»   » జింతాతా..జితా..జితా...బానే ఉంది గానీ రవితేజా కన్ఫర్మ్ అయినట్టేనా..??

జింతాతా..జితా..జితా...బానే ఉంది గానీ రవితేజా కన్ఫర్మ్ అయినట్టేనా..??

Posted By:
Subscribe to Filmibeat Telugu

దాదాపు ఆరేళ్ల కిందట వచ్చిన విక్రమార్కుడికి ఇప్పటికీ క్రేజ్ తగ్గలేదు. అప్పట్లో పర్వాలేదని పించుకునే హిట్ అయిన ఈ సినిమా ఇప్పటికే ఏదో ఒక భాషలో రీమేక్ అవుతూ వార్తల్లో నిలుస్తోంది. ఇప్పటికే తమిళ, కన్నడ, హిందీ, బెంగాళీ భాషల్లోరీమేక్ అయిన ఈ రాజమౌళి సినిమాకు ఇప్పుడు సీక్వెల్ ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. దీనిపై విక్రమార్కుడు ఒరిజినల్ నిర్మాతతో సహా అనేక మంది ఆసక్తితో ఉన్నట్టు సమాచారం.

రీమేక్ అయిన ప్రతి భాషలోనూ హిట్టవ్వడం, ఇప్పటికీ టీవీల్లోఈ సినిమాకు మంచి టీఆర్ పీ ఉండటం దీనికి సీక్వెల్ చేయడం సేఫ్ అని నిర్మాతలు భావిస్తున్నారు. అలాగే సీక్వెల్ కూడా రాజమౌళి దర్శకత్వం వహిస్తే...దీనికి తిరుగుండదు అని అంటున్నారు. రాజమౌళి తో 'ఈగ' సినిమాను నిర్మించిన సాయి కొర్రపాటి కూడా విక్రమార్కుడు రీమేక్ పై ఇంట్రస్ట్ తో ఉన్నాడు. రాజమౌళికి సన్నిహితుడు అయిన ఇతడి నిర్మాణంలో విక్రమార్కుడు రెండో భాగం రావచ్చని మరి కొందరంటున్నారు.

Rajamouli readies Vikramarkudu sequel ??

మాస్‌ మహారాజ్‌ రవితేజ చాలా రోజులుగా ముఖానికి రంగేసుకోలేదు. ప్రస్తుతానికి మనోడి చేతిలో సినిమాలేవీ లేవు. బెంగాల్ టైగర్ దగ్గరి నుంచీ సినిమాలు మొదలవుతున్నాయి. వెంటనే ఆగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో కాస్త విశ్రాంతి కోసమంటూ ప్రపంచ టూర్‌కి వెళ్లిపోయాడు రవితేజ. అసలు అర్థాంతతరంగా ఆగిపోతున్న సినిమాల విషయం లో ఏమాత్రం ఆందోళన లేకుండా ఇంతకూల్ గా ఎలా ఉన్నాడు అన్న అనుమానం కూడా చాలామందికే వచ్చిఒంది. ఇంత కాలం ఖాళీగ ఉన్నందుకు మన మాస్ హీరోకి మంచి అవకాశమే అందింది..

కెరీర్‌లో బిగ్గెస్ట్‌ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది రాజమౌళి దర్శకత్వం వహించిన 'విక్రమార్కుడు'. ఈ సినిమా వచ్చి దాదాపు పదేళ్లవుతోంది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌ కథను తయారు చేస్తున్నాడట రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్‌. ఇందులో నటించేది రవితేజ అనే విషయం చెప్పనక్కర్లేదు. కానీ, దర్శకుడి విషయంలో మాత్రం క్లారిటీ లేదు. ఈ సినిమాకు రాజమౌళి దర్శకత్వం వహించే అవకాశాలు లేకపోయినా, ఆయన టీమ్‌లోని ఓ ప్రతిభావంతుడికి ఈ ఛాన్స్‌ ఇస్తాడని చెప్పుకుంటున్నారు తెలుగు సినీ జనాలు.అయితే ఈ సినిమాకు సీక్వెల్ రానుందన్న సమాచారాన్ని గతంలో రాజమౌళినే చెప్పినప్పటికీ, అది ఇప్పటివరకు కార్యరూపం దాల్చుకోలేదు. రవితేజ కెరీర్ కు టర్నింగ్ పాయింట్ గా నిలిచిన ఈ సినిమా సీక్వెల్ పై మాస్ మాహారాజా అభిమానులు భారీ అంచనాలనే పెట్టుకున్నారు.

అయితే ఈ అంచనాలు నిజమయ్యే కార్యక్రమం త్వరలోనే జరగనుంది. రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ "విక్రమార్కుడు" సినిమాకు సీక్వెల్ కధను అందించే పనిలో నిమగ్నమయ్యారు. అన్నీ కుదిరితే ఈ సినిమాలో హీరో కూడా రవితేజనే. ఈ విషయాన్ని గతంలోనే రాజమౌళి స్పష్టం చేసినప్పటికీ, ప్రస్తుతం రవితేజ సినిమాలు చేయకుండా ప్రపంచాన్ని చూస్తూ ఆనందిస్తున్న నేపధ్యంలో... మళ్ళీ సినిమాలు చేస్తాడా లేదా అన్నది ట్రేడ్ వర్గాలకే అంతు పట్టడం లేదు. అయితే రాజమౌళి సినిమాను కాదనే సాహాసం గానీ, అవివేకమైన నిర్ణయం గానీ రవితేజ చేయకపోవచ్చు గనుక... "అత్తిలి సత్తిబాబు" ఈజ్ బ్యాక్... అంటున్నారు సినీ జనాలు.

'విక్రమార్కుడు' చిత్రం ఎంత పెద్ద హిట్టయిందో కొత్తగా చెప్పక్కర్లేదు. రవితేజకు మాస్ హీరోగా పేరు తెచ్చిన సినిమా అది. ఈ చిత్రంలో అనుష్క అందాల ఆరబోత గురించి ఎంత చెప్పినా తక్కువే. అన్ని కమర్షియల్ అంశాలతో ప్రేక్షక రంజకంగా రూపొందిన ఈ చిత్రం...తమిళం, కన్నడ, హిందీలో కూడా రీమేక్ అయి సంచలన విజయం సాధించింది. ఇటీవల అక్షయ్ కుమార్, సోనాక్షి సిన్హా జంటగా హీందీలో 'రౌడీ రాథోడ్'గా రీమేక్ అయిన ఈచిత్రం భారీ కలెక్షన్లు కురిపించింది..

English summary
Now, it is heard that plans have begun to make a sequel to the film and this has been titled as 'Jinthatha..'. Sources say this would be produced by Sai Korrapati of 'Eega' fame. It is heard that Sai is close friends with the tough taskmaster S S Rajamouli who directed 'Vikramarkudu'.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu