twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దర్శకుడు రాజమౌళి అవయవ దానం!

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: దర్శకుడు రాజమౌళి అవయవ దానం చేయాలని నిర్ణయించుకున్నారు. గాంధీ మెడికల్ కాలేజీలో నిన్న నిర్వహించిన 'అవయవ దానంపై అవగాహ' కార్యక్రమానికి హాజరైన రాజమౌళి అక్కడ విద్యార్థులు, డాక్టర్లతో మాట్లాడిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు.

    ఈ విషయమై ఆయన తన ట్విట్టర్లో స్పందిస్తూ... 'నేను గాంధీ మెడికల్ కాలేజీ వెళ్లా...నా అవయవాలు దానం చేస్తానని వాగ్దానం చేసాను. మన మరణం తర్వాత మన అవయవాలు 8 మందికి జీవితాన్ని ఇస్తాయి, ప్రతి ఒక్కరూ అవయవ దానానికి ముందుకు రావాలని నేను కోరుకుంటున్నాను' అని ట్వీట్ చేసారు. గతంలో నాగార్జున, అమల, మంచు లక్ష్మి, నవదీప్, అరవింద్ కృష్ణ, హర్షవర్ధన్ రాణే తదితర సినీ తారలు అవయవ దానం నిర్ణయం తీసున్న విషయం తెలిసిందే.

    ఇక రాజమౌళి సినిమాల విషయానికొస్తే...ఇటీవల 'ఈగ' చిత్రంతో తన కెరీర్లో మరో బ్లాక్ బస్టర్ జమ చేసుకున్న రాజమౌళి నెక్ట్స్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌తో సినిమాకు సిద్ధం అవుతున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆర్కా మీడియా బేనర్‌పై నిర్మాత దేవినేని ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు సినిమా చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు.

    గతంలో ఛత్రపతి చిత్రంతో ప్రభాస్‌కు భారీ విజయాన్ని అందించిన రాజమౌళి ఈ సారి సరికొత్త కోణంలో యంగ్ రెబల్ స్టార్‌ను చూపెట్టబోతున్నారు. 'అందాల రాక్షసి' చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ లావణ్య త్రిపాటి ఈ చిత్రంలో చాన్స్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అందాల రాక్షసి చిత్రంలో ఆమె పెర్ఫార్మెన్స్ నచ్చి రాజమౌళి ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. గబ్బర్ సింగ్ హీరోయిన్ శృతి హాసన్ ఈచిత్రంలో మెయిన్ హీరోయిన్ గా చేయనుందని సమాచారం. సోసియో ఫాంటసీ నేపథ్యంలో ఈ చిత్రంలో ప్రభాస్ సరికొత్త గెటప్ తో కనిపించనున్నాడు.

    English summary
    Rajamouli has pledged to donate his organs. “Thanks to all medicos and professors. Had a gr8 time at Gandhi medical college. I pledged to donate my organs and anyone who wish to donate their organs or be a volunteer,visit http://www.mohanfoundation.org i learnt organs from one body can give life to 8 people,” he tweeted.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X