Just In
Don't Miss!
- Sports
ఫాస్టెస్ట్ సెంచరీ కొట్టిన అజహరుద్దీన్ కలల లిస్టు ఇదే.. ఐపీఎల్, 4 సెంచరీలు సహా!!
- News
చర్చలు 120 శాతం ఫెయిల్.. 'ఉపా' చట్టాన్ని ప్రయోగిస్తారా? బ్రోకర్లతో చర్చలకు వెళ్లం.. రైతుల సంఘాల ఫైర్...
- Finance
ఈ ఒక్కరోజులో రూ.2.23 లక్షల కోట్ల సంపద హుష్కాకి
- Lifestyle
సినిమా థియేటర్ కు వెళ్దామనుకుంటున్నారా? అయితే ఈ విషయాలు మీకోసమే...
- Automobiles
రైలులో హ్యుందాయ్ రయ్.. రయ్.. ఇదే తొలిసారి
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
నాకు ఎలాంటి అభ్యంతరం లేదు-వాళ్లందరికి కుల గజ్జి వుంది: రాజమౌళి
యస్ యస్ రాజమౌళి తన 9 ఏళ్ళ సినిమా కెరీలో నాన్ స్టాప్ హిట్స్ అందించి తనకంటూ ఒక క్రేజ్ ను ఏర్పరుచుకొన్నారు. స్టార్ హీరోలైనటువంటి జూ ఎన్టీఆర్ రామ్ చరణ్ లతో చాలసన్నిహితంగా ఉంటారు. అంతే కాకుండా వారిద్దరూ రాజమౌళికి మంచి స్నేహితులైపోయారు. అయితే వారిద్దరిని ఒకే డైరెక్షన్ లో మల్టీస్టారర్ చిత్రం తీయగలరా అంటే....?
ఈ మధ్య రాజమౌళి 'మర్యాద రామన్న" ప్రమోషన్ లో భాగంగా ఓ టీవీ చానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూ లో భాగంగా మాట్లాడుతూ 'నాకు మల్టీస్టారర్ సినిమాలు చేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదు. ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి యంగ్ హీరోలతో నిక్షేపంగా మల్టీస్టారర్ చేస్తాను. ఆయా స్టార్స్ ఓన్ ఫాన్స్ ఉంటారు. అయితే వారు అయా హీరోస్ పరంగానే కాదు, కాస్ట్ పరంగాను హీరోలను సెలక్ట్ చేసుకొంటారు. అందికే అభిమానులకు కులగజ్జి ఉంది. ఇది చాలా కాలం నుండి కంటిన్య్వూ అవుతూనే వుంది. వాళ్లు ఈ కాంబినేషన్ ని వ్యతిరేకిస్తారు. ఒక వేళ వాళ్లు ఆదరిస్తే తప్పకుండా క్రేజి కాంబినేషన్ లో సినిమా చేస్తా" అన్నాడు. ఇప్పటి జనరేషన్ లో హై ఎడ్యూకేట్స్, మెట్రో లైఫ్ లీడింగ్, మరియు ఇంటర్నెట్ యూసింగ్ డేస్, వున్నటువంటి ప్రస్తుత జనరేషన్ లో కూడా కలమతాలంటూ బేషజాలు చూపుతున్నారు. మనుషులం అనేదే ఒక జాతి, అందరిలోనూ ప్రవహించేది ఒకే కలర్ ఉన్న రక్తం, ఈ జనరేషన్ లో అభిమానులు అది తెలుసుకొంటే తప్పకుండా మల్టీస్టారర్ ఏంటీ ఏన్నో అధ్భుతాలు సృష్టించవచ్చు అని పేర్కొన్నాడు రాజమౌళి.