»   » రామ్ చరణ్ రీమేక్ పై రాజమౌళి కామెంట్

రామ్ చరణ్ రీమేక్ పై రాజమౌళి కామెంట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :ఇటీవలే తమిళంలో ఘనవిజయాన్ని సాధించిన చిత్రం ‘తని ఒరువన్'. ఈ చిత్రం రామ్ చరణ్ కు బాగా నచ్చి రీమేక్ చేస్తున్నారు. జయం రవి, నయనతార జంటగా నటించిన ఈ సినిమాలో నాటి అందాల నటుడు అరవింద్‌స్వామి విలన్‌గా నటించాడు. మోహన్‌రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ధ్రిల్లర్ డ్రామాగా నడుస్తుంది.

సురేంద్ర రెడ్డి దర్సకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. త్వరలోనే దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం వుంది. ఈ నేపధ్యంలో రాజమౌళి ఈ చిత్రాన్ని చూసి ట్వీట్ చేసారు. ఆయనేం అన్నారో క్రింద ట్వీట్ ద్వారా చూడండి.

నిర్మాత దానయ్య ఈ హిట్ సినిమా రీమేక్ రైట్స్ ను రామ్ చరణ్ కోసమే భారీ మొత్తం పెట్టి కొనుగోలు చేశాడని...ఈ ఏడాదిలోనే ఈ రీమేక్ మూవీ సెట్స్ మీదకు వెళ్లొచ్చని వినిపిస్తోంది. ఈ సినిమాకు మెగా ఫోన్ పట్టుకునేది సురేంద్రరెడ్డి అనే క్లారిటీ రావటంతో... హీరోయిన్ గా సమంత పేరు దాదాపుగా ఖరారైందని ప్రచారం మొదలైంది దీంతో ఈ ఇద్దరి కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమా హిట్టే అని మెగా ఫ్యాన్స్ అంటున్నారు.

Rajamouli Comment On Thani oruvan

కథేంటి... మిత్రన్ ('జయం' రవి), అతని స్నేహితులు ట్రైనీ ఐపీఎస్ ఆఫీసర్స్. డ్యూటీలో చేరక ముందే తమ కళ్ల ముందు జరుగుతున్న అన్యాయాలను ఎదిరిస్తూంటారు. మిత్రన్ ప్రేయసి మహిమ (నయనతార) కూడా వాళ్లతో చేతులు కలుపుతుంది. ఈ క్రమంలోనే ఓ సామాజిక కార్యకర్త వీళ్ల కళ్లముందే హత్యకు గురవుతాడు. ఇలాగే వరుస హత్యలు చోటుచేసుకుంటాయి. ఇవన్నీ రాజకీయ ప్రేరేపిత హత్యలుగా వాళ్లు గుర్తిస్తారు.

ఫైనల్‌గా ఇదంతా ఫేమస్ సైంటిస్ట్ సిద్ధార్థ్(అరవింద స్వామి) చేస్తున్నాడని తెలుసుకుంటారు. చివరకు సిద్ధార్థ్ధ్‌ను వాళ్లు ఎలా ఎదిరించారన్నది మిగిలిన కథాంశం. తమిళంలో చివరి 'నెగటివ్' సినిమా! ఈ సినిమా ఇప్పటికే వసూళ్లు కొల్లగొడుతూంటే, మరో రూపంలో ఇది చరిత్రలో నిలిచిపోనుంది. తమిళంలో 'నెగటివ్' వాడిన చివరి సినిమా ఇదే.

రామ్ చరణ్ మాట్లాడుతూ...ఇదివరకు రీమేక్‌ సినిమాలు చేయకూడదు అనుకొనేవాణ్ని. కానీ అలాంటి నిబంధనలేవీ పెట్టుకోకూడదనే ఓ నిర్ణయానికొచ్చా. 'తని ఒరువన్‌' నాకు బాగా ఇష్టం. అందులో హీరో పాత్ర కంటే విలన్ పాత్ర చాలా ముఖ్యం. ఆ పాత్రకి తగ్గ నటుడు దొరికితే వెంటనే సినిమాని మొదలుపెడతాం. ఆ తర్వాత గౌతమ్‌ మేనన్‌ దర్శకత్వంలోనూ ఓ సినిమాని చేయబోతున్నా. అదొక ప్రేమకథతో తెరకెక్కబోతోంది.

English summary
“Very late but saw Thani Oruvan… Aravind Swami was so good. He nailed it. Heard Hiphop Tamizha are two youngsters. Great background score. Could see that a lot of smart work went into the making of the film. Keep it up Raja. It is against the formula so success must have been even sweeter.” posted Rajamouli via his face book
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu