twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    100 కోట్ల ఆఫర్ నిజమే.. నా 'శక్తి' చిత్రాన్ని ఎలా మరచిపోయారు.. రాజమౌళి చివరి చిత్రం అదేనట!

    |

    జక్కన్న రాజమౌళి తాజాగా మీడియా సమావేశం నిర్వహించి ఆర్ఆర్ఆర్ చిత్ర విశేషాల్ని వెల్లడించారు. భారతదేశానికి స్వాతంత్రం రాకముందు 1920 కాలం నాటి నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతుందని తెలిపారు. స్వాతంత్ర ఉద్యమ వీరులు కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు యుక్త వయసులో ఉన్న సమయంలో కొన్నేళ్లు అదృశ్యమై తిరిగి వచ్చి స్వాతంత్ర పోరాటం చేశారు. అదృశ్యమైన పీరియడ్ ని తీసుకుని ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు రాజమౌళి తెలిపారు. ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా, రాంచరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు.

    <strong>వాళ్లిద్దరూ బ్రహ్మచారులు కదా, ఇద్దరు హీరోయిన్లు ఏంటి.. రాజమౌళి సమాధానం ఇదే!</strong>వాళ్లిద్దరూ బ్రహ్మచారులు కదా, ఇద్దరు హీరోయిన్లు ఏంటి.. రాజమౌళి సమాధానం ఇదే!

     100 కోట్ల ఆఫర్ నిజమే

    100 కోట్ల ఆఫర్ నిజమే

    ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని వదులుకుంటే 100 కోట్లు ఇస్తామని మీకు ఆఫర్ వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి అని దానయ్యని ప్రశ్నించగా.. అది నిజమే అని క్లారిటీ ఇచ్చారు. కానీ నేను ఇన్ని రోజులుగా రాజమౌళి గారితో ట్రావెల్ అవుతున్నది అందుకు కాదు. ఆయనతో సినిమా చేయాలనేది నా కల అని దానయ్య తెలిపారు.

     హాలీవుడ్‌లో కూడా ఆ సమస్య

    హాలీవుడ్‌లో కూడా ఆ సమస్య

    పాత్రికేయలు అడిగిన ఓ సరదా ప్రశ్నకు రాజమౌళి అంతే సరదాగా సమాధానం ఇచ్చారు. సినిమాలో ఎన్టీఆర్, చరణ్ లలో ఎవరి పేరు ముందుగా వస్తుంది అని ప్రశ్నించగా.. ఎవరి పాత్ర ముందు కనిపిస్తే వారి పేరు వస్తుందని రాజమౌళి తెలిపారు. ఈ సమస్య హాలీవుడ్ వాళ్లకు కూడా వచ్చింది. వాళ్ళు ఓ పరిష్కారం కనిపెట్టారు. సినిమాలో ముందుగా ఎవరి పాత్ర వస్తే వారి టైటిల్ వేస్తారు. నేను కూడా అదే ఫాలో అవుతా అని రాజమౌళి తెలిపారు.

     వీళ్ళే ఎందుకు

    వీళ్ళే ఎందుకు

    ఈ చిత్రానికి ఎన్టీఆర్, చరణ్ నే హీరోలుగా ఎందుకు ఎంచుకున్నారు అనే ప్రశ్నకు రాజమౌళి బదులిచ్చారు. నేను రాసుకున్న కథ ప్రకారం వీరిద్దరి బాడీ లాంగ్వేజ్ సరిపోతుందని అనిపించినట్లు రాజమౌళి తెలిపారు. దాదాపు ఏడాది సమయం హీరోలని బ్లాక్ చేయడం సరైనదేనా. ఈ హీరోలు ఇద్దరూ 100 కోట్ల బిజినెస్ కలిగినవాళ్లు. మీ సినిమా వలన చాలా బిజినెస్ ఆగిపోతుంది కదా అని ప్రశ్నించారు. అందుకు తగ్గట్లుగా నా చిత్రాల్లో పని లభిస్తుందని రాజమౌళి సమాధానం ఇచ్చారు. ఇప్పుడు దాపుగా అన్ని చిత్రాలకు ఏడాది సమయం పడుతోందని, రాజమౌళి చిత్రాలు హీరోలకు 10 ఏళ్ల భరోసా ఇస్తాయని రాంచరణ్ అన్నారు.

     శక్తిని ఎలా మరచిపోయారు

    శక్తిని ఎలా మరచిపోయారు

    రాంచరణ్ మగధీర తర్వాత, ఎన్టీఆర్ యమదొంగ తర్వాత ఫాంటసీ చిత్రాలు చేయలేదు. ఆ రెండూ రాజమౌళి చిత్రాలే. ఇప్పుడు మళ్ళి రాజమౌళి దర్శత్వంలో నటిస్తున్నారు కదా అనే ప్రశ్నకు ఎన్టీఆర్ వెంటనే స్పందించారు. నా శక్తి చిత్రాన్ని ఎలా మరచిపోయారు.. అది కూడా ఫాంటసీ చిత్రమే కదా అని ఎన్టీఆర్ అనడంతో అందరిలో నవ్వులు విరిశాయి. ఆర్ఆర్ఆర్ చిత్రం ద్వారా మన తెలుగు హీరోల గురించి దేశం తీసుకుంటుందని ఎన్టీఆర్ తెలిపారు. తెలుగు హీరోలంటే మేమిద్దరం కాదు రియల్ హీరోలు కొమరం భీం, అల్లూరి సీతారామరాజు అని తెలిపాడు.

    రాజమౌళి చివరి చిత్రం అదేనట

    రాజమౌళి చివరి చిత్రం అదేనట

    మరో పాత్రికేయుడు మహాభారతం ప్రాజెక్ట్ గురించి ప్రశ్నించారు. ఆర్ఆర్ఆర్ తర్వాతే మహాభారతం మొదలవుతుందా, ఆ చిత్రానికి సంబంధించిన ఆలోచన ఎంతవరకు వచ్చింది అని ప్రశ్నించగా.. మహాభారతం తీయడం నా కల అని చెప్పాను. అప్పటి నుంచి నా తదుపరి చిత్రం అదే అని అంతా అనుకుంటున్నారు. బహుశా నేను తెరకెక్కించే చివరి చిత్రం మహాభారతం సిరీస్ కావచ్చు అని రాజమౌళి క్లారిటీ ఇచ్చారు.

    English summary
    Rajamouli gives clarity on his dream Project Mahabharatam
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X