»   » రామానాయుడు కి రాజమౌళి పేరు చెప్పి జూ ఎన్టీఆర్ ట్విస్ట్

రామానాయుడు కి రాజమౌళి పేరు చెప్పి జూ ఎన్టీఆర్ ట్విస్ట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రముఖ నిర్మాత డాక్టర్‌ డి.రామానాయుడు పిలిచి దర్శకుడు రాజమౌళికి ఆఫర్ ఇస్తానంటే ఆయన వెంటనే కాస్త కూడా ఆలోచించకుండా నో చెప్పేయటం పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది. అదెలా జరిగిందంటే జూనియర్‌ ఎన్టీఆర్‌తో తన పాత చిత్రం 'రాముడు-భీముడు' తీయాలని రామానాయుడుకి ఎప్పుడు నుంచో ఆలోచన ఉంది. ఇదే విషయం గురించి ఎన్టీఆర్ వద్ద గతంలో ఆయన ప్రస్తావించారు. తన తాత నటించిన 'రాముడు-భీముడు' అయితే తనకి ఇష్టమేనని ఆయన ఓకే అన్నారు. అయితే ఈ చిత్రానికి రాజమౌళి దర్శకుడు అయితేనే ఓకే అంటానన్నాడు.

దాంతో నాయుడు గారు వెంటనే రాజమౌళికి కబురు పెట్టారు. ఈగ షూటింగ్ నిమిత్తం సురేష్ ప్రొడక్షన్స్ లోనే ఉన్న రాజమౌళి వెంటనే వచ్చి ఆ ప్రపోజల్ విన్నారు. అయితే డైరక్ట్ గా కాదనకుండా తనకు చాలా కమిట్ మెంట్స్ ఉన్నాయని తప్పించుకున్నాడు. అయితే ఎన్టీఆర్ అంతకు ముందే రాజమౌళితో ఈ విషయం మాట్లాడాడని,తాను డైరక్ట్ గా కాదనకుండా రాజమౌళిని అడ్డం పెట్టుకుని ఎన్టీఆర్ తప్పించుకున్నాడని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu