twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    RRRకి ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. అసలు విషయం చెప్పిన జక్కన్న.. అదే నిజమైతే బాక్సాఫీస్ బద్దలే!

    |

    ఎన్టీఆర్, రామ్ చరణ్ రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కిన భారీ పాన్ ఇండియా సినిమా RRR ప్రపంచం వ్యాప్తంగా విడుదలకు సిద్దమవుతుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ మళ్ళీ మొదలు పెట్టారు. 14వ తేదీన ఒక పాట విడుదల చేసిన సినిమా యూనిట్ లో తాజాగా తెలుగు మీడియాతో ముచ్చటించింది. అయితే ఈ సందర్భంగా పలు అంశాలు వెల్లడించారు రాజమౌళి. ఆ వివరాల్లోకి వెళితే

    బాధాకరమని

    బాధాకరమని

    మీడియా సమావేశంలో రాజమౌళి, ఎన్టీఆర్, చరణ్ సినిమాకు సంబంధించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ముందుగా ఉక్రెయిన్ పరిస్థితి మీద దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఉక్రెయిన్ దేశంలో ఆర్ఆర్ఆర్ టీం నాటు నాటు సాంగ్ తో పాటు కొన్ని సన్నివేశాలు చిత్రీకరించింది. ఈ సందర్భంగా ఉక్రెయిన్ వాసుల సప్పోర్ట్, ఆదరించిన తీరు గురించి ప్రత్యేకంగా గుర్తు చేసుకున్నారు. అక్కడ డాన్సర్స్, టెక్నికల్ టీమ్ సహకారం అద్భుతం అని, ఇతర దేశాల వారిని ప్రేమించి, ఆదరించే ప్రజలున్న ఉక్రెయిన్ దేశం యుద్ధ సంక్షోభంలో చిక్కుకోవడం బాధాకరమని అన్నారు.

    మార్కెట్ ఆధారంగా

    మార్కెట్ ఆధారంగా

    RRR మూవీ అన్ని విధాలుగా బాహుబలికి మించి చిత్రం అవుతుందని రాజమౌళి తెలిపారు. RRR ఇంటర్వెల్ ఎపిసోడ్ అద్భుతంగా ఉంటుందని, దాన్ని ఏకంగా 60 రాత్రుల పాటు చిత్రీకరణ జరిపినట్లు తెలిపారు. ఇక ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇమేజ్, స్టార్డం, వాళ్ళ మార్కెట్ ఆధారంగా ఈ సినిమా హీరోలుగా ఎంచుకున్నామని, వాళ్ళ మధ్య ఉన్న స్నేహం కూడా ఒక కారణం అని చెప్పుకొచ్చారు .

    మార్కెట్ ఆధారంగా

    మార్కెట్ ఆధారంగా

    RRR షూటింగ్ సమయంలో తమ స్నేహం మరింత బలపడిందన్న హీరోలు వెల్లడించారు. అలాగే నటన, డాన్స్ పరంగా ఎన్టీఆర్ ని చూసి కొత్త విషయాలు నేర్చుకున్నానని రామ్ చరణ్ తెలిపారు. ఇక చరణ్ నాకు దొరికిన గొప్ప మిత్రుడని ఎన్టీఆర్ కొనియాడారు. RRR మూవీలో ఎవరి పాత్రకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది అనే చర్చ సోషల్ మీడియాలో నడుస్తుండగా రాజమౌళి స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు. RRR మూవీలో సీన్స్, డైలాగ్స్ ఎవరికి ఎంత ఉండాలి అనే కొలతలు ఫాలో కాలేదు అన్నారు. కథలో పాత్రకు అనుగుణంగా ఎన్టీఆర్, చరణ్ పాత్రలు తీర్చిదిద్దారని, కథలో ఎమోషన్స్ సినిమా మొత్తం క్యారీ అయ్యేలా తెరకెక్కించామని వెల్లడించారు.

    100 పెంచుకునేందుకు

    100 పెంచుకునేందుకు

    అలాగే RRRకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పిందని రాజమౌళి వెల్లడించారు. ఏపీలో ప్రీమియర్ షోకు అనుమతి ఇచ్చారని రాజమౌళి మీడియా సమావేశంలో క్లారిటీ ఇచ్చారు. తెలంగాణలో దానికి ఇప్పటికే పర్మిషన్ ఇచ్చారన్నారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు 5 షోలు రన్ కానున్నాయి. ఈ క్రమంలో కలెక్షన్లు భారీగా వచ్చే ఛాన్స్ ఉంది. ఇక ఏపీలో టికెట్ రేట్లను అదనంగా రూ.100 పెంచుకునేందుకు సర్కారు అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది కానీ దాని మీద క్లారిటీ ఇవ్వలేదు.

    Recommended Video

    RRR: Salman Khan Nacho Nacho Steps With NTR, Ram Charan| Bigg Boss 15 | Filmibeat Telugu
    భారీ అంచనాలు

    భారీ అంచనాలు

    RRR విషయంలో స్వయంగా రంగంలోకి దిగిన దర్శకుడు రాజమౌళి.. సోమవారం సీఎం జగన్​తో భేటీ అయ్యారు. సినిమా టికెట్​ రేట్లు పెంపుదల, అదనపు షోలు విషయమై జక్కన్న​.. సీఎంతో మాట్లాడినట్లు తెలిసింది. అయితే ఈ భేటీ అనంతరం.. 'మా సినిమా కోసం ఏమి చేయాలో అది చేస్తామని జగన్​ అన్నారు' అని రాజమౌళి చెప్పారు.

    400 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన "RRR"లో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా తెరకెక్కిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌'పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆలియా భట్, అజయ్ దేవగన్, శ్రియా శరణ్, ఒలీవియా మోరిస్, సముద్రకని RRRలో భాగమయ్యారు. దీనికి ఎం ఎం కీరవాణి సంగీతం, సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందించారు.

    English summary
    Rajamouli reveals andhra pradesh governemnt help to RRR over release.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X