»   » బాహుబలి ఎఫెక్టే: రాజమౌళి తిప్పలు, స్టార్ల కోసం తప్పడం లేదు!

బాహుబలి ఎఫెక్టే: రాజమౌళి తిప్పలు, స్టార్ల కోసం తప్పడం లేదు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాహుబలి ప్రాజెక్టు తర్వాత రాజమౌళి స్థాయి మారిపోయింది. అంతకు ముందే ఆయన తెలుగులో స్టార్ డైరెక్టర్. బాహుబలి తర్వాత నేషనల్ లెవల్‌కి వెళ్లిపోయాడు. ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతా మంచే జరిగింది కదా... రాజమౌళికి వచ్చిన తిప్పలేంటి? అనుకుంటున్నారా?

బాహుబలి మూలంగా వచ్చిన స్టార్ ఇమేజ్ ఇపుడు రాజమౌళిని ఇబ్బందులు పెడుతోంది. తెలుగు ఇండస్ట్రీలో ఏ కొత్త సినిమా ప్రారంభమైనా ఆయనతో ప్రారంభోత్సవం జరించాలనో, ఆయనతో ఫస్ట్ లుక్ రిలీజ్ చేయించాలనో, లేక ఆడియో వేడుకకు రప్పిద్దామనే ప్రయత్నాలు చేస్తున్నారు చాలా మంది.

రోజూ ఎవరో ఒకరు

రోజూ ఎవరో ఒకరు

సినిమాలకు సంబంధించిన కార్యక్రమాలతో పాటు బయట జరిగే ఇతర వేడుకలకు కూడా రాజమౌళిని చీఫ్ గెస్టుగా ఆహ్వానించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా రోజూ ఎవరో ఒకరు తనకోసం వస్తుండటంతో రాజమౌళికి తిప్పలు తప్పడం లేదు.

SS Rajamouli opens up about his next film | Filmibeat Telugu
కాదనలేక, పొమ్మనలేక

కాదనలేక, పొమ్మనలేక

అయితే వచ్చే వారంతా తనకు పరిచయస్తులు, గతంలో తనతో కలిసి పని చేసిన వారు, సన్నిహితులు కావడంతో వారి మాట కాదనలేక, నా వల్ల కాదు పొమ్మనలేక రాజమౌళి ఇబ్బంది పడుతున్నాడట.

సాధ్యమైనంత వరకు దూరం

సాధ్యమైనంత వరకు దూరం

రాజమౌళి సాధ్యమైనంత వరకు ఎవరూ తనను నేరుగా కలిసే అవకాశం ఇవ్వడం లేదు. సినిమా ఇండస్ట్రీలో స్టార్లు, పెద్ద డైరెక్టర్లు, నిర్మాతలు వస్తే మినహా ఎవరినీ పెద్దగా కలవడం లేదు.

ఖాళీగా ఉంటే ఇబ్బంది లేదు కానీ..

ఖాళీగా ఉంటే ఇబ్బంది లేదు కానీ..

ఖాళీగా ఉంటే వెళ్లడానికి రాజమౌళికి ఇబ్బంది ఏమీ లేదు. ప్రస్తుతం ఆయన తన తర్వాతి సినిమా ప్రాజెక్టు మీద ఫోకస్ పెట్టారు. ప్రతి రోజూ ఏదో ఒక ఫంక్షన్ కు వెళితే ఆ ప్రాజెక్టు పనులు ముందుకు సాగడం లేదట.

స్టార్ల కోసం తప్పడం లేదు

స్టార్ల కోసం తప్పడం లేదు

అయితే పెద్ద పెద్ద స్టార్లు, డైరెక్టర్లు, నిర్మాలకు సంబంధించిన సినిమాలకు రాజమౌళి వెళ్లక తప్పడం లేదు. నిన్న మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ కార్యక్రమానికి రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరైన సంగతి తెలిసిందే.

నెక్ట్స్ ఎన్టీఆర్ సినిమా కోసం

నెక్ట్స్ ఎన్టీఆర్ సినిమా కోసం

బాబీ దర్శకత్వంలో ఎన్టీఆర్ కథానాయకుడిగా చేసిన 'జై లవ కుశ' విడుదలకి ముస్తాబవుతోంది. దసరా పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ సినిమాను సెప్టెంబర్ 21వ తేదీన విడుదల చేయనున్నట్టు చెప్పారు. 'వినాయక చవితి'కి 'లవ' టీజర్ ను రిలీజ్ చేయనున్నారు. ఇక సెప్టెంబర్ 3వ తేదీన ఆడియో వేడుకను నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ ఫంక్షన్ కి ముఖ్య అతిథిగా రాజమౌళి రానున్నారనీ .. ఆయన చేతుల మీదుగా ఆడియో రిలీజ్ జరగనుందని తెలుస్తోంది. ఎన్టీఆర్ తనకు అత్యంత సన్నిహితుడు కాబట్టి వెళ్లక తప్పని పరిస్థితి.

English summary
The audio launch event of upcoming movie ‘Jai Lava Kusha’ will take place on 3rd september. According to the latest update, Baahubali film maker SS Rajamouli will grace the audio launch event as Chief guest.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X