»   » చిరు ‘సై..రా’ కు అదే బలం, ఇది నా అదృష్టం: రాజమౌళి

చిరు ‘సై..రా’ కు అదే బలం, ఇది నా అదృష్టం: రాజమౌళి

Posted By:
Subscribe to Filmibeat Telugu

మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమా ఫస్ట్‌లుక్‌ మోషన్ పోస్టర్ రిలీజ్ కార్యక్రమం అభిమానుల సమక్షంలో మంగళవారం గ్రాండ్‌గా జరిగింది. మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా జరిగిన
ఈ వేడుకకు బాహుబలి డైరెక్టర్ రాజమౌళి ముఖ్యఅతిథిగా హాజరై 'సైరా నరసింహారెడ్డి' మోష‌న్ పోస్ట‌ర్ పోస్టర్ రిలీజ్ చేశారు.

టైటిల్ లోగోను మెగా ప్రోడ్యూస‌ర్ అల్లు అర‌వింద్, న‌టీన‌టులు, సాంకేతిక నిపుణ‌ల‌కు సంబంధించిన పోస్ట‌ర్స్ ను వ‌రుణ్ తేజ్, సీనియ‌ర్ ర‌చ‌యిత‌లు ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ చేతుల మీదుగా ఆవిష్క‌రించారు.

అదిరిపోయింది: రాజమౌళి

అదిరిపోయింది: రాజమౌళి

మోష‌న్ పోస్ట‌ర్ రిలీజ్ అనంత‌రం రాజ‌మౌళి మాట్లాడుతూ, `మోష‌న్ పోస్ట‌ర్ ఫెంటాస్టిక్ గా ఉంది. బ్యాక్ గ్రౌండ్ లో వ‌స్తోన్న ఆ మ్యూజిక్, ఆ క‌ల‌ర్స్, మెగాస్టార్ ముఖం చూపించ‌కుండా వెనుక నుంచి డిజైన్ చేసిన ఆలుక్ అదిరిపోయింది.

Chiranjeevi's 151 movie "SAIRA" Motion Poster Released.
‘సై రా’ కు అదే బలం

‘సై రా’ కు అదే బలం

‘సై రా నరసింహారెడ్డి' సినిమాకు అమితాబ‌చ్చ‌న్, విజ‌య్ సేతుప‌తి, సుదీప్, జ‌గ‌ప‌తిబాబు వంటి స్టార్ క్యాస్టింగ్ సూప‌ర్బ్ గా ఉంది. `బాహుబ‌లి` స‌క్సెస్ అయిదంటే టెక్నీషియ‌న్లే కార‌ణం. ఈ సినిమాకు కూడా స్టార్ టెక్నిషీయ‌న్స్ ప‌ని చేస్తున్నారు. రెహ‌మాన్ మ్యూజిక్, ప‌రుచూరి క‌లం బ‌లం కు తిరుగులేదు. ఇక ద‌ర్శ‌కుడు సురేంద‌ర్ రెడ్డి 24 శాఖ‌ల‌పై మంచి ప‌ట్టున్న టెక్నీషియ‌న్. ఇవ‌న్నీ చూస్తుంటే చిరంజీవి గారి 151వ సినిమా లా కాకుండా ఆయ‌న మొద‌టి సినిమాలా ఉంది' అని రాజమౌళి వ్యాఖ్యానించారు.

ఇది నా అదృష్టం

ఇది నా అదృష్టం

ఈ సినిమా మోష‌న్ పోస్ట‌ర్ నా చేతుల మీదుగా లాంచ్ చేయ‌డం అదృష్టంగానూ, గౌర‌వంగాను భావిస్తున్నాను. కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ మ‌రో పెద్ద స‌క్సెస్ అందుకోవడం ఖాయం` అని రాజమౌళి వ్యాఖ్యానించారు.

ఉయ్యాలవాడ

ఉయ్యాలవాడ

స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రాన్నికొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ కంపెనీ పై మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ నిర్మిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

English summary
Rajamouli launches first look of "Sye Raa Narasimha Reddy". After the sensational success of Khaidi No 150, Megastar Chiranjeevi is arriving with a historical period drama, "SYE RAA NARASIMHA REDDY"along with ace director Surender Reddy. This prestigious project will be bankrolled by actor-producer Ram Charan under Konidela Production Company.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu