For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  పోలీసులపై అలాంటి అపోహ ఉండేది.. అదే మన బ్రహ్మాస్త్రం.. రాజమౌళి కామెంట్స్

  |

  ప్రస్తుతం కరోనా వైరస్ ఎంత తీవ్రతరంగా మారిందో అందరికీ తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా అదుపుతప్పింది. అయితే రికవరీ అవుతున్న కేసులు కూడా పెరుగుతుండటం శుభ సూచికమే. కరోనా నుంచి కోలుకున్న వారు ప్లాస్మా దానం చేస్తే ఇంకొంత మందిని రక్షించగలిగే అవకాశం ఉంది. ఇందుకోసం ప్లాస్మా దానంపై అవగాహనం కలిగించేందుకు పోలీస్ కమిషనర్ సజ్జనార్ అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే.

  కరోనా నుంచి కోలుకున్న రాజమౌళి..

  కరోనా నుంచి కోలుకున్న రాజమౌళి..

  కరోనా వైరస్ బారిన పడ్డ రాజమౌళి, అతని కుటుంబం కరోనా వైరస్ బారిన పడిన సంగతి తెలిసిందే. ఇక ఈ మధ్యే కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నామని, త్వరలోనే ప్లాస్మాను కూడా దానం చేస్తామని ప్రకటించారు కూడా. ఈ మేరకు సజ్జనార్ ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో రాజమౌళి ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు.

   అలాంటి అపోహ..

  అలాంటి అపోహ..

  ఒక ప్రాణాన్ని కాపాడేందుకు ఇంత మంది ఒక వేదికపైకి వచ్చి ఎంతో కష్టపడుతున్నారు. ఇంత వరకు మనకు తెలీదు. పోలీసులంటే నాకొక అపోహ ఉండేది. ఏదైనా క్రైమ్ జరిగితే వస్తారు.. సాల్వ్ చేస్తారు. వెళ్తారని అనుకున్నాను. కానీ వీరు నిజంగా రక్షకభటులు. మన కోసం ఇంత చేస్తున్న వీరిని చూసి చాలా ఆశ్చర్యంగా ఆనందంగా ఉందని రాజమౌళి అన్నారు.

   డ్యూటీలో పార్ట్ కాకపోయినా..

  డ్యూటీలో పార్ట్ కాకపోయినా..

  మామూలుగా అయితే ఇలాంటివి వారి డ్యూటీలో భాగస్వామ్యం కాదు. కానీ సజ్జనార్ గారు ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎప్పుడూ చేస్తుంటారు. వారు నిజంగా ఒక రక్షక భటుల్లా ఫీలై ఇదంతా చేస్తున్నారు.ఇదేమీ చిన్న విషయం కాదు. ఇలా ఓ వేదికను ఏర్పాటు చేయడం, వాలంటీర్స్‌తో పని చేయించడం.. కోవిడ్ తగ్గిన పేషెంట్స్ నుంచి ప్లాస్మా సేకరించడం, హాస్పిట్సల్‌కు అనుసంధానం చేయడం. ఇది ఒక పెద్ద కార్యక్రమమని రాజమౌళి కొనియాడారు.

   మీరే నిజమైన హీరోలు..

  మీరే నిజమైన హీరోలు..

  ఈ కార్యక్రమం ఒకరిద్దరితో ప్రారంభంమై నేడు రోజుకు 70 నుంచి 80 మంది ప్లాస్మాను డొనేట్ చేసేలా చేయగలిగారు. ప్లాస్మా దానం చేసిన వారే నిజమైన హీరోలు.. మీరే యోధులు.. మేము రోజూ ఎంతో మంది తెరపై హీరోలను చూస్తుంటాం కానీ ప్రజల్లోంచి వచ్చిన హీరోలను చూస్తుంటే సంతోషంగా ఉంది. నేను ఓ యోధుడిలా మారుతాను.. త్వరలోనే ప్లాస్మాను దానం చేస్తాను అని రాజమౌళి పేర్కొన్నారు.

   అది బ్రహ్మాస్తం..

  అది బ్రహ్మాస్తం..

  ప్లాస్మా ఇస్తే ఏమవుతుంది? అక్కడికి వెళ్తే మళ్లీ అంటుకుంటుందేమోనని భయపడకండి.. అంతా పకడ్భంధీగానే చేస్తారు. ఒకవేళ ప్లాస్మా ఇస్తే మీ శక్తి తగ్గదు. ఇచ్చే కొద్దీ పెరుగుతుంది.. దయచేసి తల్లిదండ్రులు అలాంటి వారిని అడ్డుకోవద్దు. వారిని హీరోలు కానివ్వండి. ఆపకండి. కరోనా వైరస్‌పై మొదట్లో చాలా అపోహలు ఉండేవి కానీ.. అలాంటిదేమీ కాదు.. ప్లాస్మా అనేది బ్రహాస్త్రం చివరి ప్రయత్నం అని రాజమౌళి చెప్పుకొచ్చారు.

  Bollywood Nepotism : RRR లో ఆలియా భట్ వద్దు అంటున్న Sushant Singh Rajput ఫ్యాన్స్
  వెంటనే తెలియజేయండి..

  వెంటనే తెలియజేయండి..

  కరోనా వస్తే వెంటనే తెలియజేయండి. ఎవరైనా ఏమైనా అనుకుంటారా కరోనా గురించి చెప్పుకుండా లేటుగా జాయిన్ అయితే డాక్టర్స్ ఇబ్బంది పడుతున్నారు. కరోనా మొదటి స్టేజ్‌లోనే ఉండగా జాయినే అయ్యే వారందరినీ కాపాడుతున్నారు. ఇదేమీ అంత భయంకరమైన వైరస్ కాదు.. చాలా వీక్ వైరస్.. కాకపోతే ఎక్కువ మందికి త్వరగా అంటుకుంటోంది.. ఇది చాలా చిన్న ఫ్లూలాంటిది.. భయాలు, అపోహలు పెట్టుకోవద్దు.. ఇంత సేవ చేస్తోన్న పోలీసులు, వైద్యులు, వాలంటరీస్‌కు సాయం చేద్దాం.. అందరికీ దీని గురించి చెబుదాం.. అవగాహన కలిగిద్దాం.. ప్లాస్మాను దానం చేద్దాం మని రాజమౌళి అందరికీ అవగాహన కలిగించారు.

  English summary
  Rajamouli Request To Donate Plasma In Sajjanar Awareness Programme. Cp Sajjanar Conducted Awareness Programme On Plasma Donation.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X