళి చెప్పుకొచ్చారు. అయితే ఈ ప్రాజెక్టు కోసం అప్పుడే తాను నటీనటుల ఎంపిక, టెక్నిషియన్స్ ను ఎంపిక చేసుకుంటున్నట్లు వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. ఈ ప్రాజెక్టులోకి ప్రముఖ మళయాల నటుడు మోహన్ లాల్, మరికొందరిని ఖరారు చేసినట్లు వచ్చిన వార్తలను ఆయన ఖండించారు.

    Rajamouli about Garuda project

    ‘ ఇండియన్ సినిమా పరిశ్రమలోని గొప్ప నటుల్లో మోహన్ లాల్ ఒకరు. ఆయనతో కలిసి పని చేయాలని ఎప్పటి నుండో అనుకుంటున్నాను. అయితే ‘గరుడ' ప్రాజెక్టులోకి ఆయన్ను తీసుకున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదు. అసలు ఈ ప్రాజెక్టు గురించి ఇంకా ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. ఇంకా స్క్రిప్టు కూడా సిద్దంగా లేదు. ఈ ప్రాజెక్టు మొదలు కావడానికి చాలా సమయం ఉంది. ఎప్పుడు అనేది ఇంకా ప్లాన్ చేసుకోలేదు. ఇవన్నీ పూర్తి కాక ముందే, ఇంత ముందుగా ఈ ప్రాజెక్టులో నటీనటుల ఎంపిక గురించి ఆలోచించడం లేదు' అని రాజమౌళి తెలిపారు.

    తన డ్రీమ్ ప్రాజెక్టు ‘మహాభారత' గురించి అడ్గా.... ఆ ప్రాజెక్టు మొదలు పెట్టాలంటే విజువల్ ఎఫెక్ట్స్ డిపార్టుమెంటులో కనీసం 10 సంవత్సరాల అనుభవం కావాలి అని రాజమౌళి తెలిపారు. ప్రస్తుతం రాజమౌళి అండ్ టీం బాహుబలి-2 ప్రాజెక్టులో బిజీగా ఉన్నారు. అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బాహుబలి: ది కన్‌క్లూజన్‌ షూటింగ్‌ గురువారం రామోజీ ఫిల్మ్‌సిటీలో ప్రారంభమైంది. ప్రభాస్, రమ్యకృష్ణ మీద వచ్చే సన్నివేశాలతో ఈ షూటింగ్ ప్రారంభమైంది. రెగ్యులర్ గా ఈ షూటింగ్ ఎటువంటి బ్రేక్ లేకుండా జరగనుంది.

    English summary
    “Mohan Lal is one of the finest actors in Indian cinema. I would love to work with him. But it is too early to think about the star cast for Garuda. I didn’t even have the script ready yet. I have plans to do Garuda but it will take some time before I start visualizing it. So it is too early to think about actors,” Rajamouli said.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X